►కీలక మలుపు.. నితీశ్‌పై ఎన్డీయే కుట్ర!
బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపారు. పూర్తి వివరాలు..
►టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్
రాజ్యాంగ బద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం మరోసారి బట్టబయలైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండల కేంద్రానికి ఆదివారం దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలు..
►బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ..
లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..
►నేడు రెండో ఏడాది జగనన్న అమ్మ ఒడి
‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి అడుగూ ముందుకేస్తున్నారు. నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సోమవారం నెల్లూరులో ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు..
►కండల కోడి c/o ‘పాతబస్తీ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండివంటలతోపాటు కోడి పందేలు.. ఇందుకోసం అవసరమయ్యే మేలు జాతి కోళ్లను హైదరాబాద్‌లోనూ పెంచుతున్నారు. పాతబస్తీలో పెంచే కోళ్లకు భలే డిమాండ్ ఉంది. సంక్రాంతికి 3–4 నెలల ముందు నుంచే ఇక్కడ పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాతబస్తీ పందెం కోళ్లు, వాటికి ఇచ్చే ఆహారం, పందేల కోసం ఇచ్చే శిక్షణపై సాక్షి ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలు..
►సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్
సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్‌రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు..
►బయోమెట్రిక్ నిలిపివేత.. పూర్తిగా ఓటీపీ ద్వారానే
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టాల్సిన అవసరం లేదిక. ఆహార భద్రత (రేషన్) కార్డు నంబర్ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. సరుకులను డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..
►భార్యను బస్సెక్కించి..
ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న తనిఖీలు ఓ జంటకు గొంతులో పచ్చిఎలక్కాయపడినట్లైంది. ఆదివారం ఓ జంట బైక్‌పై షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. పూర్తి వివరాలు..
►కిసాన్ మహా ‘పంచాయితీ’
బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలు..
►చివరి రోజుల్లో.. అవమానభారంతో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. పూర్తి వివరాలు..
►మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? పూర్తి వివరాలు..
►డేట్ ఫిక్స్ అయిందట..
‘ఆచార్య’ థియేటర్స్‌లోకి వచ్చే తేదీని ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవునంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. డేట్ ఫిక్స్ అయిందట. పూర్తి వివరాలు..
►భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు
ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment