
నాగోలు: స్థానిక లలితానగర్ కారు చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లలితానగర్ కాలనీ రోడ్డు నంబర్ 9లో ఉంటున్న కుండారపు రాజాచారి కుమారుడు స్నేహిత్‌రావ్ భువనగిరిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన ఫార్చునర్ కారు (ఏపీ29 సీఏ 1212)ని ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. బుధవారం సాయంత్రం కారు కనిపించకపోవడంతో ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలనీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో స్విఫ్ట్‌కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారును తీసుకెళ్లినట్లు వెల్లడైంది. అయితే కారు డోర్ తెరవడం, స్టార్ట్ చేసిన తీరును బట్టి నిందితులకు కారుపై పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు చోరీ చేసిన అనంతరం వీరు సాయినగర్ మీదుగా అల్కాపురి సిగ్నల్ వరకు వచ్చినట్లు సీసీ పుటేజీల్లో రికార్డైంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment