సెంకడ్‌హ్యాండ్‌లో వెహికిల్ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్‌ఎస్) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..
బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్‌ఎస్) సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.
సిటిజన్ లాగిన్ పేరుతో డిస్‌ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్‌చేసి ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.
మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి.
తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. వెహికిల్ టైప్ ఎలాంటిదో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.
ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్‌ఓసీ వస్తుంది.
ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..?
Comments
Please login to add a commentAdd a comment