1. ఫొటోలు, వీడియోలు విడుదల.. ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. కేశినేని నాని కార్యాలయం ముందు ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన
టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. Monkeypox Virus: 27 దేశాలకు పాకిన మంకీపాక్స్.. మొత్తం 780 కేసులు
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు..
ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7.ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..?
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ఎన్‌ఆర్‌ఐలను ఊరిస్తున్న రియల్టీ
ఎన్‌ఆర్‌ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్‌ఆర్‌ఐలను భారత మార్కెట్‌లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ప్రతిభ..: జయం మనదే!
అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment