పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. జులై 27న విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)
సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ.. పిల్లల వీడియోలు షేర్ చేయ్యొదంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)
సోషల్ మీడియాలో నటి నటులపై ట్రోలింగ్ వీడియోలు డార్క్ కామెడీ పేరుతో వీడియోలు వేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించాడు. చెప్పినట్లుగానే నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)
భారతీయుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాని అవమానించినట్లుగా ఉన్నాయంటూ సిద్ధార్థ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో సిద్దూ వెంటనే స్పందించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.(పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరితో పాటు మొత్తం 8 అవార్డులను సోంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. శంకర్ మేకింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా తగ్గిపోయాయి. (‘భారతీయుడు 2’ సినిమా రివ్యూలో కోసం క్లిక్ చేయండి)
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా చిత్రం ఈ నెల 12న విడుదలైంది. రీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ట్రైలర్ జులై 10న విడుదల అయింది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. (ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార సాంగ్ జూలై 10నరిలీజ్ అయింది. (సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్. అయ్యింది ఈ సినిమా జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. (ట్రైలర్ కోసం క్లిక్ చేయండి)
కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాకు ‘క’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలవుడ్ నటులు సందడి చేశారు. మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు టాలీవుడ్ తారలు ఈ వివాహానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment