Saurabh Bhardwaj
-
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
Aam Aadmi Party: అతి త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఆప్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీలో భయం మొదలైందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేసేందుకే తమ నేత కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చిన విషయం తెలియగానే ఈడీ గురువారం కేజ్రీవాల్‌కు ఏడో విడత నోటీసులిచ్చిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా కేజ్రీవాల్‌కు నోటీసులు అందజేస్తుందని, రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు. -
ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్‌లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి. సీఎం సమీక్ష ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్‌లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు. జరిమానా పెంపు ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. -
విపక్షాల ఐక్యత చెడగొట్టడమే అతని పని
న్యూఢిల్లీ: జూన్ 23న బీహార్ వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం తరవాత నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రెండు పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మార్కెట్ అంతా విద్వేషాలుంటే అందులో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచారని ఎద్దేవా చేస్తే.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విపక్షాల ఐక్యతను దెబ్బ తీయడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యమని అన్నారు. ఢిల్లీ ఆర్దనెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడా కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఆ పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఈ సందర్బంగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడుతూ బీజేపీ ద్వేషాన్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. మరి మొహబ్బత్ కి దుకాన్ పేరిట ప్రేమ దుకాణాన్ని తెరచిన ఆయన ఎవరు ఏమి కోరినా ప్రేమతో అంగీకరించాలి కదా? ఇప్పుడు అయన అధికారంలో లేరు కాబట్టి ఆయనలో ఇగో లేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వస్తే ఏమిటి పరిస్థితి? ఆయన సంయమనంతో వ్యవహరించి ప్రేమతత్వాన్ని చాటుకోవాలని అన్నారు. #WATCH | "I always see that Rahul Gandhi talks about love and says that BJP spreads hate. So if Rahul Gandhi is running 'Mohabbat ki Dukan' then whosoever will come to him can buy that love. When he said that his party spread love then he has to show this also. Right now he… pic.twitter.com/XTDmQtTsOP — ANI (@ANI) June 25, 2023 ఇక కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాత్రం ఆప్ నేతలపైనా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మా మద్దతు కోరతారు.. మరోపక్క మాపైనే విచక్షణారహితంగా విమర్శలు చేస్తారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంతం నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి అలాంటప్పుడు కాళ్లబేరానికి వెళ్ళకుండా కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఈ రెండు నాలుకల ధోరణి వలన ఎవరికి ప్రయోజనం? నాకైతే ఒక్కటే ప్రయోజనం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ పక్కలో చేరారు. విపక్షాలు ఐక్యత చెడగొట్టడమే ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి -
పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒకతాటిపైకి రావాలని వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్‌గా బిగ్ ఆఫర్ ఇచ్చింది. వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఓకే అంటే తాము రెడీ ఉన్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం నియంతృత్వంలోకి వెళుతుందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్ధలను ఉసిగొల్పి విపక్ష నేతలను జైళ్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదని ఆరోపించారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆప్ ఐడియాలు, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలేంటి..? -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
సిసోడియాకు ప్రాణ హాని
న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు తిహార్ జైల్లో ప్రాణ హాని ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన్ను ఒకటో నంబర్ జైల్లో కరడుగట్టిన నేరగాళ్లతో కలిపి ఉంచారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘‘ధ్యానం చేసుకోవడానికి వీలుగా విపాసన సెల్లో ఉంచాలన్న సిసోడియా విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు కూ డా సమ్మతించినా జైలు అధికారులు మాత్రం తోసిపుచ్చారు’’ అని విమర్శించారు. దీనిపై కేంద్రం బదులిచ్చి తీరాలన్నారు. ఆప్ ఆరోపణలను జైలు వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘సిసోడియాతో పాటున్న ఖైదీల్లో అంతా సత్ప్రవర్తన గలవారే. గ్యాంగ్‌స్టర్లెవరూ లేరు’’ అని చెప్పాయి. -
సిసోడియాను సీబీఐ చిత్రహింసలు పెడుతోంది: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. తప్పుడు అభియోగాలను ఒప్పుకుని, సంతకాలు చేయాలంటూ ఆయన్ను బలవంతం చేస్తున్నారని పేర్కొంది. ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ వద్ద ఆధారాలు లేవన్నారు. సిసోడియా నివాసంపై జరిపిన దాడుల్లోనూ ఏమీ దొరకలేదని చెప్పారు. సిసోడియా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో కేజ్రీవాల్ ఇద్దరి చోటు కల్పించారు. సౌరవ్ భరద్వాజ్, అతిషికి సీఎం కేజ్రీవాల్ చోటు కల్పించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశారు. కాగా, 48 గంటల్లో వారితో ప్రమాణ స్వీకారం చేపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సీబీఐ వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. దీంతో వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. కేబినెట్లో సౌరవ్, అతిషికి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా.. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యశాఖతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను కలిగి ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే, సిసోడియాకు చెందిన ఫైనాన్స్, విద్యతో సహా కొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు. Delhi Chief Minister Arvind Kejriwal sent names of AAP MLAs Saurabh Bhardwaj and Atishi to Delhi LG to be elevated as ministers in the cabinet: Sources pic.twitter.com/IqemD3j19W — ANI (@ANI) March 1, 2023 -
మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. సీబీఐ రేపు మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. ఈ సమన్లు త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వచ్చాయని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీ ఇవ్వనుందని, దీంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. ఈ క్రమంలోనే సిసోడియాకు సమన్లు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీబీఐ తాజాగా సమన్లు జారీ చేయడంపై సిసోడియా ట్విటర్ ద్వారా స్పందించారు. గతంలో తన ఇళ్లు, బ్యాంక్, స్వస్థలంలో సీబీఐ 14 గంటలు సోదాలు చేసినప్పటికీ.. ఏం దొరకలేదని తెలిపారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయినప్పటికీ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला. अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा. सत्यमेव जयते. — Manish Sisodia (@msisodia) October 16, 2022 ఇదిలా ఉండగా మనీష్ సిసోడియాకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. డిప్యూటీ సీఎం సిసోడియాను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌తో పోల్చారు. ఆనాడు జైలు, ఉరికంబం సింగ్ ధృడ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయని గుర్తు చేశారు. ఇది స్వేచ్ఛ కోసం జరుగుతున్న రెండో పోరాటమని అభివర్ణించారు. మనీష్, సత్యేంధ్ర జైన్ నేటి భగత్ సింగ్‌లు అని ట్వీట్ చేశారు. जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है 75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी करोड़ों ग़रीबों की दुआएँ आपके साथ है https://t.co/slc3lb1Mqp — Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2022 -
అసెంబ్లీలో ‘ఈవీఎం’ రిగ్గింగ్!
ఢిల్లీలో రహస్య కోడ్‌తో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ డెమో ► ఓటు రసీదు ఈవీఎంలతో ఎన్నికలు జరపాలంటూ తీర్మానం ► అది నకిలీ ఈవీఎం: ఈసీ సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అసెంబ్లీలో ప్రయోగపూర్వక ప్రదర్శన ఇచ్చింది. దీనికోసమే మంగళవారం రోజంతా నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్పీకర్ అనుమతితో ఈవీఎంను పోలిన యంత్రాన్ని రిగ్గింగ్ చేశారు. ఈవీఎంలో సీక్రెట్ కోడ్‌ను ప్రవేశపెట్టిన సౌరభ్ 10 ఓట్లు ఆప్‌కు పడేలా నొక్కారు. తర్వాత డిస్ప్లే ప్యానల్‌పై ఆ ఓట్లన్నీ బీజేపీకి పడినట్లు కనిపించింది. ‘సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ప్రవేశపెట్టి ఓట్లన్నీ ఒకే పార్టీ అభ్యర్థికి పడేలా చేయొచ్చు. ఈ అక్రమం ఏ తనిఖీలోనూ బయటపడదు’ అని కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన సౌరభ్ చెప్పారు. ఇటీవల పలు ఎన్నికల్లో ఓడిపోయిన ఆప్.. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే తాము ఓడిపోయామని చెబుతుండటం తెలిసిందే. 90 సెకన్లలో..: ‘90 సెకన్లలో మదర్ బోర్డును మార్చవచ్చు. ఈవీఎంపై ప్రతిపార్టీకి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది.. ఓటింగ్ సమయంలో పార్టీ కార్యకర్త ఈవీఎంలోకి సీక్రెట్ కోడ్‌ను ప్రవేశపెడతారు. తర్వాత పడే ఓట్లన్నీ ఆ పార్టీకే ఓట్లు పడతాయి’ అని డెమో సందర్భంగా జరిగిన చర్చలో సౌరభ్ తెలిపారు. గుజరాత్లో ఎన్నికలు జరిగే చోట్ల ఈవీఎంలను తనకు 3 గంటలపాటు అప్పగిస్తే బీజేపీ ఒక్క బూత్లోనూ గెలవలేదన్నారు. ఒక సాధారణ ఇంజినీరుగా ఈ అంశంపై విస్తృతంగా పనిచేశానని, ఈ యంత్రాలతో ఎలా మోసం చేయొచ్చో తనకు తెలుసని అన్నారు. హ్యాక్‌కు వీలుకాని యంత్రం ప్రపంచంలోనే లేదని, ఈవీఎంను హ్యాక్ చేయడం అసాధ్యమని నిరూపించాలని శాస్త్రవేత్తలకు సవాల్ విసిరారు. డెమోకు జెడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రా, ఆసీమ్ ఖాన్లూ హాజరయ్యారు. ఓటరు వేసిన ఓటు అతను ఎంచుకున్న అభ్యర్థికే పడినట్లు రసీదు పొందే సదుపాయం (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరపాలని రాష్ట్రపతిని కోరుతూ సభ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ... ‘ట్యాంపరింగ్ ప్రజాస్వామ్యానికి, దేశానికి ప్రమాదం. ఈసీ తన యంత్రాలను మాకిస్తే కేవలం మదర్‌బోర్డు మార్చడం ద్వారా వాటిని ఎలా హ్యాక్ చేయొచ్చో 90 సెకన్లలో చూపిస్తాం’ అని అన్నారు. వాటిని ముందుగానే ప్రోగ్రాం చేయొచ్చు.. ఈ డెమోకు వాడిన యంత్రం ఎన్నికల్లో తాము ఉపయోగించే ఈవీఎంలా లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ‘ఈసీ వాడే ఈవీఎంకు భిన్నమైన నకిలీ యంత్రాలను ఎలా పనిచేయాలో ముందుగానే ప్రోగ్రాం చేయొచ్చు. అంతమాత్రాన ఈసీ ఈవీఎంలు కూడా అలాగే పనిచేస్తాయని భావించకూడదు. అవి సాంకేతికంగా భద్రమైనవి..’ అని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, డెమోకు వాడిన యంత్రాన్ని ఐఐటీల్లో చదివిన కొందరు తయారు చేశారని ఆప్ వర్గాలు తెలిపాయి. -
మెట్రో స్టేషన్లను ఎందుకు మూశారు?
న్యూఢిల్లీ: నగరంలోని నాలుగు మెట్రో స్టేషన్లను ఎందుకు మూసివేశారని రవాణాశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరుతూ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ)కి లేఖ రాశారు. మెట్రో స్టేషన్లను మూసివేసి ప్రజలను ఎందుకు ఇబ్బందులపాలు చేశారో తెలపాలని లేఖలో నిలదీశారు. విధులను నిర్లక్ష్యం చేసిన నలుగురు ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్ సోమవారం రైల్‌భవన్ ఎదుట ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. మద్దతుదారులు పెద్దఎత్తున తరలిరావాలంటూ ఆయన పిలుపునివ్వడంతో జనం తాకిడి కూడా పెరిగింది. దీంతో సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్‌భవన్, పటేల్‌చౌక్, రేస్‌కోర్సు స్టేషన్లను మూసివేశారు. దీంతో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనికి కొందరు ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ సర్కాన్‌ను బాధ్యులను చేయడంతో మంత్రి స్పందించారు. ‘అవును మెట్రో స్టేషన్ల బంద్ విషయమై డీఎంఆర్సీకి లేఖ రాశం. మూసివేతకు కారణాలేమిటో మేము తెలుసుకోవాలనుకున్నామ’ని సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. -
కేజ్రివాల్ దీక్ష శిబిరం వద్ద ఘర్షణ, ఉద్రిక్తం!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దీక్షా శిబిరం వద్ద పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాదక ద్రవ్యాల, వ్యభిచార రాకెట్ పై దాడులు జరుపడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు మంత్రులతోపాటు కేజ్రీవాల్ సోమవారం ఉదయం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను ఉద్రేక పరిచేవిధంగా కేజ్రివాల్ ప్రసంగిస్తుండగా పోలీసులు ఆడియో సిస్టమ్ కనెక్షన్ తొలగించడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలతోపాటు సంజయ్ సింగ్, ఇతర జర్నలిస్టులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిని విచక్షణారహితంగా కొట్టారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. గాయపడిన త్రిపాఠికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్టు ఆమ్ నేతలు తెలిపారు. దీక్షా వేదిక వద్ద 3 వేల పోలీసులను నియమించారు. దీక్షా శిబిరం నుంచే కేజ్రివాల్ ఫైళ్లను క్లియర్ చేశారు. దీక్ష వల్ల ప్రభుత్వం పనిచేయడం ఆగిపోదని ఆయన వెల్లడించారు.