►బాబును ఏకిపారేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
క్రైస్తవ సమాజం పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభిస్తున్నతీరుపై ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని విమర్శించారు. పూర్తి వివరాలు..
►పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పూర్తి వివరాలు..
►‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్
రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెచ్చి 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..
►పై తరగతులకే : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు
కోవిడ్–19తో మూతపడ్డ బడులు... 2020–21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. పూర్తి వివరాలు..
►కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కర్త, కర్మ, క్రియ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. పాత్రధారుల వెనుక ఉండి కథ నడిపించేందుకే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు..
►తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. పూర్తి వివరాలు..
►ట్రంప్ నోరు మూయించిన తెలుగమ్మాయి
ఆయన డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యానికి అధినేత ఏమైనా అనగలడు.. ట్విటర్‌లో మరీనూ... ఓడినా మనదే గెలుపన్నాడు.. ఏదేదో ట్వీట్ చేశాడు.. అభిమానులు ఇంకో అడుగు ముందుకేశారు.. క్యాపిటల్ హిల్‌పై ఏకంగా దాడికి దిగారు.. సరిగ్గా ఈ సమయంలోనే ‘పిట్ట’ పులి అయింది.. ట్రంపరితనానికి తాళం వేసింది. పూర్తి వివరాలు..
►మస్క్ రాంగ్ ‘సిగ్నల్’.. షేరు పరుగు!
ఒక శక్తివంతమైన మాట.. కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటుంది. ఇందుకు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్.. వాట్సాప్.. సిగ్నల్ ఉదంతమే నిదర్శనం. మెసేజింగ్ కోసం సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ మస్క్ ఇచ్చిన పిలుపుతో సిగ్నల్ షేరు భారీ స్థాయిలో ఎగిసింది. కానీ, చిత్రమేమిటంటే.. పూర్తి వివరాలు..
►శింబు అభిమానులకు పొంగల్ స్పెషల్
నటుడు శింబు అభిమానులకు ఈ పొంగల్ చాలా స్పెషల్ కానుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ఈశ్వరన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పూర్తి వివరాలు..
►నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. పూర్తి వివరాలు..
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
Published Tue, Jan 12 2021 8:39 AM | Last Updated on Tue, Jan 12 2021 8:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment