1.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం
చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం!
ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..
అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5.. Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే..
హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్‌లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా జరుగుతుంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. CWG 2022 IND vs AUS Final: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. మునుగోడులో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే పోటీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్‌రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో?
ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్‌లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్‌లు.. కసాయి తల్లిపై విచారణ
నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment