1. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్‌కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. రాజుగారి ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్
బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. ఏపీ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్.. ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందజేత
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. సచిన్.. ఇలా చేయడం తగునా?
సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. ఏపీ గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. తెలంగాణ: నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా
రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. కృష్ణంరాజు.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు
అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని పలువురు వక్తలు హైదరాబాద్‌లో జరిగిన సంతాప సభలో వ్యాఖ్యానించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్
రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం!
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. భర్తలూ.. భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి
గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. అలాగే డాక్టర్‌లతో పాటు సైకాలజిస్టులు ఇచ్చే సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment