హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా కదులుతున్న వాహహం పక్కనే ముందుకు సాగుతూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. అయితే ఇది మీకు మాత్రమే కాదు, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు. ఎలాంటి జన సంచారం, రద్దీలేని రోడ్లపై ఇలాంటివి చేయాలని, అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరించడకపోవడమే ఉత్తమమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.