1. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు, ధర అక్షరాల రూ. 1,117 కోట్లు
ఓ బ్రిడ్జిని కట్టేందుకు రూ. వెయ్యి కోట్లు కావాలి. పేద్ద లగ్జరీ హోటల్ కట్టాలంటే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి. చిన్న పథకం అమలు చేయాలన్నారూ. వెయ్యి కోట్లయితే కావాలి.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. Disha Encounter Case: నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. Disha App: ఒక్క రోజులో 3.20 లక్షల ‘దిశ’ డౌన్‌లోడ్స్
ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం దిశ యాప్ డౌన్‌లోడ్స్ మెగా డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి మొత్తం 3.20 లక్షల డౌన్‌లోడ్స్‌తో పాటు 1.70 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. Telangana New Highways: తెలంగాణలో కొత్తగా మరో 10 హైవేలు
జాతీయ రహదారుల విషయంలో గత కొన్నేళ్లుగా దూసుకుపోతున్న తెలంగాణ, కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో 10 కొత్త రహదారుల (ప్యాకేజీల ప్రకారం) పనులు ప్రారంభించనుంది. 715 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్ల నిర్మాణానికి రూ.28,615 కోట్లు ఖర్చు కానుందని అంచనా.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు
గంజాయి అమ్మేవారిపై దాడులా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడానికి సర్కారు ఓ వైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ దానిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Devi Sri Prasad On F3 Movie: ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నా
‘‘ఎఫ్ 3’ లాంటి పూర్తి కామెడీ సినిమాకి కథ రాసుకోవడం కష్టం. అనిల్ రావిపూడిగారు అద్భుతంగా కథ రాసుకుని ‘ఎఫ్ 3’ తీశారు. ‘ఎఫ్ 2’లో ఉన్న వినోదం కంటే పది రెట్లు ఎక్కువగా ‘ఎఫ్ 3’లో ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..'
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ లీగ్ దశను రెండో స్థానంతో ముగించింది. శుక్రవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8.‘సెబీ’ సైబర్ సెక్యూరిటీ నిబంధనలు కఠినతరం
స్టాక్ ఎక్సే్చంజీలు, ఇతరత్రా మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు పాటించాల్సిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినతరం చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మొదలైన మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు (ఎంఐఐ) ఇకపై ప్రతీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 సార్లు సమగ్రమైన సైబర్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..?
జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కోని యువత ఇంచుమించు ఇటీవల కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ఐరన్, విటమిన్ – సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. హైదరాబాద్‌లో మరో పరువు హత్య?.. బేగంబజార్‌లో యువకుడిని ఘోరంగా చంపిన దుండగులు
బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment