కీకీ ఛాలెంజ్‌.. అవార్డు మనోళ్లదే | Telangana Desi Kiki Challange Won Award | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 5 2018 11:24 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

Telangana Desi Kiki Challange Won Award - Sakshi

కీకీ ఛాలెంజ్.. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నడుస్తున్న కిరి కిరి. రన్నింగ్‌లో ఉన్న కారు నుంచి రోడ్డుపై దిగి డ్యాన్స్ చేసి, తిరిగి అదే కారులోకి దూకి మరికొందరికి ఛాలెంజ్‌ విసరటం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా. కొందరు మాత్రం దాన్ని వీడలేకపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు యువ రైతులు కూడా తమ వంతుగా ఈ ఛాలెంజ్‌లో పాలు పంచుకున్నారు. పోలం దున్నుతూ చేసిన ఈ ఛాలెంజ్‌ తాలూకు వీడియో హిల్లేరియస్‌గా ఉండటమే కాదు. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో తెగ మారుమోగిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది కూడా.

తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనీల్ కుమార్(24), పిల్లి తిరుపతి(28). కీకీ ఛాలెంజ్‌కు సరదాగా యత్నించాలని డిసైడ్‌ అయ్యారు. వరినాట్ల సందర్భంగా ఎద్దులతో  పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ ‘ఇట్స్ మై ఫీలింగ్స్’ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న పాట.. దానికి దేశీ టచ్.. ఇంకేముంది? ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘మై విలేజ్‌ షో’ ఫేమ్‌ శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్ లో ఈ నెల 1న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.6 కోట్ల మంది చూశారు. (కారు లేకున్నా...)

ఈ వీడియో వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. ప్రముఖ కెనడియన్ కమెడియన్, టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోవా.. కీకీ చాలెంజ్ లో ఈ ఇద్దరు యువ రైతులు విజేతలుగా నిలిచినట్లు ప్రకటించాడు. బాలీవుడ్‌ నటుడు ఫేమ్ వివేక్ ఒబెరాయ్ కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలియదంటున్న అనిల్‌ తల్లిదండ్రులు నిర్మలా-మల్లేషన్‌లు తమ కొడుక్కి వస్తున్న పేరును చూసి ఆశ్చర్యపోతున్నారు. తన ఇంతపేరు తీసుకొచ్చిన ‘కికీ చాలెంజ్’  గౌరవార్థం తిరుపతి తన కొడుక్కి కికీ అని ముద్దు పేరు పెట్టుకున్నాడు. డ్రోన్‌ సాయంతో హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌  చేసిన వీడియోకు రానీ గుర్తింపు.. ఈ కుర్రాళ్లు సరదాగా చేసిన యత్నానికి దక్కటం గమనార్హం.

                                                               అనిల్‌.. తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement