1.జాబిల్లిపై పచ్చదనం!
జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2.భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా..
భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3.ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి అదే కారణమా?
దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4.ఒక కుటుంబం.. ఒకే టికెట్
భవిష్యత్ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ శుక్రవారం ప్రారంభమైంది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5.ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..
రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదముద్ర వేసింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6.Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7
సిటీబస్సు ఇక 24 గంటలు పరుగులు తీయనుంది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. టి20 క్రికెట్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కొత్త చరిత్ర
పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడ టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ను ఔట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో 200వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8.ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా?
‘మీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు?’ సినిమా ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే ప్రశ్న ఇది. ‘అన్నీ కుదిరినప్పుడు...’ అనే సమాధానం కూడా కామన్. అలా అన్నీ కుదిరినప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మూడోసారి రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు
ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్ జోన్‌లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్ జోన్ పరిధిలో 136 మంది, శంషాబాద్ జోన్‌లో 152 మంది కనబడకుండా పోయారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment