‘కికీ చాలెంజ్’.. ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తూ, వారిని నడిరోడ్లపై నాట్యం చేయిస్తూ, పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ‘ఈ చాలెంజ్ చాలా ప్రమాదకరం’ అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తోన్న వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతరం మొదలుకొని సెలబ్రిటీస్ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు వీరి కోవలోకి ఒక వడోదర ఆంటీ చేరారు.