టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Morning News Headlines (15-1-2021) | Sakshi
Sakshi News home page

టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Published Fri, Jan 15 2021 8:59 AM | Last Updated on Fri, Jan 15 2021 9:16 AM

Today Morning News Headlines (15-1-2021) - Sakshi

రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు..

నేడు నరసరావుపేటకు సీఎం వైఎస్‌ జగన్‌ 
నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు..

పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర 
ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బట్టబయలవుతోంది. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది. పూర్తి వివరాలు..

మరోసారి సత్తా చాటిన టీఎస్‌ఆర్టీసీ
ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్‌ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్‌–2020 సెప్టెంబర్‌ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. పూర్తి వివరాలు..

జో బైడెన్ కీలక ప్రతిపాదన, 100 రోజుల్లోనే.. 
కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రణాళిక రూపొందించారు. 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు..

మొబైల్‌ యూజర్ల కోసం అమెజాన్‌ ప్రైమ్‌
దేశీయంగా మొబైల్‌ యూజర్ల కోసం అమెజాన్‌ ప్రత్యేకంగా ప్రైమ్‌ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్‌ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. పూర్తి వివరాలు..

అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పూర్తి వివరాలు..

లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?
టీమిండియాతో ఇక్కడ గబ్బా స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌(1)ని సిరాజ్‌ ఔట్‌ చేయగా, పకోవిస్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌(5)ను శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు. పూర్తి వివరాలు..

ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. 
బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. పూర్తి వివరాలు..

సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం
ఆదివాసీల్లో మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శనమిస్తాయి. పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement