మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కుమారుడు సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడ్డ మాజీ ఎమ్మెల్యే తనయుడు పార్క్ చేసిన ఖరీదైన కార్లను చోరీ చేసి వాటిలో అమ్మాయిలతో షికార్లు కొట్టేవాడు. ఇతగాడు బీఎండబ్ల్యూతో పాటు రెండు వెర్నా కార్లను దొంగిలించాడు. ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న సుమన్ విలాసాలకు అవసరమైన డబ్బు లేకపోవడంతో కార్ల చోరీలు చేయటానికి అలవాటు పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుమన్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.