కేజ్రీవాల్‌ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన | Delhi Cabinet sends notice to bureaucrat probing Kejriwal residence renovation | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన

Published Tue, May 16 2023 6:00 AM | Last Updated on Tue, May 16 2023 6:00 AM

Delhi Cabinet sends notice to bureaucrat probing Kejriwal residence renovation - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్‌ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్‌ అధికారి, సీనియర్‌ ఐఏఎస్‌ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్‌ విభాగంలోని ఇతర అసిస్టెంట్‌ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్‌ సెక్రటరీకి  సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్‌ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement