1.. Father's Day 2022: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నాన్నా...నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2.. Agnipath Scheme: అనుమానాలు, వివరణలు
అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం...
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3.. Sri Lanka Fuel Crisis: చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్
చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4.. AP Inter Classes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే..
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5.. ‘సీటు’ మార్పుపై సీనియర్ల నజర్!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కొందరు తాము పోటీ చేసే నియోజకవర్గాలను మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం, గతంలో ప్రాతినిధ్యం వహించిన వాటికి బదులు కొత్త స్థానాల్లో పోటీపై ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6.. Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7.. Agneepath Scheme Protest: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి
మధ్యలో ఉన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8.. IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌లో విజేతను తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా... భారత్ సరైన సమయంలో కోలుకొని రెండు వరుస విజయాలతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9.. అక్క మరణానికి ప్రతీకారం.. బావమరిది చేతిలో నటుడు హత్య?
మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10.. ఈ ఏడాదే 25 నగరాల్లో 5జీ
టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్‌కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment