morning news
-
సాక్షి స్పీడ్ న్యూస్@9AM 06 December 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@08:30AM 21 November 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@8AM 14 November 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@08:30AM 08 November 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@08:30AM 07 November 2023
-
సాక్షి మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్ 31 October 2023
-
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రాజుగారి ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్ బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్.. ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందజేత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సచిన్.. ఇలా చేయడం తగునా? సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఏపీ గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. తెలంగాణ: నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని పలువురు వక్తలు హైదరాబాద్‌లో జరిగిన సంతాప సభలో వ్యాఖ్యానించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. భర్తలూ.. భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. అలాగే డాక్టర్లతో పాటు సైకాలజిస్టులు ఇచ్చే సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సౌతాఫ్రికా హెచ్‌కోచ్ పదవికి బౌచర్ గుడ్‌బై ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్‌స్టార్ సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ! చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో! చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.. Father's Day 2022: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు నాన్నా...నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Agnipath Scheme: అనుమానాలు, వివరణలు అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Sri Lanka Fuel Crisis: చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్ చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. AP Inter Classes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే.. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. ‘సీటు’ మార్పుపై సీనియర్ల నజర్! రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కొందరు తాము పోటీ చేసే నియోజకవర్గాలను మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం, గతంలో ప్రాతినిధ్యం వహించిన వాటికి బదులు కొత్త స్థానాల్లో పోటీపై ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. Agneepath Scheme Protest: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే! భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌లో విజేతను తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా... భారత్ సరైన సమయంలో కోలుకొని రెండు వరుస విజయాలతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. అక్క మరణానికి ప్రతీకారం.. బావమరిది చేతిలో నటుడు హత్య? మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. ఈ ఏడాదే 25 నగరాల్లో 5జీ టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్‌కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ఫొటోలు, వీడియోలు విడుదల.. ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కేశినేని నాని కార్యాలయం ముందు ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Monkeypox Virus: 27 దేశాలకు పాకిన మంకీపాక్స్.. మొత్తం 780 కేసులు మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు.. ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..? ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఎన్ఆర్ఐలను ఊరిస్తున్న రియల్టీ ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రతిభ..: జయం మనదే! అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో కదా! ఇంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాడని సందేహం వచ్చే ఉంటుంది కదా. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే రోజు, పౌర్ణమి రెండూ ఒకేరోజు వస్తే ఇలా పెద్ద ఆకారంలో చంద్రుడు కనిపిస్తాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Dhanush Sends Legal Notice: మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’ మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. పెళ్లి తంతులో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. వెంటాడి చంపేస్తున్నారు.. మొన్న భువనగిరి, నిన్న సరూర్‌నగర్, నేడు బేగంబజార్.. భువనగిరి జిల్లా లింగ రాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ మరో కులానికి చెందిన భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కూడా భర్తను వదిలేయమని పలుమార్లు కూతురిని బెదిరించినా వినకపోవటంతో అల్లుడిని మట్టుబెట్టాలని మామ పల్లెపాటి వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. టీడీపీ విష ప్రచారం దుర్మార్గం తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ఉన్మాదుల్లా వ్యవహరిస్తూ రాష్ట్రానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఘాటుగా విమర్శించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Venkatesh-F3 Movie: ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందు నిలబడను: రాజేంద్రప్రసాద్ ‘‘నా సినిమా థియేటర్స్‌లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. IPL 2022-Tilak Varma: ఐపీఎల్లో తెలుగుతేజం తిలక్ వర్మ కొత్త చరిత్ర ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు.. తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. డెబ్యూ సీజన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తిలక్ వర్మ చోటు సంపాదించాడు. ఈ సీజన్లో తిలక్ వర్మ 14 మ్యాచ్‌లాడి 397 పరుగులు సాధించాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మునగ సిరులు తల్లిదండ్రులు చెప్పేమాటలను పెడ చెవిన పెట్టే వారు కొందరైతే, తమ పేరెంట్స్ పడుతోన్న కష్టాలు, వారి ఆలోచనలను మనసుపెట్టి అర్థం చేసుకుని గౌరవించేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే దీపిక రవి. ఓ రైతు కడుపున పుట్టిన దీపిక రైతుల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకుని మరొకరిని.. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన దేవేంద్రన్(55) పశువుల వ్యాపారి. ఇతని మొదటి భార్య రేణుకాంబాల్ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో గ్రామానికి చెందిన సురేష్ మృతి చెందడంతో అతని భార్య ధనలక్ష్మిని 5 నెలల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సినిమాను మించిన పవన్ ‘పవర్’ డ్రామా తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని అకస్మాత్తుగా మంగళగిరికి వచ్చి కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్‌తో
1. Andrew Symonds: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. గోధుమల ఎగుమతులపై నిషేధం దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andrew Symonds-ICC: సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్ ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) హఠాన్మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సహజ సేద్యం.. ఏపీ ఆదర్శం సహజ సేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. తద్వారా పంటల సాగుకు రైతులకు పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం కూడా తగ్గడంతో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Retiring Rooms: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ మీరు గంటల తరబడి ప్రయాణం చేసి అలసిపోయారా? ఓ రెండు గంటల పాటు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారా? మరేం ఫరవాలేదు. రైల్వేస్టేషన్లలోనే ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. రెండు గంటలే కాదు. రెండు రోజులు కూడా ఉండిపోవచ్చు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Sarkaru Vaari Paata : ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్ టెక్ ప్లాట్‌ఫామ్ డైన్‌ఔట్‌ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్ గ్రూప్ కంపెనీ అయిన ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అమూల్య ప్రతిభ నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్‌తో
1.జాబిల్లిపై పచ్చదనం! జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా.. భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి అదే కారణమా? దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఒక కుటుంబం.. ఒకే టికెట్ భవిష్యత్ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ శుక్రవారం ప్రారంభమైంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే.. రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదముద్ర వేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 సిటీబస్సు ఇక 24 గంటలు పరుగులు తీయనుంది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. టి20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కొత్త చరిత్ర పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడ టి20 క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ను ఔట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 200వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? ‘మీ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు?’ సినిమా ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే ప్రశ్న ఇది. ‘అన్నీ కుదిరినప్పుడు...’ అనే సమాధానం కూడా కామన్. అలా అన్నీ కుదిరినప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మూడోసారి రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు.. అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్ జోన్లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్ జోన్ పరిధిలో 136 మంది, శంషాబాద్ జోన్లో 152 మంది కనబడకుండా పోయారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్‌తో
1. నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్లాండ్ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘హస్త’ వాసి మారేనా? వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ సెమీఫైనల్ చేరింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడ్డారు. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతనిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫస్ట్ ఎయిర్టెల్.. సెకండ్ జియో.. మార్చి నెలలో జియో, ఎయిర్టెల్ కొత్త చందాదారులను సొంతం చేసుకున్నాయి. ఎయిర్టెల్ నికరంగా 22.55 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. జియో కొత్త కస్టమర్లు 12.6 లక్షలుగా ఉన్నారు. వొడాఫోన్ ఐడియా 28.18 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. కావలసినవి: బీట్రూట్ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టెన్త్ విద్యార్థులకు ‘పరీక్షే’! పదో తరగతి పరీక్షలు రాయబోతున్న లక్షలాది మందిలో ఇలాంటి ఆందోళనే కనిపిస్తోందని ఉపాధ్యాయులు చెప్తున్నా రు. గత రెండేళ్లలో ప్రత్యక్ష తరగతులు లేక, ఆన్లైన్ తరగతులు అర్థంకాక, నెట్వర్క్ సమస్యలతో అసలు పాఠాలే వినలేని పరిస్థితులతో ఇప్పుడు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతు న్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్‌తో
1. Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం రష్యా దళాలపై తమ సేనలు క్రమంగా పైచేయి సాధిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఖర్కీవ్ నుంచి రష్యా సైనికులను వెనక్కి తరిమేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఒక చట్టం... వేల వివాదాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Asani Cyclone: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా ఉన్న అసని తొలుత తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు! బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. IPL 2022: వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే వార్నర్ అదృష్టం రాజస్తాన్ రాయల్స్ కొంపముంచినట్లయింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ యజ్వేంద్ర చహల్ వేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Sarkaru Vaari Paata Twitter Review: ‘సర్కారు వారి పాట’ టాక్ ఎలా ఉందంటే.. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. సింగిల్ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. 40.5 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు అజెండా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తోందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని జల వనరుల శాఖా మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి, తద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నేత చంద్రబాబు అని మండిపడ్డారు. పూర్తి వివరాలు. తొలిరోజు 19,108 మందికి ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. పూర్తి వివరాలు.. మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’! బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితుల్ని బోయిన్పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. వీరంతా కిడ్నాప్ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారే అని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు.. కరోనాపై గెలుపు తథ్యం భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వివరాలు.. నార్వేలో ‘టీకా’ విషాదం కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు.. ఔను.. భారత్‌కు వస్తున్నాం..! ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న వార్తలను ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. టెస్లా కార్లు చాలా ఖరీదైనవే అయినప్పటికీ.. భారత మార్కెట్లో ఆ కంపెనీకి గల అవకాశాలను విశ్లేషించిన ఒక బ్లాగ్‌పోస్ట్‌పై మస్క్ స్పందించారు. పూర్తి వివరాలు.. మహేశ్ బాబు అందానికి సీక్రెట్ అదే : విష్ణు టాలీవుడ్లో అందమైన హీరో అంటే టక్కున గుర్తొచ్చే ఒకేఒక పేరు మహేశ్ బాబు. ఆయన అందానికి హీరోయిన్లతో పాటు సాటి హీరోలు కూడా ఫిదా అవుతారు. అందంతో పాటు ఆయన మంచితనాన్ని కూడా కొనియాతున్నారు. పూర్తి వివరాలు.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది. 62 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఆసీస్ బౌలర్లను బోల్తాకొట్టించారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా (24)ను హెజిల్వుడ్ ఔట్ చేశాడు. పూర్తి వివరాలు.. ఘోర ప్రమాదం; ఆరుగురు మృతి రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్‌పూర్‌లో బస్సుకు కరెంటు వైర్ తగిలి మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే బస్సు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సజీవదహనం అయ్యారు. పూర్తి వివరాలు.. కాల్‌మనీ: కీలక నిందితుడి లీలలెన్నో.. కాల్‌మనీ పాపాల పుట్ట బద్ధలవుతోంది. తవ్వేకొద్దీ అనేక అక్రమాలూ బయటపడుతున్నా యి. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడమే కాకుండా.. తీసు కున్న అప్పు చెల్లించిన తర్వాత కూడా బాకీ ఉన్నారంటూ వీఎంసీ విశ్రాంత, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
►రిపోర్టర్లపై ఊగిపోయిన సీఎం! శాంతంగా పరిపాలన సాగించే బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో మేనేజర్ హత్య నేపథ్యంలో ‘రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నిందితులపై పోలీసుల చర్యలు కానరావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటిపై మీ కామెంట్?’ అని రిపోర్టర్లు ప్రశ్నించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. ►ఢిల్లీ రైతు ఉద్యమంతో మీది పోలికా!? బినామీ భూముల కోసం పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతిలో చంద్రబాబునాయుడు చేస్తున్న డ్రామాను.. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంతో పోల్చడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు.. ►బెస్ట్ సీఎం వైఎస్ జగన్ దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. పూర్తి వివరాలు.. ►గోమాతకు వందనం రాష్ట్ర వ్యాప్తంగా గత 40–50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా శుక్రవారం కామధేను పూజ (గోపూజ) కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఘనంగా కొనసాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), దేవదాయ శాఖల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వివరాలు.. ►ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర ఆలయాల ఘటనల్లో రాజకీయ పార్టీల కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టీడీపీ, బీజేపీకి చెందిన వారు ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని డీజీపీ డి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు.. ►‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం ఏమీ లేదని, సంసిద్ధంగా ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తాను కూడా శనివారం గాంధీలో వ్యాక్సిన్ వేయించుకుంటానని అన్నారు. పూర్తి వివరాలు.. ►నేడే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే, ప్రపంచం లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి వివరాలు.. ►లేడీ గాగా..జెన్నిఫర్ లోపెజ్..! అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు.. ►వేధించే లోన్ యాప్స్ ఔట్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు.. ►ఈ అల్లుడు బెదుర్స్! అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. పూర్తి వివరాలు.. ►లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు.. నేడు నరసరావుపేటకు సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు.. పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బట్టబయలవుతోంది. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది. పూర్తి వివరాలు.. మరోసారి సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్–2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. పూర్తి వివరాలు.. జో బైడెన్ కీలక ప్రతిపాదన, 100 రోజుల్లోనే.. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రణాళిక రూపొందించారు. 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు.. మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ దేశీయంగా మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రత్యేకంగా ప్రైమ్ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. పూర్తి వివరాలు.. అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పూర్తి వివరాలు.. లెఫ్టార్మ్ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా? టీమిండియాతో ఇక్కడ గబ్బా స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్ వార్నర్(1)ని సిరాజ్ ఔట్ చేయగా, పకోవిస్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కస్ హారిస్(5)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కు పంపాడు. పూర్తి వివరాలు.. ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. పూర్తి వివరాలు.. సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం ఆదివాసీల్లో మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శనమిస్తాయి. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
యడ్డీ ముచ్చటగా మూడోసారి కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు అంటూ గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టైంది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్లో చోటుకల్పించారు. పూర్తి వివరాలు.. మీ పాపాలే శాపాలై మిమ్మల్ని ఓడించాయి చంద్రబాబు చేసిన పాపాలే శాపాలై ఆయన్ను ఓడించాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘18 నెలలైనా ఇంకా నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావా చంద్రబాబూ..’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు, అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం అర్థరహితమని అన్నారు. పూర్తి వివరాలు.. సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు ఎన్నాళ్లకెన్నాళ్లకో అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు.. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో కొంగొత్త సం‘క్రాంతి’ కనిపిస్తోంది. పూర్తి వివరాలు.. 76 వేలమంది టీచర్ల బదిలీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్లైన్లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. బుధవారం 1,400 మంది ఎల్ఎఫ్ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులను వెబ్సైట్ నుంచి జారీచేశారు. పూర్తి వివరాలు.. కోవాగ్జిన్‌కు డిక్లరేషన్ మస్ట్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. కోవాగ్జిన్ ట్రయల్స్ పూర్తి కానందున అంగీకారపత్రం (కన్సెంట్) అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. పూర్తి వివరాలు.. బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు.. అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. పూర్తి వివరాలు.. ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం! మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. పూర్తి వివరాలు.. సినీ పండగ కళ సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. పూర్తి వివరాలు.. ఆఖరి సమరానికి ‘సై’ ఆంక్షలు, అలసిన శరీరాలు, గాయాలు, గెలుపోటములు... అన్నీ అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న భారత్ ఇప్పుడు చివరి సమరానికి సన్నద్ధమైంది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
►బాబును ఏకిపారేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే క్రైస్తవ సమాజం పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభిస్తున్నతీరుపై ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని విమర్శించారు. పూర్తి వివరాలు.. ►పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పూర్తి వివరాలు.. ►‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్ రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెచ్చి 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. ►పై తరగతులకే : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కోవిడ్–19తో మూతపడ్డ బడులు... 2020–21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. పూర్తి వివరాలు.. ►కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ! బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కర్త, కర్మ, క్రియ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. పాత్రధారుల వెనుక ఉండి కథ నడిపించేందుకే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు.. ►తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. పూర్తి వివరాలు.. ►ట్రంప్ నోరు మూయించిన తెలుగమ్మాయి ఆయన డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యానికి అధినేత ఏమైనా అనగలడు.. ట్విటర్లో మరీనూ... ఓడినా మనదే గెలుపన్నాడు.. ఏదేదో ట్వీట్ చేశాడు.. అభిమానులు ఇంకో అడుగు ముందుకేశారు.. క్యాపిటల్ హిల్‌పై ఏకంగా దాడికి దిగారు.. సరిగ్గా ఈ సమయంలోనే ‘పిట్ట’ పులి అయింది.. ట్రంపరితనానికి తాళం వేసింది. పూర్తి వివరాలు.. ►మస్క్ రాంగ్ ‘సిగ్నల్’.. షేరు పరుగు! ఒక శక్తివంతమైన మాట.. కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటుంది. ఇందుకు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్.. వాట్సాప్.. సిగ్నల్ ఉదంతమే నిదర్శనం. మెసేజింగ్ కోసం సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ మస్క్ ఇచ్చిన పిలుపుతో సిగ్నల్ షేరు భారీ స్థాయిలో ఎగిసింది. కానీ, చిత్రమేమిటంటే.. పూర్తి వివరాలు.. ►శింబు అభిమానులకు పొంగల్ స్పెషల్ నటుడు శింబు అభిమానులకు ఈ పొంగల్ చాలా స్పెషల్ కానుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ఈశ్వరన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పూర్తి వివరాలు.. ►నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
►కీలక మలుపు.. నితీశ్‌పై ఎన్డీయే కుట్ర! బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపారు. పూర్తి వివరాలు.. ►టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్ రాజ్యాంగ బద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం మరోసారి బట్టబయలైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండల కేంద్రానికి ఆదివారం దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలు.. ►బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ.. లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. ►నేడు రెండో ఏడాది జగనన్న అమ్మ ఒడి ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి అడుగూ ముందుకేస్తున్నారు. నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సోమవారం నెల్లూరులో ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు.. ►కండల కోడి c/o ‘పాతబస్తీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండివంటలతోపాటు కోడి పందేలు.. ఇందుకోసం అవసరమయ్యే మేలు జాతి కోళ్లను హైదరాబాద్‌లోనూ పెంచుతున్నారు. పాతబస్తీలో పెంచే కోళ్లకు భలే డిమాండ్ ఉంది. సంక్రాంతికి 3–4 నెలల ముందు నుంచే ఇక్కడ పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాతబస్తీ పందెం కోళ్లు, వాటికి ఇచ్చే ఆహారం, పందేల కోసం ఇచ్చే శిక్షణపై సాక్షి ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలు.. ►సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్‌రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు.. ►బయోమెట్రిక్ నిలిపివేత.. పూర్తిగా ఓటీపీ ద్వారానే ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టాల్సిన అవసరం లేదిక. ఆహార భద్రత (రేషన్) కార్డు నంబర్ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. సరుకులను డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు.. ►భార్యను బస్సెక్కించి.. ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న తనిఖీలు ఓ జంటకు గొంతులో పచ్చిఎలక్కాయపడినట్లైంది. ఆదివారం ఓ జంట బైక్‌పై షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. పూర్తి వివరాలు.. ►కిసాన్ మహా ‘పంచాయితీ’ బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలు.. ►చివరి రోజుల్లో.. అవమానభారంతో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. పూర్తి వివరాలు.. ►మీ డాక్యుమెంట్లు భద్రమేనా... ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? పూర్తి వివరాలు.. ►డేట్ ఫిక్స్ అయిందట.. ‘ఆచార్య’ థియేటర్స్‌లోకి వచ్చే తేదీని ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవునంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. డేట్ ఫిక్స్ అయిందట. పూర్తి వివరాలు.. ►భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. పూర్తి వివరాలు.. -
ఫస్ట్ లుక్ 23rd July 2018
-
గుడ్ మార్నింగ్ సాక్షి 4th April 2018
-
గుడ్ మార్నింగ్ సాక్షి 31st March 2018
-
గుడ్ మార్నింగ్ సాక్షి 30th March 2018