1. సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం
సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ
సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. సౌతాఫ్రికా హెచ్‌కోచ్ పదవికి బౌచర్ గుడ్‌బై
ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) సైతం ధృవీకరించింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు
గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్‌స్టార్
సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ!
చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో!
చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment