
సెకన్లు, నిమిషాల వ్యవధిలో కార్చిచ్చులా వ్యాపించి అందరినీ చేరుకునే సత్తా ఉండటం సోషల్ మీడియాలో కొత్త పోకడలకు ఆస్కారమిస్తోంది. ఆ సిత్రాలు కొన్ని చూస్తే...
బాటిల్ క్యాప్ చాలెంజ్
సీసా మూతను కాలితో తీసే చాలెంజ్ పేరే బాటిల్ క్యాప్ చాలెంజ్. టైక్వాండో ఇన్‌స్ట్రక్టర్ ఫరాబీ డవ్లెట్‌చిన్ దీన్ని ప్రారంభించారు. నేలపైనగానీ, బల్లపైన గానీ ఒక సీసాని ఉంచి, దాని మూతను వదులుగా పెట్టాలి. కాలితో సీసా మూత ఊడిపోయి కిందపడేలా చేయాలి. సీసా మాత్రం పడకూడదు. బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, గోవింద, పరిణీతి చోప్రా, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు.
కికీ చాలెంజ్
కదులుతున్న కారులోంచి దిగడం.. పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేయడం... ఇదీ కికీ ఛాలెంజ్!!. యువత ఈ చాలెంజ్‌ను క్షణాల్లో వైరల్‌గా మార్చేసినా.. చాలా చోట్ల ఈ చేష్టలు ప్రమాదాలకూ కారణమ య్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో పోలీసులు.. ఈ చాలెంజ్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీచేయాల్సిన పరిస్థితులొచ్చాయి.
ఫిట్‌నెస్ చాలెంజ్
ఈ చాలెంజ్ ప్రకారం యోగా చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ప్రధాని మోదీ యోగా వీడియోలూ మథ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. క్రీడాకారులూ, బాలీవుడ్ నటులు ఇంకా ఎందరో ఇందులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment