Roundup
-
సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. జులై 27న విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ.. పిల్లల వీడియోలు షేర్ చేయ్యొదంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో నటి నటులపై ట్రోలింగ్ వీడియోలు డార్క్ కామెడీ పేరుతో వీడియోలు వేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించాడు. చెప్పినట్లుగానే నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)భారతీయుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాని అవమానించినట్లుగా ఉన్నాయంటూ సిద్ధార్థ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో సిద్దూ వెంటనే స్పందించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.(పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరితో పాటు మొత్తం 8 అవార్డులను సోంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. శంకర్ మేకింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా తగ్గిపోయాయి. (‘భారతీయుడు 2’ సినిమా రివ్యూలో కోసం క్లిక్ చేయండి)రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా చిత్రం ఈ నెల 12న విడుదలైంది. రీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ట్రైలర్ జులై 10న విడుదల అయింది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. (ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార సాంగ్ జూలై 10నరిలీజ్ అయింది. (సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్. అయ్యింది ఈ సినిమా జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. (ట్రైలర్ కోసం క్లిక్ చేయండి)కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాకు ‘క’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలవుడ్ నటులు సందడి చేశారు. మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు టాలీవుడ్ తారలు ఈ వివాహానికి హాజరయ్యారు. -
లోక్‌సభ టుడే రౌండప్.. ప్రధాని స్పీచ్ హైలైట్స్
లోక్‌సభ సమావేశాలు మంగళవారం(జులై 2) హాట్‌హాట్‌గా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత ఉదయం విపక్ష పార్టీల సభ్యులు పలువురు మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై జరిగిన చర్చకు సాయంత్రం ప్రధాని మోదీ సమాధానమిచ్చారు.ప్రధాని ప్రసంగిస్తుండగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు ఒక దశలో వెల్‌లోకి దూసుకువచ్చారు. నీట్, అగ్నివీర్లపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. చివరకు సభలో నీట్‌పై ప్రధాని ప్రకటన చేయక తప్పలేదు. ప్రధాని ప్రసంగం పూర్తయిన తర్వాత సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. కాంగ్రెస్,రాహుల్ టార్గెట్‌గా ప్రధాని ప్రసంగం.. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా రాహుల్ సోమవారం సభలో చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ప్రధాని స్పీచ్ సాగింది. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్డీఏను ఓడించామనే భ్రమలో ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. వరుసగా మూడుసార్లు ప్రజలు కాంగ్రెస్‌ను 100 సీట్లలోపే పరిమితం చేశారని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చింది 100 కాదని 99 సీట్లని గుర్తుచేశారు. మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన చోటే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని, సింగిల్‌గా పోటీచేసిన చోట కాంగ్రెస్ చతికిలపడిందన్నారు.ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని, సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. తాము పదేళ్ల పాలనలో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, ప్రపంచంలోనే భారత్‌ను మూడవ అతిపెద్ద ఎకానమిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. చివరగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని సంతాపం ప్రకటించారు. నీట్‌పై ప్రకటన చేసిన ప్రధాని నీట్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రభుత్వంపై విపక్షాల ఒత్తిడి పనిచేసింది. ప్రధాని లోక్‌సభ ప్రసంగంలో నీట్ పేపర్‌లీక్‌పై స్పందించారు. పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు.స్పీచ్ తొలగించడంపై రాహుల్ షాక్..అంతకుముందు రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలో కొన్ని వివాదాస్పద అంశాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ ప్రకటనపై రాహుల్‌గాంధీ స్పందించారు. తన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యానన్నారు. తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈవీఎంలపై అఖిలేష్ సంచలన కామెంట్స్.. లోక్‌సభ మార్నింగ్ సెషన్లో మాట్లాడిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి నైతిక విజయం సాధించిందన్నారు. బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైందన్నారు. జూన్ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించిందని తెలిపారు. వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయని విమర్శించారు. తమకు 80 సీట్లు వచ్చిన ఈవీఎంలను నమ్మేది లేదని అఖిలేష్ తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడిచేది కాదని, పడిపోయే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.ఎన్నికలు బాండ్లు పెద్ద స్కామ్: కేసీ వేణుగోపాల్ కాగా, రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల పైకప్పులు కూలిపోయాయన్నారు. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయని, రామ మందిరంలో నీరు లీక్ అవుతోందన్నారు. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయని విమర్శించారు. ఉదయం ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశంఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎన్డీయే కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలని కోరారు. లోక్‌సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని, సభ జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలన్నారు. రాజ్యసభలో ఖర్గేకు చైర్మన్ షాక్..బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభలో సోమవారం తన ప్రసంగంలో భాగంగా చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. తిరిగి మంగళవారం కూడా చైర్మన్ ధన్‌ఖడ్, ఖర్గే మధ్య వాదనలు జరిగాయి. చైర్మన్ సీటుకు ఖర్గే అసలు గౌరవమే ఇవ్వడం లేదని దన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరాం రమేష్ ఉంటే బాగుండేదని ధన్‌ఖడ్ అనడం చర్చనీయాంశమైంది. ఇక కాళ్ల నొప్పులతో తాను నిల్చొని మాట్లాడలేకపోతున్నాని ఖర్గే అనడంతో కూర్చొని మాట్లాడేందుకు ధన్‌ఖడ్ అనుమతించారు. తనను ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చోబెట్టింది సోనియాగాంధీ అని ఖర్గే అన్నారు. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
అమెరికన్ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
డాలర్ డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్‌ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నో పేపర్.. ఇకపై అంతా అన్లైన్ 2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్‌లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్‌పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 2023 లో, యూఎస్ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్మెంట్ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్‌కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్ అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. -
ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్ @ 18 October 2023
-
Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్.. ఒక రాణి
ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్ మాకొద్దు అంటూ ఇరాన్ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే... వార్తల్లో వ్యక్తులు జెలెన్స్కీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కవర్ పేజీ ప్రచురించింది. రిషి సునాక్: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ను గట్టెక్కించడంలో లిజ్ ట్రస్ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ప్రధానిగా అక్టోబర్ 25న పదవీ ప్రమాణం చేశారు. ఎలాన్ మస్క్: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం. విషాదాలు ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. ► సోవియెట్ యూనియన్ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్ శాంతి బహుమానం ఆయనను వరించింది. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు. ఎన్నికలు ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అక్టోబర్ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ► బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం. ► ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ► నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్–మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ► అఫ్గానిస్తాన్‌లో జూన్ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. ► జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్ నాటికి పాకిస్తాన్లో వరద నష్టం 14.9 బిలియన్ డాలర్లుగా వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్ఎల్–షేక్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అవీ ఇవీ ► అమెరికాలో మారిలాండ్లో బాల్టిమోర్‌లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం ► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్‌ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్ వేడ్ తీర్పుని జూన్ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు. ► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నవంబర్ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది . ► కోవిడ్–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా. పుతిన్ యుద్ధోన్మాదం ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్ చేసింది. ఇరాన్లో మహిళల విజయగీతిక హిజాబ్ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న లాకప్‌లో ఆమె మరణించడంతో ఇరాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్‌ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2022 లో భారత రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా చాణక్యంతో బిజెపి అప్రతిహత విజయాలను నమోదు చేస్తోంది. బిజెపి బండిని జోడెద్దుల లాగా ఈ ఇద్దరు నేతలే తమ భుజస్కందాలపై పెట్టుకుని లాగుతున్నారు. దేశంలోని అన్ని పార్టీలకు కంటే అందనంత పై స్థాయిలో బిజెపిని నిలబెట్టగలిగారు. ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తొలుత ప్రధమార్ధంలో మార్చి నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా నాలుగు రాష్ట్రాలలో బిజెపి జెండా ఎగరేసింది. ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలలో వరుసగా రెండోసారి బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా ఢిల్లీ అవతల తన సత్తా చాటింది. ఇక ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రాన్ని బిజెపి తిరిగి నిలబెట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు గెలిచి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని సృష్టించారు. వరుసగా ఏడోసారి బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేరుతో ఉన్న చరిత్రను సమం చేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరేసి పరువు కాపాడుకుంది. అయితే కేవలం 0.9% తేడాతోనే అది బిజెపిపై విజయం సాధించగలిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి చవి చూడడం ఆ పార్టీకి షాక్ కలిగించింది. అయితే దీనికి జేపీ నడ్డా గ్రూపు రాజకీయాలే కారణమని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రోజున జేపీ నడ్డాను ఇంటికి సాగనంపడం ఖాయమని వార్తలు గుప్పుమంటున్నాయి. సునాయసంగా.. ఇక ఈ ఏడాదిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను బిజెపి సజావుగా సునాయాసంగా తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి ప్రతిపక్షాలను చల్లా చెదురు చేయడంలో విజయం సాధించగలిగారు. తొలుత ప్రతిపక్ష క్యాంపులో చేరిన జెడిఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు సైతం తిరిగి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మోదీ కల్పించారు. విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో మోడీ సఫలీకృతులయ్యారు. 60 శాతానికి పైగా ఓటింగ్ సాధించి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి జగదీప్ దంకర్ సునాయాసంగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే దాని వెనుక నరేంద్ర మోడీ రాజకీయ ఎత్తుగడ కనిపించింది. ఏడాదిన్నర పాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని ముట్టడించిన రైతుల అత్యధికమంది జాట్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో రైతులను సంతృప్తి పరచేందుకు ఆ వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందే పశ్చిమబెంగాల్లో జగదీప్ దంకర్ తనదైన స్టైల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతూ నరేంద్ర మోడీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ జగదీష్ ధన్కర్కు కలిసి వచ్చాయి. 16 రాష్ట్రాల్లో అధికారం.. 2022 సంవత్సరం ప్రారంభంలో బిజెపి చేతిలో 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఏడాది ముగిసే సరికి బిజెపి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీహార్ లో బిజెపికి నితీష్ కుమార్ రామ్ రామ్ చెప్పడంతో రాష్ట్రం బిజెపి చేయి జారింది. అయితే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సహకారంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి , బిజెపి తిరిగి ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోగలిగింది. ఒక రాష్ట్రం చేజారినా మరో రాష్ట్రాన్ని దక్కించుకొని తన 17వ రాష్ట్రాన్ని బిజెపి కాపాడుకోగలిగింది. అయితే ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ప్రస్తుతం బిజెపి ఈ ఏడాది ఒక రాష్ట్రాన్ని కోల్పోయి 16 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో బిజెపికి 96 సీట్లు ఉండగా మే నెలలో అది 100 సీట్ల మార్కు దాటింది. కానీ ఆ తర్వాత జూన్‌లో జరిగిన రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో అపార్టీ సంఖ్య 92 కు పడిపోయింది. లోక్‌సభలో బిజెపికి ఉప ఎన్నికల్లో ఒక సీట్ పెరిగింది. మోదీ మాటే వేదం.. బిజెపిలో నరేంద్ర మోదీ మాటే వేదవాక్కుగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోడీ అవతరించడంతో మిగిలిన నాయకులందరూ ఆయన మాట శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తున్నారు. మోడీ కున్న ప్రజాదరణను ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు అమిత్ షా అత్యంత పదునైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. సుశిక్షితులైన బిజెపి కార్యకర్తల యంత్రాంగం , ఆర్ఎస్ఎస్ అండతో ఆ పార్టీ పక్కడ్బందీగా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది . వరుసగా 8 ఏళ్ల నుంచి అధికారంలో బిజెపి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తుంది. దీనికి తోడు కార్పొరేట్ వ్యూహకర్తలు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి పార్టీకి చేరవేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ మిగిలిన పార్టీలకంటే ఒక అడుగు ముందంజలో ఉంటున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడంలోనూ బిజెపి అదే దూకుడును ప్రదర్శిస్తుంది. రకరకాల ఎత్తుగడలతో విపక్షాలను చెల్లాచెదురుచేసి తన ఆధిపత్యాన్ని సృష్టినం చేసుకుంటుంది. కాంగ్రెసే ప్రత్యామ్నాయం.. మొత్తానికి ఏడాది బిజెపి తన ఆధిపత్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి 90% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకుపోతోంది. ఏడాది మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగా ఐదు రాష్ట్రాలను బిజెపి తన ఖాతాలో వేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను, కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్రమైన పోరాటం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ బిజెపిని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికల సన్నాహక సంవత్సరం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్గడ్ లాంటి ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలోనూ బిజెపి కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడుతున్నాయి. అయితే అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలకు మధ్య ఎజెండా వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే లోక్‌సభ ఎన్నికలకు నైతిక బలం, జోష్ ఆయా పార్టీలకు లభిస్తుంది. మరి 2023 ఏ పార్టీ దశను ఎలా తిప్పుతుందనేది ప్రజలే డిసైడ్ చేయాలి. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి సై అంటారు. అయితే గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్‌గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్‌లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్‌లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్‌లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్‌లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్‌ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్‌కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్‌డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్‌గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్‌లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
ఈ ఏడాది టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అందమైన భామలు వీళ్లే..
2022లో తెలుగు సిల్వర్ స్క్రీన్ మురిసిపోయింది. ఎందుకంటే ఇక్కడి తెరపై కొత్తగా మెరిసిన నాయికలను చూసి.. వేరే భాషలో ‘స్టార్’ అనిపించుకున్న నాయికలు, కొత్తవారు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దేశీ భామలనే కాదు.. విదేశీ భామలను కూడా తెలుగు స్క్రీన్ చూపించింది. ‘హాయ్ హాయ్.. నాయికా’ అంటూ ఈ తారలను ఆహ్వానించింది మామూలుగా ఉత్తరాది భామలు ఎక్కువగా తెలుగుకి వస్తుంటారు. ఈసారి కూడా వచ్చారు. అయితే హిందీలో స్టార్ అనిపించుకుని, తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయ్యారు. దాదాపు పదేళ్లు హిందీలో హీరోయిన్గా సినిమాలు చేసిన ఆలియా భట్ ఈ ఏడాది తెలుగుకి పరిచయం కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో ఎన్టీఆర్ ప్రేయసిగా చేసిన పాత్ర ద్వారా విదేశీ బ్యూటీ ఒలీవియా మోరిస్ తెలుగు తెరపై మెరిశారు. అలాగే ముంబై బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, అనన్యా పాండే, సయీ మంజ్రేకర్‌ల టాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ ఏడాదే జరిగింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామం’ హీరోయిన్గా తెలుగులో మృణాల్‌కు తొలి చిత్రం. మరో హిందీ భామ అనన్యా పాండే (నటుడు చుంకీ పాండే కుమార్తె) నటించిన తొలి తెలుగు చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం రూపొందింది. అలాగే బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ‘గని’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తర్వాత సయీ ‘మేజర్’ (తెలుగు – హిందీ)లో ఓ హీరోయిన్గా నటించారు. ఇందులో అడివి శేష్ టైటిల్ రోల్ చేయగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘అల్లూరి’తో నార్త్ ఈస్ట్ అమ్మాయి కయాదు లోహర్, విశ్వక్సేన్ ‘ఓరి. ..దేవుడా’తో మిథిలా పాల్కర్, ఆకాష్ పూరి ‘చోర్ బజార్’తో గెహ్నా సిప్పి.. ఇలా చాలామంది తెలుగుకి వచ్చారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’తో పరిచయమైన విదేశీ భామ ఒలీవియాలానే ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన మరో విదేశీ భామ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ద్వారా ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ తెలుగుకి వచ్చారు. మరోవైపు మలయాళ కుట్టీల తెలుగు అరంగేట్రం కూడా ఈ ఏడాది బాగానే జరిగింది. మలయాళంలో అగ్ర తారల్లో ఒకరైన నజ్రియా ఎంట్రీ ఈ ఏడాది జూన్ 10న విడుదలైన ‘అంటే.. సుందరానికీ!’ చిత్రంతో కుదిరింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందిన ‘భీమ్లా నాయక్’లో ఓ హీరోయిన్గా నటించారు సంయుక్తా. ఈ చిత్రంలో రానా భార్య పాత్రలో కనిపిస్తారామె. కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ‘బింబిసార’లోనూ సంయుక్త నటించారు. మరోవైపు రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్లో వచ్చిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు రజీషా విజయన్. కాగా ‘బ్లఫ్‌మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ కాంబినేషన్లో వచి్చన ‘గాడ్సే’తో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించిన ‘సర్కారువారి పాట’లో సౌమ్య మీనన్ నటించారు. కీర్తి ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తారు సౌమ్య. ఇంకోవైపు సత్యదేవ్ హీరోగా నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుర్తుందా.. శీతాకాలం’లో కన్నడ భామ కావ్యా శెట్టి హీరోయిన్గా చేశారు. విశ్వక్సేన్ ‘ఓరి.. దేవుడా’లో ఓ హీరోయిన్గా చేసిన ఆశా భట్ కన్నడ బ్యూటీనే. ఈ కథానాయికలకే కాదు... టాలీవుడ్ మరెందరో తారలకు స్వాగతం పలికింది. మొత్తానికి 2022 తెలుగు సిల్వర్ స్క్రీన్ కొత్త మెరుపులను చూపించింది. -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రాజుగారి ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్ బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్.. ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందజేత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సచిన్.. ఇలా చేయడం తగునా? సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఏపీ గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. తెలంగాణ: నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని పలువురు వక్తలు హైదరాబాద్‌లో జరిగిన సంతాప సభలో వ్యాఖ్యానించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. భర్తలూ.. భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. అలాగే డాక్టర్లతో పాటు సైకాలజిస్టులు ఇచ్చే సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సౌతాఫ్రికా హెచ్‌కోచ్ పదవికి బౌచర్ గుడ్‌బై ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్‌స్టార్ సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ! చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో! చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. దీన్ని పరిష్కరించేందుకు రౌండప్ చార్జీలను ఖరారు చేశారు. గురువారం నుంచి ఈ కొత్త (రౌండప్) చార్జీలను అమలు చేయాలని ఆదేశించారు. రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ. 10 రౌండప్ చేసి ప్రయాణికుల వద్ద వసూలు చేయనున్నారు. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్ చేయనున్నారు. అలాగే.. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్ ఖరారుతో చార్జీలు రూ.65 మాత్రమే వసూలు చేయనున్నారు. -
హైదరాబాద్ రౌండప్; కోవిడ్ పరీక్షల కోసం బారులు
బంజారాహిల్స్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షల కోసం జనం బారులు తీరారు. ఒకేరోజు వందమందికి పైగా లక్షణాలతో బాధపడుతూ పరీక్షల కోసం వచ్చారు. కొంతకాలంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు మొదలు పెట్టారు. రోజురోజుకు కోవిడ్ విస్తరిస్తున్నదని జనం కూడా లక్షణాలతో పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు విచ్చేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ వేస్తుండగా మరోవైపు కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఒక్కరోజే వంద మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. గ్రేటర్లో 884 కోవిడ్ కేసులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జిల్లాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 1052 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 659, రంగారెడ్డిలో 109, మేడ్చల్ జిల్లాలో 116 (మొత్తం 884) పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వంద లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి పాజిటివ్ విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో మంగళవారం ఒక రోజే 10 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కు చేరినట్లు తెలుస్తోంది. (హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే!) 32 అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ.. 32 ప్రాంతాల్లో కూర్చొని భోజనం చేసేలా సిట్టింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. వీటిలో కొన్నింట్లో ఇప్పటికే కూర్చునే సదుపాయం అందుబాటులోకి రాగా, మిగతా ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. 4.42 లక్షల పాస్‌పోర్టులు, పీసీసీలు రాంగోపాల్‌పేట్: గత ఏడాది 4.42 లక్షల పాస్‌పోర్టులు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేశామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మంగళవారం ఆయన వార్షిక నివేదికను విడుదల చేశారు. 2020లో 2.93 లక్షలు, 2019లో 5.54 లక్షల పాస్‌పోర్టు, పీసీసీలు అందించినట్లు తెలిపారు. గత ఏడాది లాక్డౌన్ ఉన్నప్పటికీ పాస్‌పోర్టు సేవలు నిలిపివేయలేదన్నారు. అన్ని రకాల అత్యవసర పాస్‌పోర్టు అవసరాలను తీర్చినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజులు అపాయింట్మెంట్లు మాత్రం కుదించామని చెప్పారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్లలో జాప్యాన్ని నివారించేందుకు డిసెంబర్ నెలలో ప్రతి రోజు 200 అదనపు అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సాధారణ పాస్‌పోర్టు అందించేందుకు 7– 10 రోజుల గడువు పడుతుండగా తత్కాల్ మాత్రం 3 రోజుల్లో ఇస్తున్నామని వివరించారు. 7న నిజాం కళాశాలకు కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ: నిజాం కాలేజీకి ఈ నెల 7న మంత్రి కేటీఆర్ రానున్నారు. తొలిసారి జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. (చదవండి: 'బుల్లిబాయ్' యాప్ మాస్టర్ మైండ్?! ఈ శ్వేత ఎవరు!) ఈఎస్ఐసీ ఆసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కుషాయిగూడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో 960 ఎల్పీఎం కెపాసిటి కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ఫ్లాంటును ఏర్పాటు చేసింది. 1.09 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును మంగళవారం ఈసీఐఎల్ అధికారులు ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్రారంభించారు. చెరువుల సుందరీకరణకు సర్కార్ సన్నాహాలు గ్రేటర్‌లోని చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. వారసత్వ సంపద అయిన చెరువులను కాపాడేందుకు చర్యలు చేపట్టింది.హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, జలవనరుల (వాటర్ బాడీస్) సంరక్షణ, అభివృద్ధి కోసం సరికొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. చెరువులు, కుంటలు, జలవనరుల చుట్టూ పచ్చిక బయళ్లను పెంచడం ద్వారా వాటిని పరిరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని, పచ్చటి అందాల నడుమ కనిపించే చెరువులు నగరవాసులకు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించింది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం పరిసరాల్లోని చెరువులను వారసత్వ సంపదగా కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు సూచించారు. రియల్ ఎస్టేట్ విస్తరణ వల్ల చాలా చోట్ల చెరువులు మురికిగుంటలుగా మారుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, చెరువులు, కుంటల సంరక్షణ, అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే బాధ్యతలను స్థానిక డెవలపర్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు లే అవుట్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (ఎంఎస్ బి), గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వాటి డెవలప్ మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుంది.వాటర్ బాడీకి 500 మీటర్ల విస్తీర్ణం(పరిధి) వరకు వాటి నిర్వహణ సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు చెరువుల అభివృద్ధికి బాధ్యతలు చేపట్టాలి. వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్ బాధ్యతల స్వీకరణ బంజారాహిల్స్: వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిద్దిపేట కమిషనర్‌గా పనిచేశారు. వెస్ట్‌జోన్ డీసీపీగా పనిచేసిన ఎ.ఆర్.శ్రీనివాస్ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జోయల్ డేవిస్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెస్ట్‌జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై సమీక్ష నిర్వహించారు. -
బుల్ జోష్.. ఎకానమీ ఫ్లాష్!
కరోనా సెకండ్‌వేవ్‌తో దేశం అల్లకల్లోలమైనప్పటికీ... స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ మాత్రం షం‘షేర్’ అంటూ సత్తా చాటాయి. బుల్ రంకెలేయడంతో... సెన్సెక్స్, నిఫ్టీ కొత్త చరిత్రను లిఖించాయి. 62,245 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 18,604 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకాయి. మరోపక్క, ఎకానమీ కూడా వేగంగా కోలుకొని మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి బాటలోకి పయనించింది. స్టార్టప్‌ల ‘యూనికార్న్’ పరుగు... దేశీ కుబేరుల సంపద జోరు... జీఎస్టీ వసూళ్ల కొత్త రికార్డులు.. ఐపీఓల పరంపర.. వంటి కీలక పరిణామాలకు 2021 వేదికైంది. భారత కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది మిగిల్చిన జ్ఞపకాలను ఒకసారి గుర్తుచేసే ’2021 బిజినెస్ రివైండ్’ ఇది... జనవరి టిక్‌టాక్‌పై గత ఏడాది జూన్‌లో విధించిన నిషేధం నేపథ్యంలో ఈ వీడియో వ్యాపారం నిర్వహిస్తున్న బైట్‌డ్యాన్స్ భారత్‌లో కార్యకలాపాల మూతపడింది. ఇందులో భాగంగా 2000 మంది ఉద్యోగులను తొలగించింది.2020 జూన్‌లో ప్రభుత్వం దాదాపు 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. ఫిబ్రవరి ఆర్థికమంత్రి సీతారామన్ మోదీ 2.0 సర్కారులో మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకంసహా పలు ఉద్దీపన పథకాలను ప్రకటించారు. 6.8% (రూ.15,06 లక్షల కోట్లు) వద్ద ద్రవ్యలోటు కట్టడి, రూ.12.05 లక్షల కోట్ల సమీకరణ, రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ వంటివి కీలకాంశాలు. మార్చి టాటా గ్రూప్–సైరస్ మిస్త్రీల మధ్య నాలుగేళ్ల న్యాయ పోరాటంలో టాటాలే విజయం సాధించారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌నకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ సేవల విస్తరణ, పటిష్టతలో భాగం గా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను బైజూస్ ట్యుటోరియల్ చైన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ దాదాపు బిలియన్ డాలర్లు. నగదు, స్టాక్ డీల్‌లో ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఎడ్–టెక్ రంగంలో ప్రపంచంలోని భారీ ఒప్పందాల్లో ఇది ఒకటి. మే బ్యాంకింగ్‌లో వ్యక్తిగత హామీదారులపైనా దివాలా చర్యలు తీసుకోవచ్చన్న కేంద్రం నోటిఫికేషన్‌ను (2019) సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో అడాగ్ గ్రూప్ అనిల్ అంబానీ, దివాన్ హౌసింగ్‌కు చెందిన కపిల్ వాద్వాన్ తదితరులపై దివాలా కోడ్ కింద చర్యలకు మార్గం సుగమం అయ్యింది. జూన్ గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలి భారత పారిశ్రామిక పితామహుడు జమ్షెడ్జీ టాటా అని హురూన్ నివేదిక పేర్కొంది. ఆయన వితరణ 102 బి.డాలర్లని (ఇప్పటి మారకపు విలువలో దాదాపు రూ.7.65 లక్షల కోట్లు) తెలిపింది. తర్వాత స్థానాల్లో బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ ఉన్నారు. జూలై ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు బీమా రక్షణను రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని ఇకపై మారటోరియం విధించిన బ్యాంకులకూ వర్తించేలా డీఐసీజీసీ, 1961 చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. యస్ బ్యాంక్, పీఎంసీ వంటి పలు బ్యాంకుల సంక్షోభంతో కస్టమర్ల కష్టాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. సెప్టెంబర్ n జనరల్ మోటార్స్, హర్లే డేవిడ్సన్ వంటి దిగ్గజాల బాటలోనే యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. n ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెల్కోలకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం, ఏజీఆర్ నిర్వచనాన్ని సవరించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అక్టోబర్ ► ఫోర్బ్స్ కుబేరుల (భారత్) లిస్టులో 14వ ఏడాదీ ముకేశ్ అంబానీ టాప్‌లో, రెండో స్థానం లో అదానీ నిలిచారు. టాప్ 100లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మురళి దివి (19) సతీష్‌రెడ్డి(69), పీసీ రెడ్డి(79), ప్రతాప్ రెడ్డి(88), రామ్ ప్రసాద్ రెడ్డి(90) ఉన్నారు. ► ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు 2024 డిసెంబర్ వరకూ కేంద్రం పొడిగించింది. నవంబర్ ► ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ► ఎస్బీఐ మాజీ ఛైర్మ న్ ప్రతిప్ చౌదరి అరెస్టయ్యారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారానికి సంబంధించి దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తులో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ. డిసెంబర్ ► ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇండియన్ అమెరికన్ గీతా గోపీనాథ్ (49) పదోన్నతి పొందుతున్నారు. బహుళజాతి బ్యాంకింగ్ సేవల సంస్థ నెంబర్ 2 స్థానంలో ఒక మహిళ నియమితులుకావడం ఇదే తొలిసారి. ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం దిశగా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బుల్ చల్..:కరోనా దెబ్బ పడినా... భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది దుమ్ముదులిపేశాయి. ఎన్ని ఆటుపోట్లకు లోనైనా అక్టోబర్ 18న సెన్సెక్స్ 61,963 వద్ద, నిఫ్టీ 18,543 వద్ద ఆల్‌టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ ఏడాది మొత్తం సెన్సెక్స్ 21 శాతం (10,043 పాయింట్లు), నిఫ్టీ 23 శాతం (3221 పాయింట్లు) చొప్పున ఎగబాకాయి. ఇన్వెస్టర్లూ రికార్డు స్థాయిలో రూ.72 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. -
Roundup-2021: కరోనా కాటేసినా కోలుకున్న టాలీవుడ్.. హిట్ మూవీస్ ఇవే
గత ఏడాది 65 చిత్రాలతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది స్ట్రయిట్, డబ్బింగ్‌తో కలిపి దాదాపు 225 చిత్రాలతో ముగుస్తోంది. ఓటీటీ, కరోనా భయం కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా అనే సందేహాల మధ్య 2021 ఆరంభమైంది. అయితే వెండితెర అనుభూతిని పొందాలని కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. 50 శాతం సీటింగ్... నైట్ కర్ఫ్యూల ప్రభావం వసూళ్లపై పడినా ఆ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని బ్లాక్బస్టర్లు ఇండస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టాయి. నూతనోత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేలా చేశాయి. 2021 రౌండప్ చూద్దాం. 2021 జనవరి 1న నాని ‘వి’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా..’, ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన ‘డర్టీహరి’, (2020లో ఇవి ఓటీటీలో విడుదలయ్యాయి) థియేటర్స్‌లోకి వచ్చాయి. లాక్డౌన్ నుంచి తేరుకుని అప్పుడప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో అసలు సిసలైన సందడి మొదలైంది మాత్రం సంక్రాంతి పండక్కే. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతికి విడుదలయ్యాయి. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే ఈ సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్’ బాక్సాఫీసు దుమ్ము దులిపింది. ఆ తర్వాతి నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిల తొలి చిత్రం ‘ఉప్పెన’ ఘనవిజయం అందుకుంది. అలాగే ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ కూడా బాక్సాఫీస్ దగ్గర భేష్ అనిపించుకుంది. మార్చిలో వచ్చిన 20 చిత్రాల్లో శర్వానంద్ ‘శ్రీకారం’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, ఆది సాయికుమార్ ‘శశి’, నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’, శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ వంటివి ఉన్నాయి. కాగా చిన్న చిత్రాల్లో ఘనవిజయం సాధించిన చిత్రంగా ‘జాతి రత్నాలు’ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. సమ్మర్ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్. కానీ ఈ సీజన్ కరోనా భయంతో స్టార్ట్ కావడంతో థియేటర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో గుర్తుంచుకోదగినవి నాగార్జున ‘వైల్డ్ డాగ్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. ‘వైల్డ్ డాగ్’ ఫర్వాలేదనిపించుకుంది. ‘వకీల్ సాబ్’ మంచి వసూళ్లు రాబట్టాడు. కాగా, కరోనా విజృంభణతో మే, జూన్ నెలల్లో థియేటర్లకు తాళం పడింది. బ్రేక్ తర్వాత: లాక్ డౌన్ తర్వాత జూలై చివర్లో తెర సందడి ఆరంభమైంది. సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజా సజ్జా ‘ఇష్క్’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాతి నెలలో వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, విశ్వక్ సేన్ ‘పాగల్’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ వంటివి ఆదరణ పొందాయి. సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫర్వాలేదనిపించుకుంది. బాక్సాఫీస్ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో గోపీచంద్ ‘సీటీమార్’ మోత బలంగా వినిపించింది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే ఉత్సాహాన్ని అక్టోబరులో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, రోషన్ ‘పెళ్లి సందడి’ కొనసాగించాయి. నవంబరులో దాదాపు 23 చిత్రాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక డిసెంబరు ఆరంభమే ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీసును ఓ మోత మోగించారు బాలకృష్ణ. ఆ సక్సెస్ ఊపును అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘శ్యామ్ సింగరాయ్’ కొనసాగించాయి. ఈ నెలాఖర్లో అరడజనకు పైగా చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో రానా ‘1945’, శ్రీ విష్ణు ‘అర్జుణ ఫల్గుణ’, కీర్తీ సురేష్ ‘గుడ్‌లుక్ సఖి’ ప్రధానమైనవి. కానీ కొన్ని వాయిదా పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ బొమ్మ.. ఈ ఏడాది రిలీజైన 225 చిత్రాల్లో అనువాద చిత్రాలు 50 వరకూ ఉన్నాయి. ఈ డబ్బింగ్ బొమ్మల్లో హీరో విజయ్ ‘మాస్టర్’ ఫర్వాలేదనిపించుకుంది. అలాగే దర్శన్ ‘రాబర్ట్’, కార్తీ ‘సుల్తాన్’ , ఏఆర్ రెహమాన్ నిర్మించిన ‘99 సాంగ్స్’, సిద్ధార్థ్ ‘ఒరేయ్...బామ్మర్ది’, విజయ్ సేతుపతి ‘లాభం’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ విడుదలయ్యాయి. అయితే కంగనా రనౌత్ ‘తలైవి’, శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’లు ఆకట్టుకోగలిగాయి. పెద్ద చిత్రాల్లో రజనీకాంత్ ‘పెద్దన్న’, శివరాజ్‌కుమార్ ‘జె భజరంగీ’, మోహన్‌లాల్ ‘మరక్కర్’ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. హాలీవుడ్ తెలుగు అనువాదాల్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్’, ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ సూపర్ కలెక్షన్స్‌ను సాధించాయి. ఇంకా ‘డోంట్ బ్రీత్’, ‘జేమ్స్ బాండ్’ (నో టైమ్ టు డై), ‘ది కంజ్యూరింగ్’, ‘వెనోమ్, ‘రెసిడెంట్ ఈవిల్’ వంటి సిరీస్‌ల్లోని తాజా చిత్రాలను ఇంగ్లిష్ మూవీ లవర్స్ చూశారు. నెట్టింట్లోకి.. కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీలకు వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ప్రధానంగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే. వెంకటేశ్ ‘నారప్ప’, ‘దృశ్యం 2’, తెలుగులోకి అనువాదమైన సూర్య ‘జై భీమ్’ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫర్వాలేదనిపించుకుంది. చిన్నవాటిలో ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ‘సినిమా బండి’లకు ఆదరణ లభించింది. నాని ‘టక్ జగదీష్’, రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’, శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’, సత్య ‘వివాహభోజనంబు’, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిల ‘అన్‌హార్డ్’, నవీన్‌చంద్ర ‘సూపర్ ఓవర్’, ‘చిల్ బ్రో’, సముద్రఖని ‘ఆకాశవాణి’, కార్తీక్‌రత్నం ‘అర్ధ శతాబ్దం’, రామ్స్ ‘పచ్చీస్’, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య చేసిన ‘క్యాబ్ స్టోరీస్’ వంటివి నెట్టింట్లోకి వచ్చాయి. -
తడ‘బడి’.. 2021లో విద్యారంగంలో ఎత్తుపల్లాలు
కరోనా కరాళ నృత్యం విద్యారంగాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కువ కాలం మూతపడ్డ విద్యాసంస్థలు.. ఆన్లైన్ బోధన హడావుడి.. అరకొరగా ప్రత్యక్ష బోధన.. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులు..ఏ పరిణామం ఎలా ఉన్నా అన్ని కోర్సుల్లో ఇబ్బంది లేకుండా ప్రవేశ పరీక్షలు దిగ్విజయంగా నిర్వహించామన్న ప్రభుత్వ సంతృప్తి... ఇవీ 2021 సంవత్సరంలో విద్యారంగం స్థూలంగా ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు. – సాక్షి, హైదరాబాద్ సంవత్సర ఆరంభం నుంచీ విద్యారంగాన్ని కరోనా చీకట్లు ముసిరాయి. జూన్‌లో మొదలవ్వాల్సిన విద్యా సంవత్సరం అక్టోబర్‌కు చేరుకుంది. అప్పటిదాకా ఆన్లైన్ బోధనే విద్యార్థులకు శరణ్యమైంది. ఈ తరహా బోధన పల్లెకు చేరలేదనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆన్లైన్ బోధన వల్ల విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, చిన్న తరగతుల విద్యార్థుల్లో రాయడంతోపాటు చదివే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గినట్లు పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. కరోనా తీవ్రత తగ్గడంతో అక్టోబర్ నుంచి ప్రత్యక్ష బోధన మొదలైనా.. చాలాకాలం భయం వెంటాడింది. ఆన్లైన్ వ్యవస్థకే విద్యార్థులు మొగ్గు చూపారు. ఉన్నత విద్యలో ఒరవడి ♦ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని నియమించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ పదవిలో సరికొత్త మార్పులకు లింబాద్రి శ్రీకారం చుట్టారు. ♦చాలా విశ్వవిద్యాలయాలకు 2021లోనే కొత్త ఉపకులపతులు వచ్చారు. వీళ్లంతా సంస్కరణలతో సాగిపోవడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ విప్లవాత్మక మార్పులకు ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ఉమ్మడి పాఠ్య ప్రణాళిక దిశగా అడుగులు పడ్డాయి. ♦కరోనా కాలమైనా అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేయడంలో ఉన్నత విద్యామండలి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎంసెట్ సకాలంలో పూర్తి చేసి ఇంజనీరింగ్ సీట్లు కేటాయించింది. అలాగే, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్, ఫిజికల్ సెట్ అన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేయడం ఈ ఏడాది ప్రత్యేకత. ఈ ఏడాది కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టడం విశేషం. ఈ కోర్సుల ద్వారా ఆర్థిక, రాజకీయ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఈ కోర్సులను అనుభవజ్ఞులైన రాజకీయ, ఆర్థికవేత్తలతో బోధించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ గలాబా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యాబోధన ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. టెన్త్‌లో పరీక్షలు లేకుండా అందర్నీ పాస్‌చేయడంతో పెద్దఎత్తున ఇంటర్లో ప్రవేశాలు పొందారు. రెండేళ్లుగా సాగిన ఈ ప్రహసనం ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై పెనుప్రభావం చూపింది. ఉత్తీర్ణత 49 శాతం దాటకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనికి రాజకీయం కూడా తోడవడంతో పెను దుమారం రేగింది. ఆన్లైన్ బోధన చేరని గ్రామీణ ప్రాంతాల్లోనే ఫెయిలైన విద్యార్థులున్నారని, పట్టణప్రాంతాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండటం వల్ల ఉత్తీర్ణత పెరిగిందనే విమర్శలు ఇంటర్మీడియెట్ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పనిపరిస్థితి నెలకొంది. ఫెయిలైన 2.35 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడం ఈ ఏడాది విద్యారంగంలో జరిగిన పరిణామాల్లో ముఖ్య ఘట్టం. విస్తరించిన గురుకుల విద్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యక్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. కాలేజీ విద్యను సైతం నిర్బంధ ఉచిత పద్ధతిలో అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈ ఏడాది మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో గురుకుల జూనియర్ కాలేజీలను ప్రారంభించింది. తొలుత పాఠశాలలుగా ప్రారంభించిన వీటిలో కొన్నింటిని జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో 119 జూనియర్ కాలేజీలు, టీఎంఆర్ఈఐఎస్ పరిధిలో 60 జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో వీటిని ప్రారంభించినప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గురుకుల జూనియర్ కాలేజీల్లో దాదాపు నూరుశాతం సీట్లు నిండిపోయాయి. -
వివాదాలు... విచారణలు.. కంచపైనే కన్ను!
పోలీసులపై ఆరోపణలు సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు హత్యచేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేసింది. నిందితుడి కోసం వేటసాగించిన పోలీసులు సైతం ఆరోపణలకు గురిచేసేలా చేసింది. తీరా నిందితుడు వరంగల్ పరిధిలోని ఘన్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఇకపోతే యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దొంగతనం కేసులో మరియమ్మను పోలీస్ విచారణ పేరుతో హింసించి చంపారన్న ఆరోపణ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీస్ శాఖ మరియమ్మ మృతిని లాకప్‌డెత్‌గా ధ్రువీకరించి అధికారులను సస్పెండ్ చేసింది. ఒక సందర్భంలో మరియమ్మ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు ప్రస్తావించడం పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. విచారణకు సెలబ్రిటీలు హైదరాబాద్ బోయినపల్లికి చెందిన డ్రగ్ సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు కల్గిఉన్నారన్న ఆరోపణలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2017లో సినీతారలను, ప్రముఖులను విచారించింది. అయితే ఈ వ్యవహారంలో భారీస్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సినీ తారలు, ప్రముఖులనూ విచారించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, రానా, రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్, తరుణ్, సుబ్బరాజు, తనీష్, నందు, ముమైత్‌ఖాన్ ఇలా వరుసపెట్టి విచారించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఎక్సైజ్ విచారణ జాబితాలో లేని దుగ్గబాటి రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు ఈడీ విచారణ ఎదుర్కోవడం మరింత సంచలనం రేపింది. చుక్కలు చూస్తున్న పోలీసులు శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారం పోలీస్ శాఖను నిద్రపోనివ్వలేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తోపాటు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్... ఇలా పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిని విచారిస్తోంది. ఈ విచారణలో అనేక తప్పులను, లోపాలను కమిషన్ గుర్తించి ప్రశ్నించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు ఎప్పుడు కమిషన్ ముందు విచారణ ఎదుర్కొంటారో అన్న అంశాలు అధికారులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. చిట్టీలు.. చీటింగ్‌లు కలర్‌ఫుల్ సెట్టింగ్‌లు.. దానికి మించి లగ్జరీ కలరింగ్.. కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయలను తీసుకొని మోసం చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి శిల్పాచౌదరి సినిమా ప్రొడ్యూసర్‌గా పేరుగడించి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించింది. ఈ వ్యవహారంలో సినీ హీరో కృష్ణ కుమార్తెతోపాటు అనేకమంది బాధితులయ్యారు. కిట్టీ పార్టీల పేరుతో పార్టీలు నిర్వహించడం, డబ్బున్న వారిని టార్గెట్ చేసి అడ్జెస్ట్మెంట్ పేరుతో రూ.100 కోట్లకుపైగా బురిడీ కొట్టించినట్టు సైబరాబాద్ పోలీసులు అంచనావేశారు. ఈ వ్యవహారం ఒకవైపు సైబరాబాద్‌లో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు సంధ్య బిల్డర్డ్స్ యాజమాని శ్రీధర్‌రావు వ్యవహారం మరింత కాక రేపింది. భవన నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని, భవనాలు అప్పగించకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈయనపై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగని శ్రీధర్‌రావు ఏకంగా తన బాడీగార్డుగా ఉన్న జిమ్ ట్రైనర్‌పై లైంగికదాడికి పాల్పడటం తీవ్ర సంచలనమైంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడితో చేసిన సెటిల్మెంట్ వ్యవహారం మరింత రచ్చ రేపింది. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి ఈ ఏడాది కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఒకవైపు కరోనాతో కేంద్ర కమిటీ నుంచి గెరిల్లా కమిటీ సభ్యుల వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడగా.. పోలీసుల ఆపరేషన్లతో సీనియర్ నాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఏవోబీకి పెద్దదిక్కుగా ఉన్న ఆర్కే (రామకృష్ణ) మృతి పార్టీకి తీరని లోటు తెచ్చిపెట్టింది. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్దుంబ్డే, డివిజన్ కార్యదర్శి, ఏసీఎం సభ్యులు సహా 26 మంది ఒకే ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కోవిడ్‌తో మృత్యువాతపడటం రాష్ట్ర కమిటీని అఘాతంలోకి నెట్టింది. నేతల లొంగుబాట్లు ఒకవైపు జరుగుతుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు ప్రశాంత్ బోసే అలియాస్ కిషన్ దా, అతడి భార్య మారండిని అరెస్టయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీకి 2021 తీర్చలేని నాయకుల లోటును తెచ్చిపెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఇకపోతే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు జరపడం కలవరం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధా రంగా ఈ సోదాలు చేసినట్టు ఎన్ఐఏ చెప్పింది. మావో అనుబంధ సంఘాలపై ఉఫా చట్టం కింద కేసులు నమోదు చేయడంపై వామపక్ష సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశాయి. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు... తెలుగు అకాడమీకి చెందిన రూ.65 కోట్లకు పైగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు, మధ్యవర్తులు, బ్యాంక్ ఉద్యోగులు కలిసి నొక్కేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురిచేసింది. నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను తయారుచేసి అకాడమీ అధికారులను బురిడీ కొట్టించిన మధ్యవర్తులు.. బ్యాంక్ అధికారులతో దోచేసిన వ్యవహారం పెను దుమారం రేపింది. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతోపాటు ఈడీ విచారణ జరిపి మధ్యవర్తులు భారీస్థాయిలో ఆస్తులు మళ్లించినట్టు నిరూపించారు. ఈ కేసులో అకాడమీలోని తాత్కాలిక ఉద్యోగులతోపాటు రెండు ప్రధాన బ్యాంకుల మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తులకు వెళ్లిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈజీ లోన్స్.. దుమ్మురేపిన ఈడీ ఈజీ లోన్స్ పేరుతో మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వేధించిన వ్యవహారంలో ఇటు రాష్ట్ర పోలీసులు, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు దేశంలోని కూడోస్ ఎన్బీఎఫ్సీ వేదిక ద్వారా రూ.2,600 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి సహకరించిన కూడోస్ ఎన్బీఎఫ్సీ వ్యవస్థాపకుడు పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టింది. అదేవిధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఇండస్ వీవా వసూలు చేసిన రూ.1,500 కోట్ల స్కాం కేసులో ఈడీ సహవ్యవస్థాపకుడితోపాటు కీలక సూత్రధారి అయిన సీఏ అంజర్, అభిలాష్ థామస్‌ను అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో రూ.360 కోట్ల ఆస్తులను ఈడీ జçప్తు చేసింది. అదేవిధంగా అగ్రిగోల్డ్ స్కాంలో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈ ఏడాది వరకు దశల వారీగా జప్తు చేసినట్టు పేర్కొంది. ఇకపోతే రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్‌లో కీలక సూత్రధారి దేవికారాణి బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మృత్యు‘దారులు’.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి పరిధిలోని హెచ్‌సీయూ బస్‌డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నిపంగా, ప్రమాదానికి గురైన కారు రెండు ముక్కలవడం ప్రమాద సమయంలో కారు స్పీడును చెప్పకనే చెబుతోంది. కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించడం ఆందోళన కల్గించింది. ఈ ఏడాది పబ్‌ల్లో పీకల దాకా మద్యం సేవించి యువతీ యువకులు వాహనాలు నడపడం వల్ల 14 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీస్ శాఖ గుర్తించింది. ఇందులో 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తంగా 15,600 ప్రమాదాలు జరగ్గా అందులో 4,600 మందికి పైగా మృతిచెందినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. 12వేల మందికి పైగా క్షతగ్రాతులైనట్లు సమాచారం. ఇంటి దొంగలపై సీబీ‘ఐ’ బ్యాంకుల్లో మేనేజర్లుగా పనిచేస్తూ అక్రమార్కులకు సహకరించిన వ్యవహారంలో సీబీఐ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. ఇలా ఈ ఏడాదిలో 13 కేసులు నమోదు చేయగా అందులో 9 కేసుల్లో బ్యాంక్ అధికారుల పాత్ర కీలకంగా ఉందని సీబీఐ పేర్కొంది. మొత్తంగా రూ.600 కోట్లకు పైగా బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు కుచ్చుటోపీ పెట్టినట్టు ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు. పదోన్నతులు వచ్చినా పాతపోస్టుల్లోనే... పండుగ వచ్చినా పాత పచ్చడేనా అన్న సామెత పోలీస్ శాఖకు ఈ ఏడాది సరిపోతుందన్న చర్చ జరుగుతోంది. పదోన్నతులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా అనేక మంది అధికారులు జూనియర్ ర్యాంకు పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది పదోన్నతి వచ్చినా ఇంకా పాత పోస్టుల్లోనే కొనసాగగా, ఈ ఏడాది బదిలీ అవుతామని అనుకున్నా అది కూడా అందని ద్రాక్షగా మిగిలింది. ఇకపోతే ఏళ్లకేళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్న 40 మంది ఐపీఎస్, ఇతర నాన్‌కేడర్ అధికారులు ఈ ఏడాది బదిలీలు జరుగుతాయని భావించినా అది జరగలేదు. ఇలా ఏడాది నుంచి కలలు కన్నా అవి అడియాశలే అయ్యాయని వారు అసహనంలో మునిగిపోయారు. -
చిట్టి చిట్టి రోబో కాదు..పిల్లల్ని కనే రోబో
సాక్షి, హైదరాబాద్: రానురాను ప్రతి పనిలోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. ఇంట్లో చేసే పని దగ్గర్నుంచి పరిశ్రమల్లో పనుల దాకా మర మనుషుల వాడకం ఎక్కువవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సరికొత్త రోబోలను సృష్టిస్తున్నారు. అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలా రకరకాల రోబోలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. సంచలనాలు నమోదు చేశారు. మరి ఈ ఏటి మేటి రోబోల్లో టాప్–10 ఏంటో ఓ లుక్కేస్తారా! అంగారకుడైనా.. తిరగడం ఆపుతానా? అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా సిద్ధం చేసిన రోబో హెలికాప్టర్ ‘ఇన్‌జెన్యునిటీ’ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి. భూమిని దాటి ఇంకో గ్రహంపై సొంతంగా ఎగిరిన తొలి వాహనం ఇదే కావడం ఒక్క విశేషం మాత్రమే. 1.8 కిలోల బరువు ఉండే ఇన్‌జెన్యుటీ దాదాపు వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించగలదు. అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణాన్ని కూడా చీల్చుకుని ఎగరగల శక్తిమంతమైంది కూడా. రిమోట్ కంట్రోల్ అవసరం లేకపోవడం కొసమెరుపు! వంటేదైనా.. వండిపెట్టేస్తా ఊ అంటే.. కావాల్సిన వంట వంటి పెట్టే రోబో వ్యవస్థ ఈ మోలీ! లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మోలీ రోబోటిక్స్ తయారు చేసింది. సూప్‌తో మొదలు డెజర్ట్ వరకూ షడ్రుచులతో వంటకాలు సిద్ధం చేసేందుకు మోలీలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కావాల్సిన సరుకులను అందించడమే ఆలస్యం చెప్పిన వంటల్లా వండి పెడుతుంది. సరుకులు అయిపోయే విషయమూ ముందే సమాచారమిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసేలా నిర్దిష్ట కేలరీలతో వంటలు చేయడం, ఏ దేశపు రుచినైనా సిద్ధం చేయగలగడం మోలీలోని ఇతర విశేషాల్లో కొన్ని. మర మనిషి.. పని మనిషి ఇంట్లోని చెత్తాచెదారం ఊడవడం, తుడవడం, పాత్రలు తోమి పెట్టడం వంటి వాటి కోసం తయారైంది ఈ మనిషిని పోలిన రోబో. చైనా కంపెనీ ఉబ్ టెక్ తయారు చేసిన దీని పేరు ‘వాకర్ ఎక్స్’. మనిషి ఆకారం, చేతులు, వేళ్లు అన్నీ ఉన్న వాకర్ ఎక్స్ అన్ని రకాల వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకోగలదు. సీసా మూత తెరిచి అందులోని పదార్థాన్ని గ్లాసుల్లో పోసి అందివ్వడం, మనిషితో సరదాగా లేదా సీరియస్గానైనా చదరంగం ఆడటం, అలసిపోతే ఒళ్లు పట్టి మసాజ్ కూడా చేయగలదు. తలకిందులున్నా.. పని చేస్తే పక్కా అంతర్జాతీయ కార్ల కంపెనీ టయోటా తయారు చేసిన రోబో పనిమనిషి ఇది. గబ్బిలంగా వేలాడుతున్నట్లు కనిపిస్తుంటుంది కానీ ఇంటి పనులన్నీ చక్కబెట్టగలదు. అందుకే ఇది ఇంట్లో ఉండే ఫర్నిచర్, ఇతర వస్తువులన్నింటినీ తప్పించుకుని పనిచేయడం కాకుండా పైకప్పు నుంచి వేలాడుతూ పని చేసేలా తయారు చేశారు. 2015లో సుమారు 7,400 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన టయోటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఇంటి పనుల కోసమే వేర్వేరు రోబోలను తయారు చేస్తోంది. మహానటి.. మనిషిని, రోబోను వేరుచేసే ఒకే ఒక్క అంశం మన భావోద్వేగాలని ఒకప్పుడు చెప్పేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ భావోద్వేగాలను సూచించే ముఖ కవళికలను కూడా రోబోలు సమకూర్చుకున్నాయి. యూకేకు చెందిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ అనే సంస్థ సిద్ధం చేసిన ‘అమికా’ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మేలుకో అంటే చాలు.. ఇది గందరగోళం, నిస్పృహ వంటి ఆరు రకాల భావాలను వ్యక్తం చేస్తుంది. చేతులు కాళ్లూ చూస్తూ నోరు తెరిచి ఆవలిస్తుంది. అంతేకాదు నవ్వు, ఆశ్చర్యం, కోపం వంటి అనేక భావాలను ముఖంలోనే పలికించగల మహానటి ఈ రోబో! బరువులెత్తే పనా.. కంగారెందుకు మైహూనా ఒక రకంగా చూస్తే ఇది రోబో కాదు. మనిషి సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే యంత్రం. కాకపోతే ఇందులోనూ రోబోకు ఉండాల్సిన టెక్నాలజీలు వాడారు. అమెరికా కంపెనీ సాక్రోస్ తయారు చేసిన ఈ గార్డియన్ ఎక్స్ ఓ ను తొడుక్కుంటే సూపర్ మ్యాన్‌లా ఎగరలేము కానీ శరీరానికి అతితక్కువ కష్టంతో 90 కిలోల బరువులెత్తగలం. అలుపు లేకుండా ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయగలం. పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలతో రెండు గంటలు పనిచేయొచ్చు. నిమిషాల వ్యవధిలో బ్యాటరీలు మార్చుకోవచ్చు. మా రూటే సపరేటు ప్రాణమున్న కణాల మాదిరిగా పునరుత్పత్తి సామర్థ్యమున్న రోబోలు ఈ జీనోబోట్స్. వెర్మాంట్, టఫ్ట్స్ యూనివర్సిటీ, వైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసికట్టుగా వీటిని తయారు చేశారు. కప్ప కణాలతో తయారైన ఈ జీనోబోట్స్ పెట్రిడిష్ (గాజు పాత్ర)లో అటూ ఇటూ కదలగలవు. ఏకాకి కణాలను కలుపుకుంటూ కొత్త కణాలను ఉత్పత్తి చేయగలవు. కొన్ని కోట్ల ఆకారాలను పరీక్షించిన తరువాత వెర్మాంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్‌లోని ఎవల్యూషనరీ అల్గారిథమ్ ఇంగ్లిషు అక్షరం సీ మాదిరిగా ఉండేలా జీనోబోట్ల ఆకారాన్ని నిర్ణయించింది. క్యాన్సర్, వృద్ధాప్యాన్ని నివారించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతికేందుకు ఈ జీనోబోట్స్ ఉపకరిస్తాయని అంచనా. 20 కిలోలైనా ఎత్తుకు తిరిగేస్తా ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా సిద్ధం చేస్తున్న జనరల్ పర్పస్ రోబో. టెస్లాబోట్ లేదా ఆప్టిమస్ అని పిలుస్తున్నారు. ఇప్పటికి తయారు కాలేదు కానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్లా ‘ఏ.ఐ.’డేలో మస్క్ మాట్లాడుతూ 2022 నాటికల్లా సిద్ధమవుతుందని ప్రకటించారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 57 కిలోల బరువుతో మనిషిలాంటి నిర్మాణం ఉన్న ఈ రోబో టెస్లా అభివృద్ధి చేసిన అడాస్ కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇరవై కిలోల బరువు ఎత్తుకుని అటు ఇటు తిరగగలదు. ఫ్యాక్టరీల్లో పదే పదే చేయాల్సిన పనులను సులువుగా చక్కబెట్టగలదని అంచనా. నా చేయి.. 7 విధాలు జంతువుల ఆకారాల్లో రోబోలను తయారు చేస్తున్న బోస్టన్ డైనమిక్స్ సిద్ధం చేసిన మరో రోబో ఇది. పేరు స్ట్రెచ్. ఫొటోలో కనిపిస్తున్నట్టే గోడౌన్లలో బరువులు అటు ఇటు ఎత్తి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ప్యాకేజీలను జాగ్రత్తగా పట్టుకోవడం, క్రమపద్ధతిలో అమర్చడం వంటివి కూడా ఎంచక్కా చేసేయగలదు. ఈ రోబో చేయి 7 విధాలుగా తిరగగలదు. వేగంగా కదులుతున్న ప్యాకేజీని స్థిరంగా ఉంచేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. నడిచే చెట్టు.. పరుగెత్తు అవెంజర్స్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన వారికి ఈ క్యారెక్టర్ పరిచయమే. పేరు గ్రూట్. చెట్టు కాండం మాదిరిగా ఉంటుంది. డిస్నీ వరల్డ్‌కు చెందిన పరిశోధనశాలలో తయారైంది. కొంచెం అటు ఇటుగా రెండు అడుగుల ఎత్తుండే ఈ రోబో మనిషిలాగే నడుస్తుంది. పరుగెత్తుతుంది కూడా. ఇప్పటికింకా తయారీ దశలోనే ఉంది. -
సింహాలు... గ్రామసింహాలు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చాలారోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఈ శుక్రవారం నాడు వర్కర్స్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొరియన్ ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలను కాపాడేటందుకు అవసరమైతే అమెరికాతో సయోధ్యకైనా, సమరానికైనాసిద్ధమేనని ప్రకటించారట. ఇందులో వింత ఏముంది? ఆయన స్వభావమే అంత. కయ్యా నికి ఎన్నడూ వెనకాడని స్వభావం. ఆయన మాటల్లో వింతేదీ లేదు కానీ, ఆయన ఆకారంలో మాత్రం ఉందట. కిమ్ జోంగ్ ఉన్ కొంచెం సన్నబడ్డారు. అదీ న్యూస్. ఈ ‘కిమ్’ పురుషుని పేరు వినగానే మదిలో ఒక 140 కేజీల భారీ ఆకారం మెదులుతుంది. నెత్తిమీద తట్ట బోర్లించినట్టుగా ఉండే డిప్ప కటింగ్ హెయిర్ స్టయిల్. ఫ్యాషన్లకు వ్యతిరేకంగా ఆయన ఈ తరహా కటింగ్‌ను చేయించుకున్నారట. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిది లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. బుగ్గలు ఆయన స్పెషల్ ఫీచర్. రెండు దవడల్లో రెండు ఫుట్‌బాళ్లను ఇరికించినట్టు గుండ్రంగా ఉంటాయి. రేడియో స్వర్ణయుగం గుర్తున్నవారికి మర్ఫీ బేబీ ఫొటో గుర్తుంటుంది. ఆ పాలబుగ్గలు గుర్తుంటాయి. కిమ్ ముప్ఫయ్యేడేళ్ల మర్ఫీ బేబీ. అంతర్జాతీయ సమాజాన్నీ, మీడియాను ప్రభావితం చేయడం కోసం అడపాదడపా రకరకాల ‘మేకోవర్’లను ఆశ్రయించడం కిమ్‌కు అలవాటే. ఒక్కోసారి సూపర్‌మ్యాన్ ఇమేజ్ కోసం గుర్రమెక్కి దౌడు తీస్తాడు. అప్పుడు రెండు చేతుల్తో కోటు జేబుల్లోంచి పిస్తోళ్లను తీసుకొని స్వారీ చేస్తూనే కాల్పులు జరిపే కౌబాయ్ హీరోగా కనిపిస్తాడు. పార్టీ సమా వేశాల్లో పెద్ద తరహాగా కన్పించడం కోసం చేతిలో కాగితాలు పట్టుకొని కళ్లకు సులోచనాలను ధరిస్తాడు. ‘కిమ్’ పురుషుని గుర్రపు స్వారీ దృశ్యాల మీద అమెరికా, యూరప్ మీడియాల్లో పెద్ద చర్చే జరిగింది. ఉత్తర కొరియా – చైనా సరిహద్దులో ఉండే మౌంట్ పేక్టూ అంటే కొరియన్లకు పవిత్రభావం. హిందువులకు మౌంట్ కైలాస్ మాదిరిగా (కాక పోతే అది ఇండియాలో లేదు). తమ ‘కిమ్’ వంశ ప్రతిష్టను మౌంట్ పేక్టూతో పోల్చి చెప్పడం కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత సంతోషకరమైన విషయం. గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ ‘కిమ్’ పురుషులే ఉత్తర కొరియాను పాలిస్తున్నారు కనుక వారి వంశ ప్రతిష్టను అంగీకరించక తప్పదు. కిమ్ జోంగ్ ఉన్‌కు స్వయానా తాతపాదుల వారైన కిమ్ ఇల్ సంగ్ దేశంలో వ్యక్తిపూజను వ్యవ స్థీకృతం చేశారు. ఆయన తనకు తాను ‘గ్రేట్ కామ్రేడ్’ అనే బిరు దును కూడా ఇచ్చుకున్నారు. తాతగారి స్వార్జితమైన వంశ ‘ప్రతిష్ట’ను తండ్రిగారు భద్రంగా కాపాడి కిమ్ జోంగ్ చేతిలో పదేళ్ల క్రితం పెట్టారు. అప్పటినుంచి పేక్టూ శిఖరంతో సమాన మైన తమ వంశ గౌరవాన్ని ఈయన కూడా నిలబెట్టు కొస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచు ముసుగువేసుకున్న మౌంట్ పేక్టూ వెండి కొండలా వెలిగిపోతుంటుంది. దారికి రెండుపక్కలా ఉన్న చెట్లన్నీ మంచు తెరలు కప్పుకొని వినయంగా నిలబడి ఉంటాయి. మధ్యలోంచి తెల్లని జవనాశ్వంపై గోధుమ రంగు కోటు ధరించిన కిమ్ వస్తుంటాడు. తనను తాను అత్యంత శక్తిమంతుడిగా లోకానికి చాటుకోవడానికి కిమ్ చేపట్టిన ఇమేజ్ మేకోవర్‌గా ఈ దృశ్యాలను పాశ్చాత్య మీడియా విశ్లేషించింది. ఇప్పుడు కిమ్ కొంచెం సన్నబడ్డాడు. కారణమేమిటి? ఇదో రక మైన మేకోవరా? లేక మాయరోగమా? పరిశోధనలు జరుగు తున్నాయి. అపజయాలు వరుసగా ఎదురవుతున్నప్పుడు, లేదా కొత్త విజయాలను సాధించాలనుకున్నప్పుడు, తమ వేషభాషల్లో కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టగల మేకోవర్లను ఇప్పుడు చాలామంది ఆశ్ర యిస్తున్నారు. ఇందులో రకరకాల సెలెబ్రిటీలు, రాజకీయ నాయ కులు ముఖ్యులు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫెషనల్ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఇమేజ్ మేకోవర్ అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశమని ఈ రంగంలోని నిపుణులు చెబు తున్నారు. సదరు సెలెబ్రిటీ శక్తి సామర్థ్యాలకూ, సహజ స్వభావా నికి పూర్తి విరుద్ధమైన ఇమేజ్ను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ సెలెబ్రిటీలు అభాసుపాలు కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈమధ్య ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం వేసిన కిల్ బిల్ పాండే అనే ఒక నిస్పృహకు గురైన పోలీసాఫీసర్ పాత్ర గుర్తు కొస్తున్నది. బ్రహ్మానందం పాపులర్ కమెడియన్. కానీ, ఆ పాత్రేమో కనిపించిన అక్రమార్కులందరినీ విచక్షణారహితంగా కాల్చిపారేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రేక్షకులకు ఒడ లంతా గగుర్పాటు రావాలి. కానీ పగలబడి నవ్వుతారు. అది సినిమా కనుక, దర్శకుడు ఆశించిన హాస్య ప్రయోజనం నెర వేరింది. నిజ జీవితంలో ఇటువంటి మేకోవర్ జరిపితే ఎట్లా ఉంటుంది? జాతీయ టీవీ చానళ్లలో కిమ్ తాజా వార్త ప్రసారమైన శుక్రవారం నాడే కొన్ని తెలుగు ‘బ్రాండెడ్’ చానళ్లలో ఒక పర్యటన వార్త పదేపదే ప్రసారమైంది. కర్నూలు జిల్లాలో రెండు ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. చనిపోయిన వ్యక్తులు తమ పార్టీకి సంబంధించిన వారని చెబుతూ, ఆ పార్టీ అధ్యక్షుని కుమారుడు లోకేశ్ నాయుడు పరా మర్శకు వెళ్లారు. అంతవరకు తప్పులేదు. కానీ ఈ సందర్భంగా లోకేశ్ నాయు డితో పాటు ఆ బ్రాండెడ్ మీడియా బృందం వేసిన వీరంగం చూస్తుంటే పూర్వపు రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే యక్షగానం గుర్తుకొచ్చింది. ‘రాజు వెడలె రవితేజము లలరగా... కుడి ఎడ మల డాల్ కత్తులు మెరవగా’ అన్నట్టుగా బ్రాండెడ్ చానళ్లు ఈ పరామర్శ కార్యక్రమాన్ని ప్రసారం చేశాయి. ఒక్క హార్మోనియం, మద్దెల దరువే తక్కువ. లోకేశ్ నాయుడు అనగానే తెలుగు ప్రజల మనసుల్లో నాటు కొని పోయిన ముద్ర ఒకటుంది. బొద్దుగా ఉంటాడు. ముద్ద ముద్దగా మాట్లాడతాడు. సంభాషణలో విపరీతంగా తప్పులు దొర్లుతాయి. చాలా సందర్భాల్లో తాను చెప్పదలచుకున్న విష యాన్ని వ్యతిరేకార్థంలో చెబుతుంటాడు. ఆహార ప్రియుడు, నడుము చుట్టుకొలత సాధారణం కంటే ఎక్కువ. ఇత్యాది కార ణాల వలన సోషల్ మీడియాలో ఆయనకు పప్పు అనే పేరు స్థిరపడిపోయింది. ఎవరు పెట్టారో తెలియదుకానీ బాగా వైరల్ అయింది. ఒక దశలో గూగుల్‌లో పప్పు అని వెతికితే ఈయన బొమ్మ వచ్చేదట. నిజానికి పప్పు అనేది కించపడాల్సిన మాటేమీ కాదు, పైగా మంచి పోషకాహారం కూడా. కానీ, ఎందుకో వారికి ఈ మాట నచ్చేది కాదు. పప్పు అని సెర్చ్ చేస్తే తమ బొమ్మ రాకుండా గూగుల్‌తో లాబీయింగ్ చేసుకున్నారు. లోకేశ్ నాయుడి ఇమేజ్ మార్చడానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు. దొడ్డిదారిన చట్టసభలోకి తీసుకొచ్చి మంత్రిని చేశారు. రెండు కీలకమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ ముఖ్యులందరూ లోకేశ్‌ను సంప్రదించే విధమైన ఏర్పాటు చేశారు. అతన్నొక సూపర్ మ్యాన్‌గా చిత్రీక రించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఫలితం సాధించలేకపోయారు. లోకేశ్ నాయుడు ఒక ముఖ్యమంత్రికి ఏకైక కుమారుడు, మరో పాపులర్ ముఖ్యమంత్రి, సినీరంగ చక్రవర్తిగా వెలిగిన ఒక శిఖరప్రాయునికి మనవడు. కావలసి నంత ఆర్థిక, అంగబలం ఉన్నది. పైగా, ఎమ్మెల్యేగా గెలవడానికి అనేక ప్రాంతాల్లో సర్వేల మీద సర్వేలు చేసుకొని ఏరికోరి మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేపై గెలవలేక చతికిలబడ్డారు. కనుక లోకేశ్ నాయుడికి ఏర్పడిన ఇమేజ్ ఆయన స్వయంగా సంపాదించుకున్న కష్టార్జితమే తప్ప ఎవరో ఆపాదించింది కాదని రూఢీ అయింది. లోకేశ్ నాయుడు ఈ మధ్యకాలంలో కొంత సన్నబడ్డారు. కిమ్ జోంగ్ ఉన్, లోకేశ్‌నాయుడు ఒకే కాలంలో సన్నబడడం జస్ట్ కాకతాళీయమే. ఇద్దరికీ ఏమాత్రం పోలిక లేదు. లోకేశ్ నాయుడు తండ్రిగారి మాదిరిగా కొద్దిగా గడ్డం కూడా పెంచారు. ఇదంతా ఏదో రొటీన్‌గా జరిగిన వ్యవహారం కాదు, మేకోవర్ శిక్షణలో ఉన్నారనే సంగతి కర్నూలు పర్యటనతో వెల్లడైంది. అక్కడాయన ఆవేశంతో ఊగిపోయారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసే తెలుగు సినిమా డైలాగులు వినిపించారు. ఎట్లా మాట్లాడాలనే దానిపై తర్ఫీదైతే తీసుకున్నట్టున్నారు, కానీ తడబాట్లు మాత్రం తప్పలేదు. ముఖ్యమంత్రిపై ఏకవచనం ఉపయోగిస్తూ అసభ్యంగా దూషించారు. హత్యలకు బదులు తీర్చుకునే బాధ్యతను తానే తీసుకుంటానని చూపుడు వేలు విన్యాసంతో హెచ్చ రించారు. మేనమామ బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి వంటి వారెవరో స్క్రిప్టు రాసి ఉండవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 29 మంది ప్రాణాలు బలితీసుకున్న పుష్కరాల షూటింగ్ దర్శకుడు ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయోగించిన పదజాలాన్నంతా ఇక్కడ ఉటంకించడం సభ్యత కాదు. చివరగా నేను సింహం లాంటోణ్ణి, ఊరుకోబోనని ప్రకటించారు. అదేదో సినిమాలో హీరో అంటాడు– ‘ఒరేయ్ నేను సింహంలాంటోణ్ణి, అది గడ్డం గీసు కోదు. నేను గీసుకుంటా అంతే తేడా.’ ఇక్కడ ఆ తేడా కూడా లేదు. ఈయన కూడా గీసుకోవడం లేదు. కిల్‌బిల్ పాండే పాత్రను నిజజీవితంలో ప్రవేశపెడితే ఏమవుద్ది? శ్రీకృష్ణ పాత్రధారి భుజం మీద గదను పెట్టి, భీముడి వేషధారి చేతికి పిల్లనగ్రోవినిస్తే ఏం బాగుంటుంది?. పప్పు ఇమేజ్‌కి నిప్పు డైలాగులు ఎట్లా నప్పుతాయి? స్క్రిప్టు రాసే వాడికయినా జ్ఞానం ఉండాలి కదా? అతడి కారణంగా లోకేశ్ నాయుడి కర్నూలు యాత్ర రసాభాసగా మారింది. అధికారపక్షం ఎదురుదాడితో కుమ్మేసింది. గ్రామాల్లోకి వచ్చి తానో సింహాన్ని అనడం ఏమిటని ప్రశ్నించింది. గ్రామ సింహాలకు వేరే అర్థం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ‘బాబూ... చిట్టీ, ఏమన్నావ్ బాబూ’ అనే శ్రీలక్ష్మి డైలాగ్, ‘ఒరేయ్ చిట్టినాయుడు... చచ్చి నోడా’ అనే సురేఖవాణి డైలాగ్ వైరల్‌గా మారాయి. ఇమేజ్ మేకోవర్‌కు పోతే డ్యామేజ్ మేకోవర్ ఎదురైంది. ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షంగా పోరాడేటందుకు రాచ బాట ఉండగా ఈ సందుగొందుల మార్గాన్ని బాబు వారసుడు ఎన్నుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఎత్తి చూపవచ్చు. నారాయణ, చైతన్యలుండగా సర్కారు బడుల మీద ఇంత డబ్బు ఎందుకు తగలేస్తున్నారని నిలదీయవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రులుండగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజాధనాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారని అడగవచ్చు. హెరిటేజ్ ఉండగా అమూల్‌ను ఎందుకు తీసుకువచ్చారని ఎండగట్టవచ్చు. అమ్మ ఒడి పేరుతో అంతంత డబ్బును ఎందుకు తగలేస్తున్నారని గదమాయించవచ్చు. అధికారంలోకి వచ్చీరాగానే లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయదలుచు కున్నారని ఎలుగెత్తి నిలదీయవచ్చు. ఇటువంటి ఎన్నో అవకాశా లను ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ఈ అడ్డదారు లెందుకు?. ఎందుకంటే అందుకో కారణం ఉందట. కర్నూలు రసాభాసకు స్క్రిప్టు రైటర్ కారణం కాదనీ, అధి నాయకత్వమే కార్యక్రమాన్ని ఆ విధంగా డిజైన్ చేయించిందని ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. టీడీపీ అధి నాయకత్వం రెండంచెల కార్యక్రమాన్ని చేపట్టిందట. 1) చంద్రబాబు వారసుడైన లోకేశ్‌నాయుడు ఇమేజిని క్రమంగా మార్చడం. 2) ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాల నుంచి ప్రజల మనస్సులను దారిమళ్లించడం. ఈ కార్యక్రమానికి పబ్లిక్ మైండ్ డైవర్షన్ ప్రోగ్రామ్ (íపీఎమ్డీపీ) అనే ముద్దుపేరును పెట్టుకున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల మీదనే జనం మనసు లగ్నమైతే అది పాలక పార్టీకే ప్లస్ అవుతుందని తెలుగుదేశం నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అందువల్ల కులం, మతం, ప్రాంతం, ఫ్యాక్షన్ల ఆధారంగా వైషమ్యాలను రెచ్చగొట్టడం, న్యాయస్థానాల్లో పిటీషన్ల ద్వారా అభ్యుదయ కార్యక్రమాలను అడ్డుకోవడం అనే ఎత్తుగడను చేపట్టింది. అందులో భాగంగానే లోకేశ్ నాయుడి కర్నూలు పర్యటన. అయితే జనం టీడీపీ అనుకున్నంత అమాయకులు కారు కనుక ఈ పర్యటన సత్ఫలితాలనివ్వలేకపోయింది. నేను సింహం లాంటోణ్ణి అని చెప్పుకునే వారికి ఆ సింహా నికి ఉన్నపాటి ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. తనకంటే ఎంతో బలహీనమైన జంతువును వేటాడేటప్పుడు కూడా సింహం మీసం దువ్వదు. తొడలు కొట్టదు. చాటు మాటున నక్కి నక్కి ఉంటుంది. ఆ జంతువు దూరాన్ని, దాని వేగాన్ని గమనిస్తుంది. ఏ కోణంలో దాడి చేయాలో నిర్ధారించుకున్న తర్వాతనే లంఘిస్తుంది. అలాంటిది ఒక బలమైన ప్రభు త్వంలో ఒక బలహీనమైన నాయకుడు రంధ్రాన్వేషణ చేయాల నుకున్నప్పుడు ఎంత శ్రద్ధా, సహనం ఉండాలి? ఎంత ఓర్పుతో వేచి చూడాలి? అందుకు ఐదేళ్లు కావచ్చు, పదేళ్లు కావచ్చు. ఇరవ య్యేళ్లు కూడా పట్టవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
2020: విశాఖ రౌండప్
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. సుఖదుఃఖాలు.. జయాపజయాలు.. కరోనా కష్టకాలాన్ని.. అన్నింటినీ చరిత్రగతిలో కలిపేసింది. కాంతి రేఖల దిశగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న దీర్ఘకాల ప్రణాళికలతో విజయ తీరాల దిశగా విశాఖ నగరం తనదైన ముద్రను లిఖించేందుకు సన్నద్ధమౌతోంది. జనవరి 1- ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. 9 - అమ్మ ఒడి పథకంలో భాగంగా జిల్లాలో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 10 - జీవీఎంసీ పరిధిలో 98 వార్డులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 - విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా నిర్ణయిస్తూ రూపొందించిన బిల్లును శాసన సభలో ఆమోదించడంతో.. జిల్లా అంతటా సంబరాలు జరిగాయి. 29 - బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి అక్కడి దళాలకు చిక్కిన ఎనిమిది మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఫిబ్రవరి 1 - వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 - పాత రేషన్‌కార్డుల స్థానంలో జిల్లాలో 11,10,932 మంది లబ్ధిదారులకు బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 - జిల్లాలో 1.76 లక్షల మంది వృద్ధులకు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసేందుకు వైఎస్సార్ కంటి వెలుగు లో భాగంగా మూడో దశ స్క్రీనింగ్ నిర్వహించారు. 20 - 15 ఏళ్ల తర్వాత సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 - ఇంటర్ ఆపై ఉన్న విద్యనభ్యసిస్తున్న వారి కోసం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1,05,709 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 26 - నగరంలో ట్రామ్ రైలు కారిడార్ ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసే సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించడానికి అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ♦ కార్గో విమాన సర్వీసులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. 29 - గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అరకు ఉత్సవాలను ప్రారంభించారు. మార్చి 7 - పుష్కరం తర్వాత జీవీఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 19 - జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. మక్కా నుంచి వచ్చిన అల్లిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. 20 - లైట్‌మెట్రో డీపీఆర్ తయారు చేసే బాధ్యతను యూ ఎంటీసీ దక్కించుకుంది. రూ.5.34 కోట్లకు టెండర్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థను ఖరారు చేసింది. 23 - కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 2 - జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జిల్లాలో 2,00,087 మంది విద్యార్థుల కోసం పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద రూ.145.28 కోట్లు మంజూరు చేసింది. 4 - కరోనా వైరస్ నియంత్రణకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో 11.05,640 మందికి ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున అందించింది. 6 - కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అందజేశారు. 24 - కరోనా కష్టకాలంలో కూడా మహిళా సాధికారత కోసం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 7.18 లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.64.16 కోట్లు జమ చేశారు. 26 - సింహాచలం వరాహ నృసింహస్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 28 - ఆర్థిక ఇబ్బందులు కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో తలపెట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మే 7 - ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. 8 - ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేజీహెచ్‌లో పరామర్శించారు. మృతులతో పాటు బాధితులకు భారీగా నష్ట పరిహారాన్ని ప్రకటించారు. 22 - కరోనా కారణంగా కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీని అందించింది. జిల్లాలో ఉన్న సుమారు 10 వేల ఎంఎస్ఎంఈలు లబ్ధిపొందాయి. 26 - కరోనా కష్టకాలంలో పేద అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసింది. 30 - వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. జూన్ 8 - లాక్డౌన్ కారణంగా 80 రోజుల పాటు మూతపడిన షాపింగ్ మాల్స్ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి. 10 - కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 22,755 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. 25 - స్వచ్ఛ సర్వేక్షణ్–2020కు సంబంధించి చెత్త రహిత నగర ర్యాంకింగ్స్‌లో విశాఖ త్రీ స్టార్‌ను సొంతం చేసుకుంది. జూలై 2 - అత్యవసర వేళల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జిల్లాకు కేటాయించిన 72 కొత్త 108, 104 అంబులెన్సులను రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 16 - వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా రూపొందించిన పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 26 - కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద వీరుల త్యాగాలను స్మరిస్తూ నేవీ అధికారులు నివాళులు అర్పించారు. 29 - సింహాచలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీమ్‌లో చోటు కల్పిస్తూ రూ.53 కోట్లు నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఆగస్టు 1 - హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 12 - వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా జిల్లాలో 1,94,714 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 నగదును జమ చేశారు. 17 - నగర పోలీస్ కమిషనర్‌గా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 19 - సీలేరు విద్యుత్తు కాంప్లెక్స్‌లో రూ.510 కోట్ల వ్యయంతో మరో 2 యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 20 - స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు 9వ ర్యాంకును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ♦ పవన్‌కల్యాణ్ విరాభిమాని నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం చేయడంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన్ నాయుడు భార్యతో పాటు వారి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7 - గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 11 - మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 63,476 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 6,61,317 మహిళా లబ్ధిదారులకు తొలి దఫాగా రూ.459.43 కోట్లు జమ చేశారు. 19 - దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు నైతిక మద్దతు ప్రకటించారు. అతని కుమారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 20 - కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మూతపడిన పాఠశాలలు సుదీర్ఘ విరామం తరువాత తెరుచుకున్నాయి. అక్టోబర్ 2 - గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. పాడేరులో రూ.500 కోట్లతో 30 ఎకరాల్లో డాక్టర్ వైఎస్సార్ గిరిజన బోధనాస్పత్రికి శంకుస్థాపన చేశారు. 8 - ‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, బెల్టులు ఉచితంగా పంపిణీ చేశారు. 9 - చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమల్లో జీవీఎంసీ నెంబర్ వన్‌గా నిలిచింది. ♦ ప్రపంచంలో మేటైన జూ పార్కుగా రూపుదిద్దుకునేందుకు విశాఖ జంతు ప్రదర్శన శాల ఎంపికైంది. 11 - రుషికొండ బీచ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో అంతర్జాతీయ తీరంగా మారి ‘బ్లూఫ్లాగ్’ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. 13 - తీవ్ర వాయుగుండంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో వీచిన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన కార్గోషిప్ తెన్నేటి పార్కు ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది. 16 - బీచ్ రోడ్డులో ‘సీ హారియర్’ యుద్ద విమాన మ్యూజియం ఏర్పాటుకు వీఎంఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. 18 - వెనుకబడిన ప్రతి సామాజిక వర్గానికీ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో గవర, మత్స్యకార, నగరాలు, యాత, నాగవంశం కార్పొరేషన్లకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురికి చైర్పర్సన్ పదవులు వరించాయి. 21 - ఆపదల వల్ల కష్టాలపాలైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 9,65,223 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 24 - గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేసిన నిర్మాణాలను అధికారులు తొలగించి 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 29 - విశాఖ బీచ్ రోడ్డు అభివృద్ధి కోసం తొలి విడతలో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రపంచ బ్యాంకు నిధులు రూ.116.71 కోట్లు కేటాయించింది. 30 - విశాఖ పోర్టు ట్రస్ట్ ఎంట్రన్స్ చానల్, కంటైనర్ టెర్మినల్ మధ్యలోని జనరల్ బెర్త్ పక్కనే రూ.77 కోట్లతో స్వదేశీయులకు విదేశీ విహారం కల్పించే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం పట్టాలెక్కింది. నవంబర్ 10 - అచ్యుతాపురంలో 80.10 ఎకరాల్లో జపాన్‌కు చెందిన యూకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్(ఏటీజీ) రూ.1750 కోట్ల పెట్టుబడులతో కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. 13 - స్వచ్ఛ విశాఖపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో ‘వుయ్ సపోర్ట్ వైజాగ్ వాక్‌థాన్’ను నిర్వహించారు. 17 - కోవిడ్ నియంత్రణలో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐసీఎంఆర్ సాయంతో బీఎంజే గ్లోబల్ హెల్త్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో విశాఖకు ఈ గుర్తింపు వచ్చింది. 23 - మహిళలు, బాలికలకు మరింత భద్రత కోసం అభయం ఐవోటీ పరికరాలను ఆటోలకు అమర్చారు. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ♦ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్క్‌లు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలను కేటాయించింది. సంస్థకు విద్యుత్ ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 - దేశంలోని స్మార్ట్ నగరాల అభివృద్ధి జాబితాలో ఒక స్థానం మెరుగుపర్చుకుని టాప్–7లోకి దూసుకువచ్చింది. స్మార్ట్ సిటీల్లో విశాఖ బెస్ట్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 25 - చిరు వ్యాపారులకు చేదుడుగా ఉండాలనే ఉద్దేశంతో తలపెట్టిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 87,527 చిరువ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలు అందించారు. డిసెంబర్ 4 - బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ వద్ద నేవీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 11 - టీటీడీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కార్తీక సహస్ర దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 12 - వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న జీవ క్రాంతి పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 19 - పర్యాటక రంగంలో పెట్టు్టబడులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దిన టూరిజం పాలసీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. 21 - యువతను ఉత్తేజపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతలు అందజేయనున్న ఈ టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. 22 - ప్రజల భూమికి శాశ్వత హక్కు, రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. 25 - పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడానికి సంకల్పించిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1,15,933 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. -
రౌండప్ 2020: కమ్మేసిన కాషాయం
నేతల మధ్య విమర్శలు, వివాదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగంలో చాణిక్యుడిని మించేలా ఒకరికిమించి మరొకరి వ్యూహరచనలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వరకు అధికార విపక్షాల మధ్య పేలిన మాటాల తూటాలు. ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణకు దేశ ప్రజలకు చిగురుటాకులా వణికినా.. నేతల పుట్టించిన రాజకీయ వేడి మాత్రం అంతాఇంతా కాదు. సవాళ్లుకు ప్రతి సవాలు విసురుతూ.. ఏడాది ఆసాంతం రాజకీయాన్ని రక్తికట్టించారు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదికి పాకేందుకు బాటలు వేసింది. ఆరేళ్లుగా ఓటమి ఎరుగని కారు పార్టీకి కాషాయదళం ముచ్చెమటలు పట్టించింది. దుబ్బాక దంగల్.. కారు జోరుకు బ్రేకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార టీఆర్ఎస్ తొలి ఎదురుదెబ్బ తగిలింది. స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకన్న టీఆర్ఎస్కు.. దుబ్బాక దంగల్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ.. విజయం బీజేపీ, టీఆర్ఎస్లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. గ్రేటర్లో వికసించిన కమళం.. ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ భారీ ఎదురుదెబ్బ తగలగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా బీజేపీ 47 స్థానాల్లో జెండా పాతింది. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్నామ్నాయమని సవాలు విసిరింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్ వ్యూహరచన.. అక్బర్ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. టీడీపీని వెంటాడుతున్న కష్టాలు... గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన టీడీపీకి ఈ ఏడాది (2020) కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యారు. బాబు నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ పలువురు సీనియర్ నేతలు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. మరికొంత మంది మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా టీడీపీకి దూరంగా ఉన్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కి మూలిగి తెచ్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యే సైతం ఆకర్శితులై ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి... అధికారపక్షం వైపు నిలుచున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన టీడీపీ నేతకు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మిగలకుండా పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మొత్తానికి 2020లో టీడీపీ పెద్ద నష్టాన్నే చేకూర్చింది. రంగుమారిన పవన్ రాజకీయం.. రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్.. బొక్క బోర్లా పడ్డారు. ఇప్పటికే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ ఏడాది కొత్త భాగస్వామ్య పక్షాన్ని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావం సమయంలో ప్రకటించిన సిద్దాంతాలకు విరుద్ధంగా బీజేపీతో జట్టుకడుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. రానున్న అన్ని ఎన్నిల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీజేపీ-జనసేన నేతలు ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన పవన్ ఆ తరువాత కొంత కాలానికే చంద్రబాబు నాయుడుతో విభేదించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఘోర ఓటమి చవిచూడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్కస్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే రూటుమార్చక తప్పదని భావించిన పవన్ కాషాయ పార్టీతో జట్టుకట్టారు. ఈ పరిణామం సొంత పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తానికి 2020లో బీజేపీతో కలిసి తన రాజకీయ భవిష్యత్‌కు మార్పుకు పవన్ శ్రీకారం చుట్టారు. భాగ్యనగర్‌లో బీజేపీ విస్తరణ.. కీలక నేతలు చేరిక ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదిపై కన్నేసింది. హస్తిన నుంచి బయలుదేరి కర్ణాటకలో పాగా వేసిన కమళనాథులు హైదరాబాద్‌పై గురిపెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికలు నింపిన జోష్‌ను కొనసాగిస్తూ దుబ్బాక మీదుగా హైదరాబాద్ గడ్డపై కాలుమోపారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. ఈ ఏడాది అన్నీ అనుకుల పరిణామాలే ఎదురైయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేప్టటిన అనంతరం దూకుడుగా వ్యహరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. నితీష్ విజయం.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తేజస్వీ సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, 124 సీట్లతో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. ఎన్డీయే తరుఫున నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సింధియా కలకలం.. కుప్పకూలిన కమల్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్ సర్కార్ పడిపోయింది. అనంతరం శాసనసభలో సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన సీఎం బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగో సారి. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి తొలుత 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని సురక్షితంగా నిలబెట్టుకుంది. రాజస్తాన్ సంక్షోభం.. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విభేదించి.. ఏకంగా 18 ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. కోర్టుల వరకు చేరింది. చివరికి సుదీర్ఘ చర్చల అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుజ్జగించడంతో సచిన్ వెనక్కి వచ్చారు. ఓ సమయంలో మధ్యప్రదేశ్‌లో మాదిరీగానే రాజస్తాన్‌లో కాంగ్రస్ ప్రభుత్వం పడిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వాచ్చాయి. కానీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి.. తిరుగుబాటు నేతల్ని వెనక్కి తీసుకురావడంతో గహ్లోత్ ఊపిరిపీల్చుకున్నారు. దేవుడు శాసించాడు అరుణాచల్ పాటించాడు.. తమిళనాట మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రకటించిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది అభిమాలను తీవ్ర నిరాశకు గురిచేశారు. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచల్ పాటిస్తాడు అంటూ ఇకపై తాను రాజకీయ రంగ ప్రవేశం చేయలేనంటూ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని తొలుత ప్రకటించిన రజనీకాంత్ ఆ తరువాత అనారోగ్య సమస్యలకు గురికావడంతో వెనకడుగు వేశారు. మరోవైపు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో స్టార్ నటుడు కమల్ హాసన్ సిద్ధమయ్యారు. రజనీతో కలిసి పనిచేయాలని భావించిన అతనికి తలైవా ప్రకటనతో ఏడాది చివరన నిరాశే మిగిలింది. కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి కశ్మీర్లో వికసించిన కమళం జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. ఫలితాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీర్ ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఓటమి.. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ప్రభావం చూపిన అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఉత్కంఠ బరితంగా సాగిన అధ్యక్ష పోరులో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారీస్ విజయం సాధించారు. ఫలితాలపై కోర్టును ఆశ్రయించిన ట్రంప్ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కోలువుదీరనుంది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూలేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించాయి. రెండోసారి ప్రధానిగా జెసిండా అర్డెర్న్ న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. -
2020.. కలలు కల్లలు
కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ‘నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు’ అంటూ ప్రపంచాన్ని ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా కోవిడ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. ఈ ఏడది తెలంగాణ రాష్ట్రంలో 2020లో జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి.. ఏయే రంగాలు ఎలా ఇబ్బంది పడ్డాయి.. ఎవరు హీరోలు అయ్యారు.. అనే విషయాలపై ఓ రౌండప్. -సాక్షి, హైదరాబాద్ అవిశ్రాంత పోరాట యోధులు.. వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఏడాది హీరోలుగా నిలి చారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వైద్యులు మాత్రం ధైర్యంగా అన్నీ తామై వైరస్ సోకిన వారికి సపర్యలు చేశారు. చాలా మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలందిస్తూ మన రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి కరోనా సోకగా, అందులో దాదాపు 40 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం అన్ని ఆస్పత్రుల్లో కూడా కరోనా తప్ప వేరే వైద్య సేవలు చాలా తక్కు వగా అందాయి. కరోనా కారణంగా ప్రభుత్వాస్ప త్రుల్లో సదుపాయాలు పెరిగాయి. ఇదిలావుంటే కరోనా కారణంగా మెడికల్ కాలేజీలు తెరవకపోవ డంతో వైద్య విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. అసలైన వారియర్స్.. ఈ ఏడాది పోలీసులు యుద్ధవీరులయ్యారు. ప్రజలందరినీ తమ ప్రాణాలు పణంగా పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరీంనగర్లో కరోనా ఆనవాళ్లు కన్పించిన రోజు నుంచి నేడు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్ సోకిన వారిని గుర్తించడంలో ఎనలేకి కృషి చేశారు. లాక్డౌన్ విధించాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్ నియంత్రణలో, లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. అలాంటిది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యజ్ఞంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 5,700 మంది కరోనా బారినపడ్డారు. 50కి పైగా పోలీసులు అమరులయ్యారు. స్కూళ్లు తెరుచుకునేదెలా? రాష్ట్రంలో విద్యా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్ ఫలి తాల్లో ఆలస్యం, పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు తెరుచుకోలేదు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి పాఠశా లలు, ఇంటర్లో ఆన్లైన్ బోధన ప్రారంభిం చాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు, అధ్యాపకులు ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా చాలా ఆలస్య మైంది. కాగా, ఈ పరిస్థితుల్లోనూ విద్యా ర్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020– 21 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులు తీసు కొచ్చింది. ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర కోర్సులకు అనుమతి ఇవ్వగా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీకాం టాక్సేషన్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీఏ మ్యాథమెటిక్స్ వంటి కొత్త కోర్సులకు ఓకే చెప్పింది. అన్ని గ్రూపుల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేలా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్ అవసరాలకు ఉపయోగపడేలా ఎం.ఫార్మసీ లోనూ 4 కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది. వెనుకబడిన గురుకులాలు.. గురుకుల విద్యపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చిలో ఇంటిబాట పట్టిన పిల్లలు తిరిగి ఇప్పటివరకు గురుకులాన్ని చూడలేదు. ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాల ద్వారా బోధన ప్రారంభించాలని గురుకుల సొసైటీలు భావించినా.. పెద్దగా ఫలితం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 960 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 3.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎంసెట్, నీట్, క్లాట్ తదితర శిక్షణలిచ్చి తీర్చిదిద్దడంతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆన్లైన్ బోధనతో పిల్లలు కాస్త వెనుకబడినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. పడకేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్ విస్తృతి పెరగడంతో విదేశాల నుంచి రావాల్సిన యంత్ర సామగ్రి రాకపోవడం, వలస కూలీలు స్వస్థ లాలకు వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులన్నీ నిలిచి పోయాయి. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల యంత్రాలు పలు దేశాల నుంచి రావాల్సి ఉంది. ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపైనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి విడతగా గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఇసుక లభ్యత లేకపోవడం, సిమెంట్ ధర పెరగడంతో కాంట్రాక్టర్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇడిసిపెడితే నడిసిపోతా.. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించింది వలస కార్మికులే.. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పూటగడవడం కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించిపోవడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది వలస కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి పోయారు.. కాలినడకన వెళ్తున్న ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టించాయి. రాష్ట్రం నుంచి దాదాపు 9.57 లక్షల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటివరకు 32 శాతమే తిరిగి వచ్చినట్లు కార్మిక శాఖ అంచనా. ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా, లాక్డౌన్ రూపంలో రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి చివర నుంచి అన్ని బస్సులు డిపోలకే పరిమితం కాగా, మే మూడో వారంలో జిల్లా సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ చివరలో సిటీ బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ జిల్లా సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతానికి కూడా చేరుకోలేదు. లాక్ డౌన్‌కు పూర్వం నిత్యం రూ.13 కోట్ల మేర టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లను మించట్లేదు. టికెట్ రూపంలోనే రూ.2వేల కోట్లు నష్టపోయింది. మరో వైపు కరోనాతో దాదాపు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోగా, 2 వేల మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తలకిందులైంది. లాక్‌డౌన్‌తో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ తేల్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రమైంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. 15 శాతం ఆదాయ వృద్ధి రేటుతో 2020–21లో రూ.1,15,900 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించగా, రూ.68,781 కోట్ల ఆదాయమే సమకూర నుంది. ఈ ఏడాది వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.32 వేలకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తే, అక్టోబర్ నాటికి రూ.12,800 కోట్లు మాత్రమే వచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మరో రూ.5 వేల కోట్లు వచ్చినా రూ.18 వేల కోట్ల వరకు మాత్రమే జీఎస్టీ వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనుకున్నా.. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు కూడా దాటలేదు. రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో రావాల్సి ఉండగా, రూ.2వేల కోట్లు రాలేదు. అప్పుల విషయానికొస్తే ఏప్రిల్‌లో రూ.5,700 కోట్లు, మేలో రూ.7,642 కోట్లు, జూన్‌లో రూ.4,318 కోట్లు.. ఇలా 7 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, ఐటీ శాఖ కాస్త మెరుగు.. పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్ సంస్థ ప్రపం చంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. రూ.20,670 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంది. బయో ఫార్మా రం గానికి ఊతమిచ్చేలా రూ.60 కోట్లతో బీ–హబ్ కూడా ప్రారంభమైంది. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో పు రోగతి కన్పించింది. సులభతర వాణిజ్య విధానంలో రా ష్ట్రం మూడో ర్యాంకు సాధించింది. కాగా, ఐటీ సంస్థల న్నీ మార్చి మొదటి వారం నుంచే లాక్డౌన్ ప్రకటించా యి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత విస్తృతం చేయ డంతో 5.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త నియా మకాలు నిలిచిపోవడం, స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్ కీపింగ్, కేటరింగ్ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి గండిపడింది వెలవెలబోయిన పర్యాటకం గత 9 నెలలుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిబోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లను, ఆగస్టులో మిగతావి తెరిచారు. పర్యాటకుల నుంచి స్పందన మాత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. మోతమోగిన విద్యుత్ బిల్లులు కరోనా కష్టకాలంలో జూన్ నెల విద్యుత్ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ కారణంగా స్పాట్ మీటర్ రీడింగ్ తీయలేకపోయారు. లాక్డౌన్ సడలించడంతో జూన్ నెలలో 3 నెలల వినియోగానికి సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీసి, సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్ శ్లాబులు మారిపోయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. కాస్త ఆశావహ పరిస్థితులు.. ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో ఆశించిన మేర ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. ఎన్–95/ఎఫ్ఎఫ్పీ–2 మాస్క్‌ల ఎగుమతులు మెరుగు పడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయి. 110 దేశాలకు రూ.554 కోట్ల విలువైన డైరీ ప్రొడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్, వెల్నెస్, దుస్తులు తదితరాల ఎగుమతులు భారీగా జరిగాయి. జెమ్ అండ్ జ్యువెలరీ రంగానికి సంబంధించి రూ.1.6 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
వెళుతూ ఉండాలి... వెళ్లనివ్వాలి
‘‘జీవితం ఏది ఇస్తే దాన్ని అంగీకరించాలి’’ అంటున్నారు అమలా పాల్. ఇంకా చాలా విషయాలు చెప్పారు. 2020 చాలా నేర్పించిందంటున్నారామె. ఈ ఏడాది నేర్చుకున్న విషయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి అమలా పాల్ ఈ విధంగా చెప్పారు. సరిగ్గా లేకపోవడం సరైనదేనని నేర్చుకున్నాను. నువ్వు సరిగ్గా లేవనే సంగతిని స్వీకరించకపోవడం సరైనది కాదని తెలుసుకున్నాను. సరేనా? మన లోపాల్ని స్వీకరించడంతోనే ఉపశమనం మొదలవుతుంది. . దైవత్వంతో పున స్సంధానమై, నా అహం తాలూకు మరణం నుంచి మేలుకొన్నాను. నాలోని కుండలిని (అనిర్వచనీయమైన శక్తి)ని నన్ను జాగృతం చేయనిచ్చాను. జీవితం నా దారిలో విసిరేసిన ప్రతి దానినీ హుందాగా, కృతజ్ఞతగా స్వీకరించాను. బాధ నుంచి నేనెప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ బాధను నన్ను ప్రభావితం చేయనిచ్చాను. బాధను అనుభవించడం నుంచే చాలా నేర్చుకున్నా. పాత స్నేహితులను కలవడానికి వెళ్లాలి. జీవితంలో కొత్త జ్ఞాపకాల కోసం వెళ్లాలి. శత్రువులను క్షమించడానికి వెళ్లాలి. మన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి వెళ్లాలి. వెళ్లాలి.. వెళ్లాలి.. వెళుతూ ఉండాలి. వెళ్లనివ్వాలి. నా జీవనగడియారాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఆయుర్వేదాన్ని ఆశ్రయించాను. -
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్‌లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. ఈ ఏడాదంతా కరోనా, కరోనా, కరోనా అంతే.. మరో మాటకి తావు లేదు. వేరే చర్చకి ఆస్కారం లేదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూనే దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకుంటూనే సామాజిక, ఆర్థిక మార్పులకి అలవాటు పడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్‌తో కరోనా పీడ విరగడైపోతుందన్న ఉత్సాహంతో యావత్ భారతావని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి సిద్ధమైంది. ఉవ్వెత్తున ఉద్యమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకిన ఆగ్రహంతో మొదలైన ఈ ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కన్నెర్ర చేయడంతో ముగుస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఈ రెండు ఉద్యమాలు ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టంతో (సీఏఏ)అభద్రతా భావంలో పడిపోయిన మైనార్టీలు ఢిల్లీలో షహీన్‌బాగ్ వేదికగా కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారిపోయింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేటీకరణ జరుగుతుందని, కనీస మద్దతు ధరకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో రైతన్న నెలరోజులై ఆందోళనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. వామ్మో కరోనా కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఏడాదంతా కరోనా తప్ప మరే మాట వినిపించలేదు. చైనాలోని వూహాన్లో తొలి సారిగా బట్టబయలైన ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చిన ఒక విద్యార్థి ద్వారా జనవరి 30న భారత్‌లోని కేరళకి వచ్చింది. ఆ తర్వాత మార్చికల్లా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరుకి విస్తరించింది. దీంతో కేంద్రం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. సరిహద్దులన్నీ మూసివేసి కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి ఆ తర్వాత దశల వారీగా పాక్షికంగా లాక్‌డౌన్‌ని కొనసాగించిన∙కేంద్రం జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రపంచ దేశాల పట్టికలో కోటికి పైగా కేసులతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించిన భారత్‌ను డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రశంసించింది. బతుకు నడక 130 కోట్ల జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేకపోవడంతో కేంద్రం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో అతి పెద్ద మానవీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రం నిర్ణయం 4 కోట్ల మంది వలస కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడింది. పనులు లేకపోవడం, కరోనా మహమ్మారి ఎలాంటి ఆపద తీసుకువస్తుందోన్న ఆందోళనలతో వలస కార్మికులు చావైనా బతుకైనా సొంత గడ్డపైనేనని నిర్ణయించుకొని స్వగ్రామాలకు పయనమయ్యారు. కాళ్లు బొబ్బలెక్కేలా మైళ్లకి మైళ్లు నడిచారు. ఈ క్రమంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రమైన జీవితం కోసం వారు పడ్డ ఆరాటం, సాగించిన నడక మనసుని బరువెక్కించే దృశ్యంగా నిలిచింది. మూగబోయిన స్వరాలు కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 5న కరోనా సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మహమ్మారితో పోరాడి సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హిందూస్తానీ సంగీతంలో సుప్రసిద్ధులైన పండిట్ జస్రాజ్ 90 ఏళ్ల వయసులో గుండె పోటు రావడంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఈ ఇద్దరు సంగీత సామ్రాట్‌లను కోల్పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆలయాలకి భూమి పూజ శ్రీరాముడి భక్తుల కలలు ఫలించే అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటు కొత్త భవనానికి ఈ ఏడాది భూమి పూజ మహోత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడింది. 40కేజీల బరువున్న వెండి ఇటుకని శంకుస్థాపన కోసం వాడారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ ఉండడంతో 1,224 మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో ఈ భవనం నిర్మాణం జరుపుకుంటోంది. ఒక హత్య, మరో ఆత్మహత్య ఈ ఏడాది జరిగిన క్రైమ్ సీన్లో హాథ్రస్ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తదనంతరం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై జరిగిన విచారణ అంతే ప్రకంపనలు రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా బూల్హరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న వ్యవసాయ క్షేత్రానికి వెళితే అగ్రవర్ణానికి చెందినవారుగా అనుమానిస్తున్న కొందరు పశువుల్లా మారి గ్యాంగ్ రేప్ చేయడంతో తీవ్రగాయాలతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించకుండా 30 తెల్లవారుజామున 2.30 గంటలకు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో ఈ రేప్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన స్వగృహంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు బాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపేశాయి. బాలీవుడ్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన నెపోటిజంపై చర్చ మళ్లీ మొదలైంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ని మించిన మలుపులతో సాగిన ఈ ఉదంతం బాలీవుడ్ మాఫియా లింకుల్ని కూడా బయటకు లాగడంతో ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ తారలకే చుక్కలు కనిపించాయి. దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటి వారు ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి వచ్చింది. సరిహద్దుల్లో సై నాలుగు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యాలమారి చైనా నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాల్ని తోసి రాజని మన జవాన్లపై జూన్ 15 అర్ధరాత్రి దాడులకు దిగింది. మన సైన్యం కూడా గట్టిగా ఎదురుదాడికి దిగడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ ఘర్షణల్లో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా నుంచి జరిగిన ప్రాణ నష్టాన్ని ఆ దేశం ఇప్పటివరకు బయట పెట్టలేదు. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి వాస్తవాధీన రేఖలో జవాన్లకు అత్యద్భుమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణుల్ని మోహరించి భారత్ సైనిక రంగంలో తన సత్తా చాటుకుంది. అవీ.. ఇవీ.. ► నిర్భయ హత్యాచారం కేసులో ఆమె తల్లిదండ్రుల పన్నెండేళ్ల పోరాటం ఫలించింది. దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్‌లకు మార్చి 20న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ► మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లాలో ఏప్రిల్‌లో జరిగిన మూకదాడిలో ఇద్దరు సాధువులు సహా ముగ్గురు మరణించారు. యూపీలోని ఒక ఆలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మతం రంగు పులుముకోవడంతో బీజేపీ, శివసేన మాటల యుద్ధానికి దిగాయి. ► ఒకవైపు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతూ ఉంటే మేలో అంఫా తుఫాన్ ఈశాన్య భారతాన్ని కలవరపెట్టింది. బెంగాల్లో తుపాన్ ధాటికి 72 మంది ప్రాణాలు కోల్పోతే, లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగింది. ► ఐరాసభద్రతా మండలికి నాన్ పర్మెనెంట్ సభ్యదేశంగా భారత్ జూన్ 18న ఎన్నికైంది. వచ్చే జనవరి నుంచి కొత్త మండలిలో భారత్ చేరనుంది. ► ముంబైని పీఓకేతో పోల్చడం, రాష్ట్ర పోలీసుల్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, శివసేన సర్కార్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సెప్టెంబర్‌లో ఆమె నివాసాన్ని కూడా కూల్చివేయడానికి ముంబై నగరపాలక సంస్థ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కంగనాకు కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది. -
2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది
ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్డౌన్ సినిమా. హాస్పిటల్స్‌లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్ సినిమా. మాస్క్ సినిమా. కాఫ్ సినిమా. కోల్డ్ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. ఆ సినిమాల నుంచి ఉపశమనం కోసం ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తెలుగు సినిమాలు విడుదల చేశాయి. 2020లో దాదాపు 20 సినిమాలు ఓటిటిల ద్వారా విడుదలయ్యాయి. కొన్ని నచ్చాయి. కొన్ని నొచ్చాయి. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాలి. దానికి ముందు వీటికి థ్యాంక్స్ చెప్పాలి. ఓటీటీ సినిమాలు ఈ సండే స్పెషల్. ఉదయం 11 వరకూ పనులు చేసుకుని ఇంకేం తోచక ‘సినిమా చూద్దాం’ అని కుటుంబం అంతా ఇంట్లో సినిమాకు కూచునే వింత 2020లోనే జరిగింది. దానికి కారణం కరోనా తెచ్చిన లాక్డౌన్. రాత్రి భోజనం చేశాక సినిమా చూసి పడుకోవడం కూడా కరోనా వల్లే సాధ్యమైంది. థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా (అవి మూతపడ్డాయి కనుక) ఇళ్లకే కొత్త కొత్త సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తెచ్చాయి. గతంలో కుదరని పని రెండు మూడేళ్ల క్రితం కమల హాసన్ తన కొత్త సినిమాను థియేటర్ల ద్వారా కాకుండా ‘డైరెక్ట్ టు హోమ్’ పద్ధతిలో విడుదల చేస్తానంటే అక్కడి ఎగ్జిబిటర్స్ అందరూ పెద్ద నిరసన వ్యక్తం చేశారు. నిన్న మొన్న నటుడు సూర్య తన భార్య జ్యోతిక ముఖ్యపాత్రధారిగా నటించిన సినిమా ‘పొన్మగల్ వందాల్’ను ఓటిటి (ఓవర్ ది టాప్) ద్వారా విడుదల చేస్తానంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ పేచీ పెట్టారు. అతడు హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఓటిటి విడుదలకు కూడా ఇవే సమస్యలు. నిజమే. సినిమా అనేది లక్షల మందికి సినిమా థియేటర్ల ద్వారా ఉపాధి కల్పిస్తుంది. అసలు ఆ మాధ్యమం పెద్ద తెర మీద వీక్షించేందుకే తయారైనది. అయినప్పటికీ ఇప్పుడు 2020లో కథంతా మారిపోయింది. అనివార్యంగా చిన్న తెర మీద, థియేటర్ల ద్వారా కాకుండా నేరుగా ఇంటికే సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ మీద విడుదల అవుతున్నాయి. ఈ పరిస్థితికి కరోనా లాక్డౌన్ ఒక పెద్ద అవకాశాన్ని కల్పించింది. అమేజాన్ ఉందా? 1990లో డిష్ కనెక్షన్ ఉందా అని అడిగేవారు. దానికి కాస్త ముందు వీడియో పార్లర్లో మెంబర్ షిప్ ఉందా అని అడిగేవారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్ సబ్స్క్రిప్షన్ ఉందా అని అడుగుతున్నారు. మూడూ దాదాపు ఒకటే. మనం డబ్బు కడితే ‘వాళ్ల దగ్గర ఉన్న’ సినిమాలు చూపిస్తారు. ‘మనం కోరుకున్న సినిమాలన్నీ’ అవి చూపవు. అయితే మనం విసుగొచ్చి సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేయించుకోవడం మానేయకుండా ఈ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు కొని విడుదల చేస్తూ ఉంటాయి. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆహా... ఇవన్నీ ఇప్పుడు నేరుగా సినిమాలను కొని నేరుగా ఇంట్లోనే చూపిస్తున్నాయి. ఇవి కాకుండా ఏ.టి.టి (ఎనీ టైమ్ థియేటర్) యాప్ ద్వారా కూడా సినిమాలు విడుదల చేస్తున్నాయి. బంధనాలు తెంచుకున్న తెలుగు సినిమా భారతదేశంలో బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెద్దది. తెలుగులో సినిమా ఒక్కటే వినోద సాధనం. ఇది ఇప్పటికీ సంప్రదాయ రిలీజు వ్యవస్థనే విశ్వసిస్తోంది. అయినప్పటికీ 2020 తెలుగు సినిమా పరిశ్రమను తన పాత బంధనాలు తెంపుకునేలా చేసింది. థియేటర్లు పూర్తిగా తెరుచుకునే వరకు సినిమాలను మురగబెట్టకుండా ధైర్యం చేసి ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేసుకునేందుకు ఉత్సాహపరిచింది. ఈ సంవత్సరం ఓటిటి ద్వారా 20 సినిమాల వరకూ విడుదల అయ్యాయి. ప్రేక్షకులు వీటిని బాగా చూశారు. లాక్డౌన్ వల్ల కోట్లాది మంది ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఇరవై ముప్పై శాతం ఇళ్లల్లో నెట్ ఉండటం వల్ల కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకుని మరి చూశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాల పై అభిప్రాయాలు వ్యక్తం అయ్యేప్పుడు కొన్ని థియేటర్లలో విడుదలైతే ఫ్లాప్ అయి ఉండేవని అన్నారు. మరికొన్నింటిని థియేటర్లలో రిలీజైతే ఇంపాక్ట్ బాగుండేదనీ నిరాశ పడ్డారు. రెండు రకాల ఫలితాలు చూశాయి ఈ సినిమాలు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020లో విడుదలైన ఓటిటి సినిమాలు మధ్యతరగతి కథలతో ఆకట్టుకున్నాయి. అమేజాన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అరకులో సాగిన ఒక అందమైన మధ్యతరగతి పౌరుషాన్ని చూపింది. సత్యదేవ్ ఈ సినిమాతో ఇంటింటి స్టార్ అయ్యాడు. ‘ఆహా’లో విడుదలైన ‘భానుమతి–రామకృష్ణ’ కూడా ఒక సంపన్న అమ్మాయికి ఒక మధ్యతరగతి అబ్బాయికి మధ్య సాగిన ప్రేమ కథగా ఆకట్టుకుంది. నవీన్ చంద్ర ఈ సీజన్లో ఒక హిట్‌ను మూటగట్టుకున్నాడు. ‘ఆహా’లోనే విడుదలైన ‘కలర్ ఫొటో’ రూపానికి సంబధించి, రంగుకు సంబంధించి ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది. కామెడీ నటుడు సుహాస్ ఈ సినిమాతో కొత్త ప్రతిభను నిరూపించుకున్నాడు. నటి చాందిని చౌదరి కూడా మంచి మార్కులు పొందింది. ఇక ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ అయితే ఓటిటిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రశంసలు అందుకుంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా అక్కడి భాషను, ఆత్మను సమర్థంగా పట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ కొత్త జంటగా ప్రేక్షకులకు నచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా హీరో రాజ్‌తరుణ్ ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది. ఈ వరుసలోనే ‘అమృతారామమ్’, ‘ఐఐటి కృష్ణమూర్తి’, ‘మా వింతగాధ వినుమా’ సినిమాలను చెప్పుకోవచ్చు. వి– నిశ్శబ్దం 2020 పెద్ద సినిమాలను కూడా తీసుకొచ్చింది. సాధారణంగా థియేటర్ల లో రిలీజైతే పెద్ద హంగామాగా ఉండే నాని సినిమా ‘వి’ అమేజాన్‌లో విడుదలైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్‌బాబు మరో ముఖ్యపాత్ర. ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమా చిన్నతెర వల్ల చూపాల్సినంత ఇంపాక్ట్ చూపలేదనే టాక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ థియేటర్ రిలీజ్ అవుతోంది ఇది. నాని ‘సైకో’లా కనిపించినా ఆ స్వభావాన్ని ‘జస్టిఫై’ చేయడంతో కథ దుష్టశిక్షణగా మారింది. ఇక రిలీజ్ అవుతుందా అవదా అంటూ టెన్షన్ పెట్టిన అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఆశించిన టాక్‌ను సాధించలేదు. అనుష్క ను ముందు పెట్టి కథను ఆమె ప్రాముఖ్యం లేకుండా నడిపారనే టాక్ వచ్చింది. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తన భారీతనానికి తగ్గట్టుగా హిట్ అయ్యింది. దర్శకురాలు సుధా కొంగర పెద్ద హిట్ కొట్టినట్టు లెక్క. పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమా కథ వేరేగా ఉండేది. కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ రెండూ నిరాశ పరిచాయి. పెంగ్విన్‌లో డార్క్ కంటెంట్ పెరగడం ఒక కారణమైతే మిస్ ఇండియాలో కథ శక్తివంతంగా లేకపోవడం కారణం. ‘మహానటి’ సినిమాతో అలరించిన కీర్తి సురేశ్ మిస్ ఇండియాలో లుక్స్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయిందని ఇళ్లలో ఈ సినిమా చూసిన గృహిణులు అభిప్రాయ పడ్డారు. మొత్తం మీద రాబోయే సంవత్సరం థియేటర్లు యథావిథిగా కళకళలాడినా బిజినెస్‌పరంగా ఓటిటిల ఆఫర్లు బాగుంటే అక్కడా సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు. ఇటు ఇంటా అటు బయటా తెలుగు సినిమాలు కళకళలాడాలని కోరుకుందాం. అనగనగా ఓ అతిథి ఓటిటిల మీద విడుదలైన సినిమాల్లో ‘ఆహా’ ద్వారా విడుదలైన ‘అనగనగా ఒక అతిథి’ ఒక భిన్నమైన గుర్తింపు పొందింది. దాదాపు మూడు నాలుగు ముఖ్యపాత్రలతో నడిచిన ఈ సినిమా ఒక కన్నడ నాటకం ఆధారంగా మొదట కన్నడంలో సినిమాగా వచ్చి తెలుగులో రీమేక్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్, చైతన్యకృష్ణ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ సినిమా దురాశ దుఃఖానికి చేటు అని చెబుతుంది. సినిమా అంగీకరించని కథలు ఓటిటిల ద్వారా అంగీకారం పొంది రిలీజవుతాయని ఈ సినిమా ద్వారా తెలుస్తోంది. – సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సినిమా డెస్క్ -
జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!!
భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు ఈ ఏడాది ఘనవిజయాలే నమోదు చేశాయి. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగం చివరి క్షణంలో వైఫల్యం ఎదుర్కోవడాన్ని మినహాయిస్తే ఇస్రో ఈ ఏడాది అభివృద్ధివైపు పురోగమించిందనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసుకున్న నావిగేషన్ మైక్రో ప్రాసెసర్లతో రాకెట్లు నడవడం ఒక విజయమైతే... పీఎస్ఎల్వీ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, వివిధ దేశాలకు చెందిన 50 వరకూ ఉప గ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో కీర్తి కిరీటంలో కలికి తురాయిలే. చెన్నై సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముఖ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించి నాసా ప్రశంసలు అందుకోవడం ఈ ఏడాది హైలైట్!. ఇక చంద్రయాన్ –2 గురించి... జాబిల్లిపై ఓ రోవర్‌ను దింపేందుకు, మన సహజ ఉపగ్రహానికి వంద కిలోమీటర్ల దూరంలో ఓ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 22న జరిగింది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా 3840 కిలోల బరువున్న చంద్రయాన్–2 పలుమార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. జాబిల్లి కక్ష్యలోకి చేరింది. ఆ తరువాత క్రమేపీ జాబిల్లిని చేరుకుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడి పోయినప్పటికీ జాబిల్లిపైకి దిగుతున్న క్రమంలో కొంత ఎత్తు లోనే సంబంధాలు తెగి పోయాయి. ఆ తరువాత కొద్ది కాలానికి ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. భారతీయ శాస్త్రవేత్త పేరుతో నక్షత్రం ► సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఒక గ్రహం తిరుగుతున్న నక్షత్రా నికి ఈ ఏడాది భారత శాస్త్రవేత్త బిభా ఛౌదరీ పేరు పెట్టారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుగా పేరొందిన థర్టీ మీటర్ టెలిస్కోపు ద్వారా పరిశీలనలు జరిపేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ ఈ ఏడాదే. ► ప్రభుత్వ రంగ సీఎస్ఐఆర్కు చెందిన సంస్థ కాలుష్యం వెదజల్లని టపాసులను సిద్ధం చేయగా, బొగ్గును మండించడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే పరిశోధ నలు చేపట్టేందుకు బెంగళూరులో ఓ కేంద్రం ఏర్పాటైంది. ► కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ఏడాది మానవ అట్లాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘మానవ్’పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నంలో శరీరంలోని కణస్థాయి నెట్వర్క్ తాలూకూ వివరాలు ఉంటాయి. ► వెయ్యి మంది భారతీయుల జన్యుక్రమ నమోదును ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. -
యావద్దేశానికీ... ఒక ‘దిశ’
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులను చీల్చి చెండాడిన ‘మీటూ’ ఉద్యమం ఈ ఏడాది మహి ళలకు కొత్త శక్తినిచ్చింది. ఈ చైతన్యమే మహిళా ఉద్యమంలో 2019ని మైలురాయిగా నిలిపింది. అక్రమాలపై, అత్యాచారాలపై నిర్భ యంగా గళమెత్తేలా చేసింది. మరోవంక ఇన్ని జరిగినా మృగాళ్లు మాత్రం చెలరేగిపోతూనే వచ్చారు. యావద్దేశానికీ... ఒక ‘దిశ’ నవంబర్ 27, 2019న తెలంగాణలోని శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన యావద్దేశాన్నీ అట్టుడికించింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణం ఉరితీయాలంటూ ప్రాంతాలకతీతంగా యావ ద్దేశం ఒక్కటైంది. ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపడం వేగంగా జరిగిపోయింది. యువతుల్లో, మహిళల్లో చైతన్యాన్ని నింపే అనేక కార్యక్రమాలకు ఈ ఘటన దారితీసింది. ‘దిశ’పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా తెచ్చింది. అత్యాచార బాధితురాలిని కాల్చేశారు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో తనపై అత్యాచా రానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ కోర్టుకెళ్లిన ఓ మహిళ... వారి దౌర్జన్యానికి బలైపోయింది. ఐదుగురు నిందితుల్లో బెయిల్‌పై వచ్చిన ఇద్దరి తోపాటు మరో ముగ్గురు బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు. అగ్ని కీలల్లో దగ్ధమ వుతూనే ఆసరా కోసం చుట్టుపక్కల జనాన్ని ప్రా«థేయపడిన బాధితురాలు... చివరకు పోలీసు లకు స్వయంగా ఫోన్ చేసి సాయం కోరడం అందర్నీ కలచి వేసింది. ఈ కేసులో నిందితుడు శుభం త్రివేదీ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తన సోదరుడితో కలసి ఆమెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బా«ధితు రాలు తన మరణ వాంగ్మూలంలో ఇదే చెప్పింది. చివరికామె ఆసుపత్రిలో కన్నుమూసింది. -
ఆ సిత్రాలు.. ‘సోషల్’.. వైరల్!
సెకన్లు, నిమిషాల వ్యవధిలో కార్చిచ్చులా వ్యాపించి అందరినీ చేరుకునే సత్తా ఉండటం సోషల్ మీడియాలో కొత్త పోకడలకు ఆస్కారమిస్తోంది. ఆ సిత్రాలు కొన్ని చూస్తే... బాటిల్ క్యాప్ చాలెంజ్ సీసా మూతను కాలితో తీసే చాలెంజ్ పేరే బాటిల్ క్యాప్ చాలెంజ్. టైక్వాండో ఇన్స్ట్రక్టర్ ఫరాబీ డవ్లెట్చిన్ దీన్ని ప్రారంభించారు. నేలపైనగానీ, బల్లపైన గానీ ఒక సీసాని ఉంచి, దాని మూతను వదులుగా పెట్టాలి. కాలితో సీసా మూత ఊడిపోయి కిందపడేలా చేయాలి. సీసా మాత్రం పడకూడదు. బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, గోవింద, పరిణీతి చోప్రా, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. కికీ చాలెంజ్ కదులుతున్న కారులోంచి దిగడం.. పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేయడం... ఇదీ కికీ ఛాలెంజ్!!. యువత ఈ చాలెంజ్‌ను క్షణాల్లో వైరల్‌గా మార్చేసినా.. చాలా చోట్ల ఈ చేష్టలు ప్రమాదాలకూ కారణమ య్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో పోలీసులు.. ఈ చాలెంజ్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీచేయాల్సిన పరిస్థితులొచ్చాయి. ఫిట్నెస్ చాలెంజ్ ఈ చాలెంజ్ ప్రకారం యోగా చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ప్రధాని మోదీ యోగా వీడియోలూ మథ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. క్రీడాకారులూ, బాలీవుడ్ నటులు ఇంకా ఎందరో ఇందులో పాల్గొన్నారు. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
హిట్.. ఫేవరెట్
2019... ప్రేక్షకులకు తెలుగు సినిమా చాలానే ఇచ్చింది. కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసింది. కొత్త తరహా చిత్రాలను తీసుకొచ్చింది. పనిలో పనిగా ప్రేక్షకుల ‘ఫేవరేట్ కాంబినేషన్’ని మళ్లీ సెట్ చేసింది. 2019లో ఇలా మళ్లీ సెట్ అయిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమాలు 2020లో విడుదలవుతాయి. ఇక ఈ ఫేవరెట్ హిట్ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం.. మాస్ కాంబినేషన్ ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ముగిశాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ అల్లు అర్జున్‌ని (బన్నీ) ‘జులాయి’ (2012)గా చూపించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. ‘జులాయి’ వచ్చిన మూడేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీతో త్రివిక్రమ్ చెప్పించిన కుటుంబ విలువల లెక్కలు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ హాట్రిక్ హిట్ కోసం 2018లో ‘అల... వైకుంఠపురములో..’కి వెళ్లిపోయారు. ఈ చిత్రం జవనరి 12న విడుదల కానుంది. ఇక 2004లో దర్శకునిగా సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ‘ఆర్య’ సక్సెస్ క్రేజ్‌ను రిపీట్ చేయడానికి వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ (2009) చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ ఏడాదిలో ప్రకటించారు. సో.. కొత్త ఏడాది అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకాయే. సుకుమార్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ హిట్ కోసం క్రాక్ దర్శకునిగా గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కిస్తే అందులో రెండు (‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013)) చిత్రాలు రవితేజ హీరోగా వచ్చినవే. తాజాగా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘క్రాక్ ’ తెరకెక్కుతోంది. డాన్ శీను, బలుపుతో హిట్ సాధించి, ఇప్పుడు మరో హిట్ కోసం వీరు చేస్తున్న ‘క్రాక్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. గోపీచంద్ మలినేని, రవితేజ రూట్ మారింది రామ్ కెరీర్లో ‘నేను..శైలజ...’ (2016) సూపర్‌హిట్ మూవీ. దీంతో ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరమలతో 2017లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు రామ్. ఈ ఏడాది రామ్–కిశోర్ తిరుమల కలిసి ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నేను...శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో రామ్‌ను లవర్ బాయ్‌గా చూపించిన కిశోర్ ఈసారి రూట్ మార్చి ‘రెడ్’ రామ్‌ను ఫుల్ మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. రామ్–కిశోర్ తిరుమల హీరో విలనయ్యాడు! దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే చిత్రం ప్రేక్షకులకు నాని అనే మంచి నటుడిని పరిచయం చేసింది. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్మన్’ (2016) కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో చిత్రం ‘వి’. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. ఈ సినిమాలో నానీది విలన్ రోల్. అలాగే నాని తొలిసారి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం కూడా. అలా నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు తనను విలన్‌గా చూపించబోతుండటం విశేషం. సమ్మోహనం(2018) తర్వాత సుధీర్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణ , నాని లవ్ కాంబినేషన్ ‘ఊహలు గుసగుసలాడే...’(2014) చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగశౌర్య. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమాను తెరకెక్కించారు. రెండేళ్ల తర్వాత అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’(2016) సినిమాలో ఒక హీరోగా నటించారు నాగశౌర్య. నారా రోహిత్ మరో హీరో. తాజాగా నాగశౌర్య–అవసరాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మరో లవ్‌స్టోరీ కావడం విశేషం. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య ఈ థర్డ్ కాంబినేషన్సే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా తర్వాత తమిళ హిట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ కోసం హీరో వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండోసారి సెట్టయ్యారు. ‘గౌతమ్‌నంద’ (2017) తర్వాత గోపీచంద్‌ని కబడ్డీ కోచ్‌గా మార్చి, ఆయనతో రెండో సినిమా తీస్తున్నారు సంపత్‌నంది. ‘నిన్నుకోరి’(2017) హిట్ కిక్‌తో ‘టక్‌జగదీష్’ కోసం మరోసారి కలిసి సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యారు హీరో నాని, దర్శకుడు శివనిర్వాణ. ‘గూఢచారి’(2018)వంటì సూపర్‌హిట్ తర్వాత ‘మేజర్’కోసం మళ్లీ కలిశారు హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ (2015) చిత్రంలో రానా ఓ కీలకపాత్ర చేశారు. ఇప్పుడు రానా–గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది చివర్లో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హిట్ దిశగా తమను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి మరికొందరు హీరోలు కూడా రెడీ అయ్యారు. మరికొందరు అవుతున్నారు. ఇండియన్ సినిమా దృష్టంతా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైనే ఉంది. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ప్రభావమే ఇందుకు ఓ కారణం. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం 1 (2001), సింహాద్రి (2003), యమదొంగ (2007)’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (2009) అనే సూపర్‌హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి–రామ్‌చరణ్ కాంబినేషన్ పరంగా రెండోది. ఇలా ఆల్రెడీ సోలోగా రాజమౌళితో హిట్ అందుకున్న ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో కలసి హిట్ అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న పది భాషల్లో విడుదల కానుంది. –ముసిమి శివాంజనేయులు. -
బ్యాండ్ బాజా 2019 రౌండప్
-
అరుదైన కాంబినేషన్స్.. అదుర్స్
తెలుగు చిత్రసీమలో అరుదైన కాంబినేషన్లకు 2019 వేదికగా నిలిచింది. ఆసక్తికర కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు అభిమానులకు ఆకట్టుకుని నిర్మాతలకు ఆనందం కలిగించాయి. విభిన్న కాంబినేషన్లలో వచ్చిన భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అరుదైన కలయికలో 2019లో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం రండి. సాహో: పాన్ ఇండియా మూవీగా ప్రచారం పొందిన ఈ సినిమాను యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు. రెండో సినిమాకే టాప్ హీరో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసి ఔరా అనిపించాడు సుజిత్. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కడం అత్యంత ఆసక్తి కలిగించింది. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు, జాతీయ స్థాయి నటులతో ఈ సినిమాకు యమ క్రేజ్ వచ్చింది. సైరా: మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డికి అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు అప్పటించిన బాధ్యతను సురేందర్‌రెడ్డి చక్కగా నిర్వర్తించి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను అంచనాలకు తగినట్టుగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ప్రత్యేకంగా నిలిచింది. మహర్షి: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు 25వ సినిమా కావడంతో ‘మహర్షి’ఫై అభిమానులు పెట్టుకున్న అంచనాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చేరుకోగలిగాడు. మహేశ్‌కు మొమరబుల్ మూవీగా మలిచాడు. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. వినయ విధేయ రామ: మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అంచనాలను అందుకోవడంలో ఈ కాంబినేషన్ విఫలమైంది. ఇస్మార్ట్ శంకర్: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తొలిసారిగా రామ్‌తో జతకట్టి ‘ఇస్మార్ట్’ హిట్ కొట్టాడు. డైరెక్టర్ పూరి తన శైలిలో రామ్‌ను మాస్ పాత్రలో చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ విజయంతో పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. ఎఫ్2: విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్2’ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. వెంకీ, అనిల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకుని విజయం సాధించింది. ఆద్యంతరం ఎంటర్టైన్మెంట్తో సాగిన ఈ సినిమా ప్రేక్షకాదరణతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. గ్యాంగ్‌లీడర్: విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు అందరిలోనూ ఆసక్తి రేపింది. హిట్ సినిమా టైటిల్ పెట్టడం..విలక్షణ దర్శకుడు విక్రం కె కుమార్, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో యావరేజ్ సినిమాగానే మిగిలిపోయింది. కల్కి: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. రెండో సినిమాకే సీనియర్ హీరోను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. గద్దల కొండ గణేష్ : వరుణ్‌తేజ్‌ను వైవిధ్యమైన పాత్రలో చూపించిన సినిమా ‘గద్దల కొండ గణేష్’.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ అనగానే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు అందుకుని ఈ సినిమా విజయవంతమైంది. రణరంగం: ట్రెండ్‌తో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలతో చేసుకుంటూ వెళుతున్న హీరో శర్వానంద్, యువ దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పీరియాడిక్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మన్మథుడు 2: చి.ల.సౌ. సినిమాతో ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన రెండో సినిమాకు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. కింగ్ నాగార్జునతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మొదటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్.. ‘మన్మథుడు 2’ తో నిరాశపరిచాడు. -
వన్డే,టీ20 ఆటగాడిగా మిగిలిపోదల్చుకోలేదు
వన్డే,టీ20 ఆటగాడిగా మిగిలిపోదల్చుకోలేదు అన్న క్రీడాకారుడు ఎవరు? మరి ఆ ఆటగాడి ప్రాధాన్యత ఏంటి? ఈసారి రెజ్లింగ్ టోర్నమెంట్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రీడాకారులు ఎవరు? వివరాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
నేటి క్రీడా విశేషాలు
పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై 7 వికెట్లతో భారత్ ఘన విజయం సాధించింది. యాషెస్ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి స్మిత్ ఏమాత్రం తీసిపోడని అన్నాడు.ఇప్పటికే యాషెస్ తొలి టెస్టులో ఘోర పరాజయంతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని వీక్షించండి. -
2018 బిజినెస్ రివైండ్
-
వర్షపు నీటిలోనూ విషపు ఆనవాళ్లే
వాషింగ్టన్: మోన్శాంటో సంస్థ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో 1901లో ప్రారంభమైంది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల అమ్మకాలతో ఏకంగా రూ.4.28 లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఈ క్రమంలో తమ వ్యవసాయ ఉత్పత్తులు వాడినవారికి కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. తాజాగా డ్వేన్ జాన్సన్ కేసులో మోన్శాంటోకు రూ.2,003 కోట్ల భారీ జరిమానా పడటంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అడ్డదారులు.. తప్పుడు కథనాలు కేన్సర్ కారక గ్లైఫోసేట్ ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు మోన్శాంటో తొక్కిన అడ్డదారులు అన్నీ ఇన్నీ కావు. తమ ఉత్పత్తుల అమ్మకాలకు పొగాకు కంపెనీలు అనుసరించే వ్యూహాన్నే మోన్శాంటో పాటించింది. గ్లైఫోసేట్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ సోకుతుందన్న అంశాన్ని విస్మరించేలా ఈ సంస్థ రాజకీయ నేతలు, అధికారులు, నియంత్రణ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చింది. మోన్శాంటో ఉత్పత్తులు సురక్షితమని రైతులు, వినియోగదారులు నమ్మేలా పత్రికలు, జర్నల్స్‌లో అనుకూల కథనాలు రాయించింది. ఇందుకు లొంగని జర్నలిస్టులు, శాస్త్రవేత్తలను పలు రకాలుగా వేధించింది. వీలైన చోట్ల ప్రలోభాలతో నియంత్రణ సంస్థలను లోబర్చుకుంది. ‘రౌండప్’ ‘రేంజర్ ప్రో’ కలుపు మొక్కల నాశనుల్లో ఉండే గ్లైఫోసేట్ కారణంగా కేన్సర్ సోకుతుందని మోన్శాంటోకు 1980ల్లోనే తెలుసని శాన్ఫ్రాన్సిస్కో జ్యూరీ విచారణ సందర్భంగా బయటపడింది. దీన్ని సరిదిద్దడం కానీ, నిలిపివేయడం కాని చేయని మోన్శాంటో.. తమ ఉత్పత్తులు సురక్షితమన్న ప్రచారానికి తెరలేపింది. ఇందులోభాగంగా స్వతంత్ర మీడియా సంస్థల ద్వారా అసలు ఉనికిలోనే లేని వ్యక్తుల పేర్లతో తప్పుడు శాస్త్రీయ కథనాలు రాయించింది. తమ ఉత్పత్తులను రైతులు, వినియోగదారులు నమ్మేలా ఈ కుట్రలో పర్యావరణ శాఖ అధికారుల్ని సైతం భాగస్వాముల్ని చేసింది. వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా ప్రయోగించిన ‘ఏజెంట్ ఆరేంజ్’ అనే రసాయనిక ఆయుధాన్ని కూడా మోన్శాంటో మరికొన్ని సంస్థలతో కలసి ఉత్పత్తి చేసిందని అంటారు. అయితే ఈ ఆరోపణల్ని మోన్శాంటో గతంలో ఖండించింది. తాజాగా మోన్శాంటో తరఫున శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో కేసును వాదించిన లాయర్ జార్జ్ లంబర్డీ.. అంతర్జాతీయ పొగాకు కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గాలి, నీరు, మట్టి అన్నింటా విషమే.. ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్ ఉత్పత్తుల వినియోగం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా 82.6 కోట్ల కేజీల గ్లైఫోసేట్ ఉత్పత్తులను రైతులు, ఇతర వినియోగదారులు వాడుతున్నారు. కేన్సర్ కారక గ్లైఫోసేట్ ఇప్పుడు ఎంత సాధారణ విషయంగా మారిపోయిందంటే మనం తినే అన్నం, తాగే నీళ్లలోనూ దీని అవశేషాలు ఉన్నాయి. మట్టితో పాటు గాలి నమూనాలను సేకరించగా వాటిలోనూ ఈ రసాయనం జాడ బయటపడింది. చివరికి వర్షపు నీటిలోనూ ఈ విషపూరిత గ్లైఫోసేట్ ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు విస్తుపోయారు. అంతలా ఈ విషం గాలి, నీరు, నేలను కలుషితం చేసింది. మోన్శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై స్వతంత్ర సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్లైఫోసేట్ ఉత్పత్తుల్ని ప్రమాదకర జాబితాలో చేర్చలేదు. దావాకు సిద్ధంగా మరో 4 వేల మంది రైతులు డ్వేన్ జాన్సన్ కేసు తీర్పుతో మోన్శాంటోకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. సెయింట్ లూయిస్‌లో వచ్చే అక్టోబర్‌లో మోన్శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై కేసు విచారణకు రానుంది. అలాగే దాదాపు 4,000 మంది అమెరికా రైతులు మోన్శాంటో కీటక, కలుపు నాశనుల కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతిందని వేర్వేరు కోర్టుల్లో దాఖలుచేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఐఆర్క్ నివేదికతో పాటు కాలిఫోర్నియా జ్యూరీ తీర్పు నేపథ్యంలో మోన్శాంటో బాధితులకు రూ.లక్షల కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోన్శాంటో ఉత్పత్తుల కారణంగా కేన్సర్ సోకినందుకు కాకుండా కేన్సర్ సోకుంతుందన్న విషయాన్ని దాచిపెట్టినందుకు కంపెనీని కోర్టులు దోషిగా నిలబెట్టే అవకాశముందని చెబుతున్నారు. 2018, జూన్‌లో మోన్శాంటోను జర్మనీ ఎరువుల దిగ్గజం బేయర్ దాదాపు రూ.4.28 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. -
పొలిటికల్ వేడిని రగిలించిన 2017
ఈ ఏడాది రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్ని పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ముఖ్యమంత్రి జిల్లాపై మరింత శ్రద్ధ పెట్టారు. అధికార పార్టీ అభివృద్ధి పేరిట..మంత్రులతో చక్కర్లు కొట్టించింది. లోపాలు, వైఫల్యాలపై కమ్యూనిస్టులు కాస్త గుర్రుమన్నారు. టీడీపీలో ఆటుపోట్లు, కాంగ్రెస్‌లో సమన్వయానికి దిద్దుబాట్లు, వైఎస్సార్సీపీ పాతబలాన్ని పొందేందుకు కసరత్తుతో.. రాజకీయ వేడి రగులుకుంది. భవిష్యత్‌లో సై..అనేందుకు సిద్ధమనే సంకేతాలనిచ్చింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అభివృద్ధి మంత్రాన్ని ఆద్యంతం పటించగా.. విపక్ష రాజకీయ పక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, సంస్థాగత అంశాలపై దృష్టి సారించి ఈ సంవత్సరం జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. నూతన సంవత్సరం 2017 ఆరంభంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖమ్మంజిల్లాకు విచ్చేసి తిరుమలాయపాలెం వంటి కరువుపీడిత ప్రాంతంలో సాగునీటిని ప్రవహింపచేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో రూపుదిద్దుకున్న జలసిరులు కురిపించే భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించారు. చైతన్య రాజకీయాలకు చిరునామా అయిన ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో కీలకమైన భక్తరామదాసు ప్రాజెక్టు మొదటిదశను సీఎం ప్రారంభించగా.. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ఏడాది లోపే రెండో దశను సైతం పూర్తి చేయించి సాగునీటిని అందించేందుకు అధికారులను సమాయత్తం చేయించారు. ఇప్పటికే ట్రయల్‌రన్ పూర్తికాగా.. మరికొద్ది రోజుల్లో భక్తరామదాసు రెండో దశనుంచి సాగునీరు ఆయా ప్రాంతాలకు అందనున్నది. పాలేరు ప్రాంతంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో రూపొందించి నిరుపయోగంగా ఉన్న పాలేరు పాతకాల్వను ఆధునిక హంగులతో పునరుద్ధరింప చేయగా.. పాతకాల్వను మంత్రి హరీష్‌రావు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూపొందించిన సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులు కొంతమేరకు ఊపందుకున్నా.. ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్న భావనను ఈ సంవత్సరం పనులు కలిగించాయి. ఎన్నికల వాతావరణం.. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అనేక నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పక్షాల మధ్య పరస్పర ఆరోపణలు, సవాల్, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టి విక్రమార్కలు ఆయా పార్టీల బలోపేతానికి, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఈ సంవత్సరం అంతా తామై నిలిచారు. సీపీఎం జిల్లా మహాసభలను ఈ సంవత్సరం వైరాలో ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు ప్రజా సమస్యలపై చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేసింది. సీపీఐ సైతం పార్టీ నిర్మాణంపై దృష్టి సారించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుకుని పోరుబాట బస్‌యాత్రను నిర్వహించింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరు నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం కీలకంగా నిలిచింది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం జిల్లా అధ్యక్షులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. అగ్రనేతలు కదిలొచ్చారు. కాంగ్రెస్ పార్టీ..: ఖమ్మంలో నిర్వహించిన సదస్సు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. అలాగే డిసెంబర్ మొదటివారంలో ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ప్రజా చైతన్య సభను నిర్వహించింది. టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కోనేరు సత్యనారాయణ (చిన్ని)లను పార్టీ అధిష్టానం నియమించింది. ఐటీ అడుగులు.. ఖమ్మం కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖమ్మంకు మంజూరు చేసిన ఐటీ హబ్‌కు జూన్ 15వ తేదీన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లాకు పారిశ్రామిక పరంగా ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామన్న భరోసా జిల్లా ప్రజలకు కొత్త ఆశలను చిగురింప చేసింది. అధికార పార్టీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఈ సంవత్సరం సైతం యథావిధిగానే కొనసాగినా అవి బహిర్గతం కాకుండా ఆ ప్రభావం పార్టీపై, పార్టీ శ్రేణులపై పడకుండా ఎవరికి వారే తమదైన రీతిలో రాజకీయ చతురత ప్రదర్శించారు. విపక్షాల ఎక్కు.. కాంగ్రెస్ పార్టీతోపాటు జిల్లాలో ఉన్న సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై దృష్టి సారిస్తూనే సంస్థాగతంగా బలోపేతం కావడానికి, పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపచేయడానికి తమదైన రీతిలో ప్రయత్నాలు కొనసాగించాయి. బీజేపీ: భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, జాతీయ నేతలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కల్పించేందుకు ప్రయత్నం చేసింది. జనవరిలో భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారాం, బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ విమోచన యాత్ర జిల్లాలోని మ«ధిర నియోజకవర్గంలో కొనసాగింది. రాష్ట్ర అ«ధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగింది. టీడీపీ: తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఈ సంవత్సరం మరింత రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీకి మూలస్తంభాలుగా వ్యవహరించే ముఖ్య నేతలు అనేకమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీవైపు అడుగులు వేయగా.. మరికొందరు ముఖ్యనేతలు అదే దారిలో నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకుంటున్నాయి. కమ్యూనిస్టులు.. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలు: రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్న భావన సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది. దక్కిన పదవులు.. ఉద్యమనేతగా ఉన్న పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటివెంకటేశ్వర్లుకు ట్రైకార్ చైర్మన్ పదవి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొండబాల కోటేశ్వరరావుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఈ సంవత్సరం లభించాయి. ఇక ఎంతో కాలంగా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లాలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులు భర్తీ కాలేదు. దీంతో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ పదవుల భర్తీపై ఆశలు నెలకొని ఉన్నాయి. టీఆర్ఎస్కు ఝలక్.. టీఆర్ఎస్ పార్టీలో ఈ సంవత్సరం సైతం అనేక మంది ముఖ్యులు తీర్థం పుచ్చుకోగా.. ఆ పార్టీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్ఎస్ను వీడటం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని వీడారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదు. -
ఈవారం విశేషాల రౌండప్
కొలనులో మత్స్యకన్య! ఫ్రెస్నో పట్టణంలోని ఒక కొలను నుంచి నగ్నంగా బయటికి వచ్చిన ఈ యువతిని చూసి కాలిఫోర్నియా పోలీసులు మొదట నివ్వెర పోయారు. ఆ తర్వాత ఆమె చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయారు. తనొక మత్స్యకన్యనని ఆమె చెప్పడమే వారి ఆశ్చర్యానికి కారణం. ఆమె తన పేరును జోవాన్నాగా చెప్పుకుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, తను మత్స్యకన్యను అని చెప్పడానికి సాక్ష్యంగా ఆమె వేళ్లు కలిసి ఉన్న పాదాలను చూపించడం పోలీసులను మరోసారి తికమకపెట్టింది. చివరికి ఈ కథ ఏమయింది? మత్స్యకన్య తిరిగి కొలనులోకి వెళ్లిందో లేదో కానీ, పోలీసులు తమ విధులకు తాము వెళ్లిపోయారు. పాదాల వేళ్లు కలిసిపోయి ఉండడాన్ని ‘వెబ్డ్ ఫీట్’ అంటారు. జన్యులోపం వల్ల ఇలా అవుతుంది. ఈ లోపాన్ని జోవాన్నా తనది మానవజన్మ కాదని, మనిషీ చేపా కలసిన ‘మెర్మెయిడ్’ (మత్స్యకన్య) జన్మ అని నమ్మించడానికి ఉపయోగించుకున్నట్లుంది. డాడీ ఢమాల్ ‘టెర్మ్–టైమ్’ అనే మాట బ్రిటన్ స్కూళ్లలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆ టైమ్‌లో స్కూళ్లు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటాయి. ఎంతో అత్యవసరం అయితే తప్ప టెర్మ్–టైమ్‌లో సెలవు తీసుకోడానికి ఉండదు. అయితే జోన్ ప్లాట్ అనే బ్రిటన్ తండ్రి టెర్మ్ టైమ్ నిబంధనలను ఉల్లంఘించి మరీ తన 7 ఏళ్ల కూతుర్ని డిస్నీ వరల్ట్ టూర్‌కి తీసుకెళ్లి, స్కూలు ఆగ్రహానికి గురయ్యాడు! హెడ్మాస్టర్ అనుమతి లేకుండా కూతురి చేత సెలవు పెట్టించినందుకు స్కూలు యాజమాన్యం జోన్ ప్లాట్‌కు 60 పౌండ్ల జరిమానా (సుమారు 5 వేల రూపాయలు) విధించింది. ‘ఇది అన్యాయం. నేను జరిమానా కట్టేది లేదు’ అని కోర్టుకు వెళ్లాడు జోన్. 2015 నుంచి ఆ కేసు కోర్టులో నడుస్తోంది. రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సారాంశం ఏమిటంటే... ‘జోన్ జరిమానా కట్టాల్సిందే’ అని! అంతే కాదు, కోర్టు ఆ తండ్రికి 12,000 పౌండ్ల అదనపు జరిమానాను (9 లక్షల 54 వేల రూపాయలు) కూడా విధించింది. దీనిపై జోన్ ప్లాట్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడితే మరి కొంత జరిమానా కట్టవలసి వస్తుందని శ్రేయోభిలాషులైన న్యాయ నిపుణులు కొందరు జోన్‌ను హెచ్చరించడంతో ఇప్పటికైతే ఊరుకున్నాడు. కేసు ట్రంపు ట్రంపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనేక దేశాలలో గోల్ఫ్ కోర్స్‌లు ఉన్నాయి. స్కాట్లాండ్లో కూడా ఓ గోల్ఫ్ కోర్స్ ఉంది. ఆ గోల్ఫ్ కోర్స్‌కు వ్యతిరేకంగా కరోల్ రొహాన్ బైట్స్ అనే బ్రిటిష్ మహిళ కొంతకాలంగా పోరాడుతోంది. గోల్ఫ్ కోర్స్‌ను అక్కడి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్. ఈలోపు గోల్ఫ్‌కోర్స్ సిబ్బంది ఆమెపై కేసు పెట్టారు. గోల్ఫ్‌కోర్స్‌లో ఆమె మూత్రవిసర్జన చేశారని ఆరోపిస్తూ, అందుకు సాక్ష్యంగా వీడియోను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కేసు ఇంకో మలుపు తిరిగింది. తను మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోను చిత్రీకరించడం శిక్షార్హమైన నేరం అని కరోల్ కేసు పెట్టారు. తనకు పొత్తికడుపు సమస్య ఉన్నందున విసర్జనను ఆపుకోలేకపోయానని వివరణ ఇస్తూ 3 వేల పౌండ్లను (2 లక్షల 38 వేల రూపాయలు) తనకు పరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కానీ కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. అభ్యంతరకరమైన చిత్రీకరణతో ఆమెను నొప్పించిన వారికీ చివాట్లు పెట్టింది. తినలేక ...పోయాడు పందెం కాసి, 80 సెకన్లలో సుమారు 300 గ్రాముల డోనట్‌ను తినేందుకు ప్రయత్నించిన 42 ఏళ్ల ట్రావిస్ మలోఫ్ అనే వ్యక్తి, డోనట్ గొంతులో అడ్డుపడి చనిపోవడం ఆ చుట్టూ నిలబడి వేడుకను తిలకిస్తున్నవారిలో విషాదాన్ని నింపింది. యు.ఎస్.లోని డెన్వర్‌లో ‘వూడూ డోనట్స్ ఈటింగ్ ఛాలెంజ్’లో భాగంగా ట్రావిస్ ఈ ప్రాణాంతకమైన విన్యాసానికి తెగించి, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. నిజానికి ఆయన తన మరణాన్నయితే కొని తెచ్చుకున్నారు కానీ, పోటీ కోసం డోనట్‌ను ఉచితంగానే పొందారు. ఈ సంఘటన తర్వాత డెన్వర్ చుట్టుపక్కల ఈ తరహా పోటీలపై పోలీసులు నిఘావేసి ఉంచారు. నన్ను పెళ్లి చేసుకోవా? కైల్ స్టంప్ వయసు 23. ఆహియోలోని షెఫీల్డ్ లేక్ ఏరియాలో ఉంటాడు. అతడో అమ్మాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు మిషెల్ . ‘నన్ను పెళ్లి చేసుకుంటావా మిషెల్?’ అని ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. అయితే ఆ ప్రపోజల్‌ను వెరైటీగా చేద్దామనుకున్నాడు. చేశాడు కూడా! ఆహియోలోని ఓ షాపింగ్ సెంటర్ గోడపై పెద్ద ఎర్రటి అక్షరాలతో, ప్రేమ గుర్తుతో.. Mజీఛిజ్ఛిll్ఛ M్చటటy ఝ్ఛ. ఐ ఔౌఠ్ఛి yౌu అని రాశాడు. ఆ అమ్మాయి ఈ ప్రపోజల్‌ని చూసిందో లేదో కానీ, నగర పాలక సంస్థ వారు చూశారు. శుభ్రంగా ఉన్న గోడను పాడు చేసినందుకు అతడి అడ్రస్ కనుక్కుని వెళ్లి మరీ 300 డాలర్ల ఫైన్ (సుమారు 20 వేల రూపాయలు) విధించారు. గోడను బాగు చేసుకోడానికి ఆ మాత్రం ఖర్చవుతుందట వాళ్లకు. అయితే ఈ ప్రేమికుడిని ఫైన్‌తో వదిలిపెట్టలేదు. కొన్నాళ్లు కమ్యూనిటీ సర్వీస్ కూడా చేయాలని నోటీసులు పంపారు. ఇంతకీ గోడ మీద కనిపిస్తున్న ఈ ఫెమీలియా ఎవరు? అదీ ఆ ప్రియురాలి పేరే. నచ్చని ముఖం జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రపంచానికి ఇంకా కోపం చల్లారలేదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కనీసం 60 లక్షల మంది హిట్లర్ సృష్టించిన మారణహోమానికి బలైపోయారు. అందుకే హిట్లర్ పేరుతోగానీ, హిట్లర్ ఫొటోతో గానీ ఉన్నది ఏదైనా నేటికీ నిరాకరణకు, తీవ్రమైన వ్యతిరేకతకు గురవుతూనే ఉంది. తాజాగా... హిట్లర్ బొమ్మ ఉన్న పిల్లల కలరింగ్ బుక్‌ను నెదర్లాండ్స్ నిషేధించింది. క్రూయిద్వత్ అనే పుస్తక విక్రయాల గొలుసు సంస్థ ప్రచురించిన ఆ బుక్‌లో ‘రంగులు వేయండి’ శీర్షిక కింద హిట్లర్ బొమ్మను గీతల్లో ఇచ్చారు. ఆ గీతలకు రంగులు అద్దితే హిట్లర్ ప్రత్యక్షమౌతాడు. అయితే మానవాళికి విరోధి అయిన హిట్లర్ బొమ్మను పిల్లల పుస్తకంలో ఒక యాక్టివిటీగా ఇవ్వడం ఏంటని నెదర్లాండ్స్ ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో క్రూయిద్వత్ తన పంపిణీ దుకాణాలన్నింటిలోంచీ ఆ బుక్‌ను ఉపసంహరించుకుంది. అంతే కాదు, లోక కంటకుడైన హిట్లర్ బొమ్మను పిల్లల పుస్తకాల్లో ప్రచురించినందుకు దేశంలోని తల్లిదండ్రులందరికీ క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. గడుసరి దొంగ అతడొక గజదొంగ. బెయిల్ మీద విడుదల అయ్యాడు. అతడు అట్నుంచటే పారిపోతాడేమోనని బ్రిటన్ పోలీసులకు డౌట్ వచ్చింది. అతడు తప్పించుకు పోకుండా, ఒక సెల్‌ఫోన్ అతడి చేతికి ఇచ్చి... ‘‘మేం ఎప్పుడు ఫోన్ చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఫోన్ లిఫ్ట్ చెయ్యాలి, మాతో మాట్లాడాలి’’ అని చెప్పి పంపించారు. ఆర్నెల్లు గడిచాయి. దొంగ ఎక్కడికీ తప్పించుపోలేదు కానీ, దొంగకు ఏ ఫోన్ అయితే ఇచ్చారో ఆ ఫోన్‌కి 45,000 పౌండ్ల బిల్లు (35 లక్షల 78 వేల రూపాయలు) వచ్చింది. అది పోలీస్ డిపార్ట్మెంట్ పేరు మీద ఉండడంతో పోలీసులే ఆ బిల్లు పే చెయ్యవలసి వచ్చింది. ‘ఇంత భారీగా ఎవరితో మాట్లాడావయ్యా దొంగయ్యా’ అని అడిగితే అతడు అసలు విషయం చెప్పాడు. ఆ ఫోన్‌ని వాడుకొమ్మని తన ఫ్రెండ్స్‌కి ఇచ్చేవాడట. క్రెడిట్ లిమిట్ లేని సిమ్‌కార్డును పొరపాటున దొంగగారి ఫోన్లో పెట్టి ఇవ్వడంతో ఈ అనుకోని ఖర్చు వచ్చిపడింది బ్రిటన్ పోలీసులకు. ఇక్కడికి వెళ్లబోయి...అక్కడికి వెళ్లాడు ప్రపంచంలో ఒకే పేరుతో అనేక ప్రదేశాలు ఉండే అవకాశం ఉంది. సిడ్నీ కూడా అలాగే రెండు–మూడు చోట్ల ఉంది. ఒకటి ఆస్ట్రేలియాలో, ఇంకోటి సోవా స్కాటియాలో, మరొకటి బ్రిటిష్ కొలంబియాలో ఉంది (ఈ నోవా స్కాటియా, బ్రిటిష్ కొలంబియా రెండూ కెనడాలోనే ఉన్నాయి). ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఒక డచ్చి టీనేజర్ (నెదర్లాండ్స్ బాలుడు) మిలాన్ షిపర్ నెదర్లాండ్స్ నుండి సిడ్నీ వెళ్లదలచుకున్నాడు. నిజానికి అతడు వెళ్లవలసింది ఆస్ట్రేలియాలోని సిడ్నీ. కానీ నోవా స్కాటియాలోని సిడ్నీకి వెళ్లే విమానం ఎక్కేశాడు. అమ్‌స్టర్‌డ్యామ్ టు సిడ్నీ ఫ్లైట్ అది. మిగతా విమానాలతో పోల్చి చూస్తే ఆ విమానంలో టిక్కెట్ 300 డాలర్లు (సుమారు 24 వేల రూపాయలు) తక్కువ. అందుకే ఎక్కేశాడు. ఆ ఫ్లయిట్ ఆ బాలుడిని కెనడాలోని టొరంటో తీసుకెళ్లింది. అక్కడి నుంచి వేరే విమానం ఎక్కించి నోవాస్కాటియాలోని సిడ్నీలో దించింది. కిందికి దిగాక చూసుకుంటే అతడు తనకు తెలిసిన సిడ్నీలో లేడు! సన్నీగా ఉండే సిడ్నీకి వెళ్లాలనుకుని, చిల్డ్‌గా ఉండే సిడ్నీలో దిగాడన్నమాట. -
SFI ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నం
-
సల్లూభాయ్ @48 నాటౌట్