టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 22nd May 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Sun, May 22 2022 9:44 AM | Last Updated on Sun, May 22 2022 9:59 AM

Top10 Telugu Latest News Morning Headlines 22nd May 2022 - Sakshi

1. చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా!
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో కదా! ఇంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాడని సందేహం వచ్చే ఉంటుంది కదా. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే రోజు, పౌర్ణమి రెండూ ఒకేరోజు వస్తే ఇలా పెద్ద ఆకారంలో చంద్రుడు కనిపిస్తాడు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Dhanush Sends Legal Notice: మదురై దంపతులకు షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’
మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్‌ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా..
పెళ్లి తంతులో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


4. వెంటాడి చంపేస్తున్నారు.. మొన్న భువనగిరి, నిన్న సరూర్‌నగర్, నేడు బేగంబజార్..
 భువనగిరి జిల్లా లింగ రాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ మరో కులానికి చెందిన భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కూడా భర్తను వదిలేయమని పలుమార్లు కూతురిని బెదిరించినా వినకపోవటంతో అల్లుడిని మట్టుబెట్టాలని మామ పల్లెపాటి వెంకటేష్‌ నిర్ణయించుకున్నాడు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. టీడీపీ విష ప్రచారం దుర్మార్గం
తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ఉన్మాదుల్లా వ్యవహరిస్తూ రాష్ట్రానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ఘాటుగా విమర్శించారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి




6. Venkatesh-F3 Movie: ఈ సినిమా హిట్‌ కాకపోతే ఇకపై మీ ముందు నిలబడను: రాజేంద్రప్రసాద్‌
‘‘నా సినిమా థియేటర్స్‌లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్‌ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్‌.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. IPL 2022-Tilak Varma: ఐపీఎల్‌లో తెలుగుతేజం తిలక్‌ వర్మ కొత్త చరిత్ర
ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు.. తెలుగుతేజం నంబూరి తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. డెబ్యూ సీజన్‌లో ఒక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తిలక్‌ వర్మ చోటు సంపాదించాడు. ఈ సీజన్‌లో తిలక్‌ వర్మ 14 మ్యాచ్‌లాడి 397 పరుగులు సాధించాడు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మునగ సిరులు
తల్లిదండ్రులు చెప్పేమాటలను పెడ చెవిన పెట్టే వారు కొందరైతే, తమ పేరెంట్స్‌ పడుతోన్న కష్టాలు, వారి ఆలోచనలను మనసుపెట్టి అర్థం చేసుకుని గౌరవించేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే దీపిక రవి. ఓ రైతు కడుపున పుట్టిన దీపిక రైతుల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసింది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకుని మరొకరిని..
 తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన దేవేంద్రన్‌(55) పశువుల వ్యాపారి. ఇతని మొదటి భార్య రేణుకాంబాల్‌ రెండు సంవత్సరాల క్రితం మృతి  చెందింది. దీంతో గ్రామానికి చెందిన సురేష్‌ మృతి చెందడంతో అతని భార్య ధనలక్ష్మిని 5 నెలల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సినిమాను మించిన పవన్‌ ‘పవర్‌’ డ్రామా 
 తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని అకస్మాత్తుగా మంగళగిరికి వచ్చి కరెంట్‌ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement