CM KCR Press Meet In Telangana Bhavan To Release BRS Party First Candidates List, Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

BRS Candidates List 2023: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల.. కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ పోటీ

Published Mon, Aug 21 2023 2:16 PM | Last Updated on Thu, Aug 24 2023 3:56 PM

KCR Press Meet Released BRS Party Candidates List Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. 

వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న గులాబీ బాస్‌.. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అభ్యర్థుల జాబితా.. అదీ వందకు పైనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారాయన. 

ఇక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, గజ్వేల్‌, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్‌ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్‌ పెట్టారు(నర్సాపూర్‌, నాంపల్లి, జనగామ, గోషామహల్‌ స్థానాలకు అభ్యర్థలను ప్రకటించలేదు). ‘‘2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్‌.  మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటించాం’’ అని ఈ సందర్భంగా కేసీఆర్‌ మీడియాకు తెలియజేశారు. పంచమి తిథి కావడంతో.. ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పూర్తి జాబితా..

1.    శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్
2.    శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC)
3.    శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)
4.    శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల
5.    శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)
6.    శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)
7.    శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్
8.    శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST)
9.    శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్
10.    శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే
11.    శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్
12.    శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్
13.    శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC)
14.    శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ
15.    శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి
16.    శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి
17.    శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్
18.    శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్
19.    శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ
20.    శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల
21.    శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల
22.    శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC)
23.    శ్రీ కోరుకంటి చందర్, రామగుండం
24.    శ్రీ పుట్ట మధు, మంథని
25.    శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి
26.    శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్
27.    శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC)
28.    శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ
29.    శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల
30.    శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC)
31.    శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్
32.    శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్
33.    శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట
34.    శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్
35.    శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్
36.    శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC)
37.      -------------------- నర్సాపూర్ (పెండింగ్‌)
38.    శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC)
39.    శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి
40.    శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు
41.    శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక
42.    శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్
43.    శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్
44.    శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి
45.    శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్
46.    శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి
47.    శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్
48.    శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం
49.    శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్
50.    శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం
51.    శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్
52.    శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి
53.    శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC)
54.    శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి
55.    శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC)
56.    శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు
57.    శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్
58.    శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట
59.    శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్‌పేట్
60.    శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్
61.    శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్
62.    శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్
63.    -------------నాంపల్లి (పెండింగ్‌)
64.    శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్
65.    ---------------- గోషామహల్(పెండింగ్‌)
66.    శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్
67.    శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట
68.    శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా
69.    శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా
70.    శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్
71.    జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC)
72.    శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్
73.    శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట
74.    శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్
75.    శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల
76.    శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర
77.    శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్
78.    శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి
79.    శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్
80.    శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC)
81.    శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్
82.    శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC)
83.    శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి
84.    శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్
85.    శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్
86.    శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ)
87.    శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్
88.    శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ
89.    శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్‌నగర్
90.    శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ
91.    శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట
92.    శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ
93.    శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు
94.    శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి
95.    శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC)
96.    శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC)
97.    శ్రీమతి గొంగిడి సునీత, అలైర్
98.    ------------- జనగాం(పెండింగ్‌)
99.    శ్రీ కడియం శ్రీహరి, ఘన్‌పూర్ స్టేషన్ (SC)
100.    శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి
101.    శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్
102.    శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST)
103.    శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట
104.    శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్
105.    శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్
106.    శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు
107.    శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC)
108.    శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి
109.    శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ)
110.    శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ)
111.    శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ)
112.    శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం
113.    శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు
114.    శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC)
115.    శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST)
116.    శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC)
117.    శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం
118.    శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ)
119.    శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement