టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Morning News Headlines (14-1-2021) | Sakshi
Sakshi News home page

టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Published Thu, Jan 14 2021 9:07 AM | Last Updated on Thu, Jan 14 2021 9:34 AM

Today Morning News Headlines (14-1-2021) - Sakshi

యడ్డీ ముచ్చటగా మూడోసారి
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు అంటూ గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టైంది. ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో చోటుకల్పించారు. పూర్తి వివరాలు..

మీ పాపాలే శాపాలై మిమ్మల్ని ఓడించాయి
చంద్రబాబు చేసిన పాపాలే శాపాలై ఆయన్ను ఓడించాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘18 నెలలైనా ఇంకా నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావా చంద్రబాబూ..’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు, అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం అర్థరహితమని అన్నారు. పూర్తి వివరాలు.. 

సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు
ఎన్నాళ్లకెన్నాళ్లకో అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు.. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో కొంగొత్త సం‘క్రాంతి’ కనిపిస్తోంది. పూర్తి వివరాలు..

76 వేలమంది టీచర్ల బదిలీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. బుధవారం 1,400 మంది ఎల్‌ఎఫ్‌ఎల్‌ (లో ఫిమేల్‌ లిటరసీ) హెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులను వెబ్‌సైట్‌ నుంచి జారీచేశారు. పూర్తి వివరాలు..

 

కోవాగ్జిన్‌కు డిక్లరేషన్‌ మస్ట్‌.. 
భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తి కానందున అంగీకారపత్రం (కన్సెంట్‌) అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. పూర్తి వివరాలు..

బర్డ్‌ ఫ్లూ: చికెన్‌ అమ్మకాలపై నిషేధం
దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్‌ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు..

అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్‌ హిల్‌ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచారు. పూర్తి వివరాలు..

ఫుల్‌ సిగ్నల్‌.. జోరుగా టెలిగ్రాం!
మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్‌ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్‌ యాప్స్‌ వైపు మళ్లుతున్నారు. పూర్తి వివరాలు..

సినీ పండగ కళ
సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. పూర్తి వివరాలు..

ఆఖరి సమరానికి ‘సై’
ఆంక్షలు, అలసిన శరీరాలు, గాయాలు, గెలుపోటములు... అన్నీ అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న భారత్‌ ఇప్పుడు చివరి సమరానికి సన్నద్ధమైంది. పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement