రెజీనా (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి అందులో భాగస్వాములు కావడంతోనే అసలు తంటాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే తమ అభిమాన నటీనటులు, క్రికెటర్లు లేక ఇతర రంగాల వాళ్లు ఎవరు ఏది చేసినా వారి ఫ్యాన్స్ అది ఫాలో అవుతుంటారు. కానీ కిక్ చాలెంజ్ లాంటి ప్రమాదకర విషయాల జోలికి వెళ్లొద్దని ఇదివరకే దీని ప్రభావం ఎక్కువగా కర్ణాటక, ముంబైలలో పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది.
Not just a risk for you but your act can put life of others at risk too. Desist from public nuisance or face the music ! #DanceYourWayToSafety #InMySafetyFeelingsChallenge pic.twitter.com/gY2txdcxWZ
— Mumbai Police (@MumbaiPolice) 26 July 2018
ఇటీవల నటి అదాశర్మ కికి చాలెంజ్ స్వీకరించి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ కదులుతున్న కారు పక్కన కాకుండా ఆగి ఉన్న వాహనం పక్కన స్టెప్పులేశారు. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత టాలీవుడ్ మరో నటి రెజీనా కూడా కికి చాలెంజ్‌ను స్వీకరించారు. హాఫ్ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి వీరి అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
#inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋
— ReginaCassandra (@ReginaCassandra) 29 July 2018
This is the craziness that goes on between shots... 🙄😛
Video and styling: @jaya_stylist
Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt
హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా కదులుతున్న వాహహం పక్కనే ముందుకు సాగుతూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. అయితే ఇది మీకు మాత్రమే కాదు, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు. ఎలాంటి జన సంచారం, రద్దీలేని రోడ్లపై ఇలాంటివి చేయాలని, అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరించడకపోవడమే ఉత్తమమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment