కాజల్, అల్లుడు శీను వెరైటీ ‘కీకీ’ వీడియో | Kajal Agarwal And Bellamkonda Funny KIKI Challenge Video | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 12:15 PM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

Kajal Agarwal And Bellamkonda Funny KIKI Challenge Video - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్‌ ఫేమస్‌ అయింది. ఎంతో మంది ప్రమాదాల భారిన పడ్డారు కూడా. ఈ చాలెంజ్‌ మన దేశంలోనూ విస్తరించి హల్‌చల్‌ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ చాలెంజ్‌ను స్వీకరించారు. పోలీసులు ఈ చాలెంజ్‌ను నిషేదించడంతో కొంతవరకు దీని హవా తగ్గింది. 

అయితే తాజాగా కాజల్‌ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్‌ కలిసి ఈ కీకీ చాలెంజ్‌ను వెరైటీగా ప్రయత్నించారు. కదిలే కారులోంచి కాకుండా.. వీల్‌ చైర్‌లోంచి దిగి విభిన్నంగా చేశారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. మధ్యలో ఈ కీకీ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినట్టున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement