vigilance officer
-
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
ఆర్టీసీలో నిఘా అధికారి వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఆయనో కీలక అధికారి. డిపోలపై నిఘా వేసి అక్రమాలు వెలికి తీయాల్సిన ముఖ్యమైన బాధ్యత ఆయనది. ఆయన పరిధిలో దాదాపు 30 డిపోలున్నాయి. గుర్తొచ్చినప్పుడు మినహా కార్యాలయం మొహమూ చూడరు. సిటీలో సొంత వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కానీ డిపోల నుంచి యథేచ్ఛగా మామూళ్లు దండుకుంటారు. బస్ భవన్లో సీనియర్ అధికారులతో ‘టచ్’లో ఉంటూ బదిలీలు, ఇతర పైరవీల్లో మునిగి తేలుతుంటారు. ఇది పదవీ విరమణ పొందిన ఓ అధికారి వ్యవహారం. గతంలో పదవీవిరమణ పొం దిన అధికారులను ఆర్టీసీలో ఉద్యోగాల్లోకి తీసుకున్న సమయంలో ఈయన కూడా దూరారు. అప్పట్లో ఇలాగే రిటైర్మెంట్ తర్వాత కీలకపోస్టు నిర్వహించిన ముఖ్యఅధికారి ఈయనపై ఈగ వాలనీయకుం డా చూసుకున్నారు. ఆ అధికారిని ప్రభుత్వం తప్పించటంతో ఇప్పుడు బస్‌భవన్‌లో కీలకంగా ఉన్న అధికారుల పంచన చేరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. ఇప్పుడు దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. బస్‌భవన్‌లోని ఉన్నతాధికారి అండ.. కొంతకాలంగా ఆర్టీసీలో విజిలెన్సు విభాగం పూర్తిగా నిర్వీర్యమైంది. గతంలో ఈ విభాగాన్ని పర్యవేక్షించిన ఓ ఉన్నతాధికారి తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదులు ఎక్కువ కావటంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనకు అనుచరుడిగా ముద్రపడ్డ మరో అధికారిపై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి వెళ్లకుం డా, ఆయా డిపోల్లో చిన్నచిన్న తప్పిదాలకు పాల్పడ్డ వారిని గుర్తించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు చెబుతున్నాయి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నాడని, సహకరించని వారిని బదిలీ చేయించి వేధిస్తున్నాడని ఇటీవల కొందరు సిబ్బంది ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బస్‌భవన్‌లో కీలక పోస్టులో ఉన్న ఓ ఉన్నతాధికారి ఆయనకు అండగా నిలుస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పట్టించుకునే వారు లేరన్న ధీమా.. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన సోమారపు సత్యనారాయణ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోవటంతో చైర్మన్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో పట్టించుకునేవారు లేరన్న ధీమాతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడు. గతంలోనే పదవీ విరమణ పొందినప్పటికీ, భారీ జీతంతో ఆర్టీసీలో ఆయనకు మళ్లీ అవకాశం కల్పించారు. దీంతో తనపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరన్న ధీమాతో ఆయన విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఆయనను అడ్డం పెట్టుకుని ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి డిపోల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, రకరకాల కారణాలతో సస్పెన్షన్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్ల చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో విజిలెన్స్ అధికారి
రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు నల్లగొండ, హన్మకొండలోని ఇళ్లల్లో సోదాలు నల్లగొండ టూటౌన్/వరంగల్: నల్లగొండ రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి (ఏఎస్పీ)భాస్కర్‌రావు గురువారం రూ.లక్ష తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. నల్లగొండలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో, వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆయన సొంత ఇంట్లో ఏక కాలంగా సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ డి.సునీత కథనం ప్రకారం... నల్ల గొండ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఏఎస్పీ భాస్కర్‌రావు పట్టణ రైస్ మిల్లర్స్ నుంచి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని, కొంత తగ్గించాలని వేడుకు న్నా ఒప్పుకోలేదు. దీంతో నల్లగొండ పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నల్లగొండలోని తన అద్దె ఇంట్లో రాములు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ హైదరాబాద్, నల్లగొండ అధికారుల బృందం పట్టుకుంది. తన స్వస్థలమైన హన్మకొండ లోని ఇల్లు మామ వీరస్వామి పేరుతో ఉన్న దని, వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మం డలంలో వ్యవసాయ భూమి, వరంగల్‌లో లేబర్ కాలనీలో ఒక భవనం ఉన్నట్లు గుర్తిం చారు. సుమారు లక్ష రూపాయల నగదు, కారు, టూ వీలర్ వెహికిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల నియామకం
- రవాణా, ఆర్ అండ్ బీ శాఖలకు ఉత్తర్వులు సాక్షి, అమరావతి రవాణా, రహదారులు, భవనాల శాఖల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసరుగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి బి.నాగరాజ, ఆర్‌అండ్‌బీకి ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి కె.రామమోహనరావులను నియమించారు. వీరిద్దరూ ఆయా శాఖల విజిలెన్స్ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏసీబీ కేసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ కేసుల్ని పర్యవేక్షిస్తారు. -
విజిలెన్స్ అధికారినంటూ టోకరా
* సినీ ఫక్కీలో దోపిడీ * 25 కాసుల బంగారు ఆభరణాలు చోరీ తూర్పుచోడవరం (నల్లజర్ల) : విజిలెన్స్ అధికారినంటూ ఓ ఆగంతకుడు సినీ ఫక్కీలో రేషన్ డీలర్ నుంచి 25 కాసుల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు దోచుకుపోయాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నల్లజర్ల మండలం తూర్పుచోడవరంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తూర్పుచోడవరంలో పసల దశావతారమ్మకు చెందిన 18వ నంబరు రేషన్ దుకాణాన్ని ఆమె కుమార్తె ఆలపాటి స్వరాజ్యలక్ష్మి నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీస్ గుర్తు ఉన్న బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు తాను విజిలెన్స్ శాఖ అధికారినంటూ డిపోను తనిఖీ చేయాలని నమ్మబలికాడు. రిజిస్టర్లు పరిశీలించి 2 బస్తాలు బియ్యం ఎక్కువగా ఉన్నాయని, రూ.లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పడుతుందని భయపెట్టాడు. తనతో పాటు మూడు బృందాలు అనంతపల్లి, చోడవరం, గుండేపల్లిలో తనిఖీలు చేస్తున్నాయని, ముగ్గురిని అ రెస్ట్ చేశారని చెప్పాడు. దీంతో కంగారు పడిన దశావతారమ్మ, స్వరాజలక్ష్మి తమ వద్ద ఉన్న రూ.3 వేలను అతడికి ఇచ్చారు. నగదు తీసుకుని తిరిగి వెళుతున్న ఆగంతుడి కన్ను మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలపై పడింది. మభ్యపెట్టి.. కాజేసి.. తాను వెళ్లిన తర్వాతపై అధికారులు వస్తారని, వంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ఫైన్ ఎక్కువ వేస్తారని మహిళలను ఆగంతకుడు భయపెట్టాడు. ఆభరణాలను తీసి దాచుకోమని సలహా కూడా ఇచ్చాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన తల్లీకూతుళ్లు వారి వంటిపై ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలను తీసి బీరువాలో దాచేందుకు వెళుతుండగా.. అధికారుల వద్ద చెకింగ్ మెషిన్ ఉంటుందని, ఇంట్లో దాస్తే సులభంగా కనిపెడతారని కంగారు పెట్టాడు. పెరట్లోని నీళ్ల కుండీ పక్కన దాచుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో కంగారు పడిన తల్లీకూతుళ్లు ఆభరణాలను నీళ్ల కుండీ పక్కన పెట్టి ఆగంతకుడు కాఫీ అడగటంతో వంట గదిలోకి వెళ్లారు. ఈలోపు స్వరాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ ఇంటికి వచ్చారు. అతనికి విషయం చెప్పి కాఫీ బదులు కూల్‌డ్రింక్స్ తీసుకురమ్మని పంపాడు. సత్యనారాయణ తిరిగి వచ్చే లోపు పెరట్లో దాచిన బంగారు ఆభరణాలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. అధికారులు అనంతపల్లిలో ఉన్నారు తీసుకువద్దాం అంటూ కూల్‌డ్రింక్స్‌తో వచ్చిన సత్యనారాయణను తన బైక్‌పై తీసుకువెళ్లాడు. అధికారులు రాలేదని నమ్మబలికి ఊరి చివర సత్యనారాయణను వదలి ఉడాయిం చాడు. సత్యనారాయణ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గాని మోసం విషయం తెలియలేదు. బాధితులు అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాయక్ బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
పప్పుల వ్యాపారంపై ‘విజిలెన్స్’
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పప్పుల మిల్లులు, దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళ, బుధవారాల్లో దాడులు నిర్వహించారు. ఏడు దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేయగా, 1,600 క్వింటాళ్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు. కోవూరులో ఓ మిల్లును సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎస్ఎం రమేష్‌బాబు తన బృందంతో కలిసి వింజమూరు, కలిగిరి, వెంకటగిరి, పోతిరెడ్డిపాలెం, నెల్లూరులో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. 15 పప్పుల మిల్లులు, దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సులు, స్టాక్‌రిజిస్టర్లు, సరుకు నిల్వలను పరిశీలించారు. నిల్వల్లో భారీస్థాయిలో తేడాలు ఉండడంతో ఏడు దుకాణాలపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 80 లక్షలు విలువైన 1,600 క్వింటాళ్ల వివిధ రకాల పప్పుదినుసులను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు పప్పులవీధిలోని రమేష్ట్రేడర్స్, షరాబు పెద్ద ఓబయ్య సన్స్‌కు చెందిన దుకాణాలు, గోదాములను బుధవారం రాత్రి తనిఖీ చేసుకున్నారు. వీటిలోనే రూ.20 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకోని, అనధికార గోదాములను సీజ్ చేశారు. విజిలెన్స్ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తారు. నిత్యం వ్యాపారులతో కళకళలాడే పప్పులవీధి బోసిపోయింది. దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు సంగమేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఏవో ధనుంజయ్, డీసీటీవో రవికుమార్, మోహన్, డీఈ సుధాకర్, సివిల్‌సప్లయిస్ అధికారులు ఎ. వెంకటేశ్వర్లు, లక్ష్మణబాబు తదితరులు పాల్గొన్నారు. పప్పుల మిల్లు సీజ్ కోవూరు: పోతిరెడ్డిపాళెంలోని శ్రీ వెంకటశివసాయి పప్పులమిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 318 క్వింటాళ్ల శనగలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడంతో మిల్లును సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సరుకు విలువ రూ.7.70 లక్షలు ఉంటుందన్నారు. దాడుల్లో డీఈ సుధాకర్, ఏజీ రమణ, ఎస్సై రామయ్య, ఆర్ఐ అనురాధ, వీఆర్వో ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
కారంపూడి, న్యూస్‌లైన్ :కారంపూడిలోని రేషన్ దుకాణాలపై గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కారంపూడిలో నాలుగు షాపులను తనిఖీ చేసేందుకు వెళ్లారు. వీటిలో రెండు షాపులకు తాళాలు వేసి ఉన్నాయి. షాపు నం 32లో రెండున్నర క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించామని, మరో షాపులో వ్యత్యాసం ఏమీ లేదని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎన్.కిశోర్‌కుమార్ తెలిపారు. అనంతరం వేపకంపల్లె గ్రామంలోని రేషన్ షాపు నం. 26లో తనిఖీ చేస్తున్నారు. అక్కడ స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని, తుది నివేదికకు కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వరరావు, వీఆర్వో పసుపులేటి సైదులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు రేషన్ షాపుల సీజ్.. మంచికల్లు (రెంటచింతల),న్యూస్‌ైలైన్: మంచికల్లు గ్రామంలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ షాపులను సీజ్‌చేసినట్లు విజిలెన్స్ సీఐ కె.వంశీధర్ బుధవారం తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆయన ఆదేశాలతో గ్రామంలోని 16, 17 నంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 16వ రేషన్ షాపులో 104 కేజీల బియ్యం, 64 కేజీల పంచదార, షాపున ంబర్ 17లో 12 క్వింటాళ్ల బియ్యం, 167 కేజీల పంచదార నిల్వ ఉండాల్సిన దాని కన్నా తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఆ షాపులపై 6-ఎ కేసులు నమోదుచేసి సీజ్ చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. సరుకును రెవెన్యూ ఇన్స్పెక్టర్ కటికల బాలయ్యకు స్వాధీనపరిచామన్నారు. -
తవ్వుతున్న కొద్దీ...బెంబేలెత్తిస్తున్న బ్యాంకు స్వాహాపర్వం
కూసుమంచి, న్యూస్‌లైన్ : నాయకన్‌గూడెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సిబ్బంది స్వాహా పర్వం తవ్వుతున్న కొద్ది బయట పడుతోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ. 43.13 లక్షల రూపాయలు గల్లంతైనట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. బ్యాంకులో ఈనెల 22న రూ.6.50 లక్షలు తేడా రావటంతో మేనేజర్ గుర్తించగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం రూ. 16 లక్షల వరకు స్వాహా జరిగినట్లుగా గుర్తించగా... అది శుక్రవారానికి రూ. 43.13 లక్షలకు చేరింది. విచారణ ఇంకా పూర్తికానందున ఇది పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులో వెలుగు చూస్తున్న ఘటనతో ఖాతాదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ ఖాతాల్లోని నగదు నిలువలను సరిచూసుకుంటున్నారు. ఖాతాదారుల డిపాజిట్ల నుంచే స్వాహా... బ్యాంకులో ఈనెల 22న తక్కువగా ఉన్నట్లు తేలిన బ్యాంకు బాలెన్స్ నగదు రూ. 6.50 లక్షలుతో కలుపుకుని ఇప్పటి వరకు రూ. 43.13 లక్షల వరకు స్వాహా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. పలువురు రులు బ్యాంకులో డబ్బును దాచుకునేందుకు రాగా బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్ వారికి తగు రశీదులు ఇచ్చినా అట్టి సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. బ్యాంకు బ్యాలెన్స్‌షీట్ తేడా రాకుండా చూసుకుంటూ వీరు స్వాహాకు పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈతంతంగం బయట పడటంతో అక్రమం తేలింది. క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్ తాము తప్పు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. కేసులు నమోదు.... నాయకన్‌గూడెం బ్యాంకులో నగదు స్వాహాకు బ్యాంకులో పనిచే స్తున్న క్యాషియర్ సుదీర్సింగ్, అసిస్టెంట్ క్యాషియర్ రవికుమార్‌లు బాధ్యులుగా పేర్కోంటూ శుక్రవారం బ్యాంకు మేనేజర్ శిరీష రిజనల్ మేనేజర్ (బిజినెస్) వెంకటేశ్వరావుతో కలిసి సీఐ నరేష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారిపై ఐపీసీ 409,420,468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, అందరికి తాము న్యాయం చేస్తామని మేనేజర్అన్నారు. ఖాతాదారులు సంయమనం పాటించాలని విజప్తి చేశారు. -
టీటీడీ ఉద్యోగి దర్శన దందా
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం పేరుతో భక్తుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన టీటీడీ ఉ ద్యోగి, హోంగార్డు, కాంట్రాక్టు ఉద్యోగి, నకిలీ విలేకరిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్వదర్శ నం కోసం వచ్చే భక్తులకు దర్శనం ఆలస్యమై తే బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి వచ్చేం దుకు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో యా క్సెస్ కార్డులు అందజేస్తారు. ఫొటోమెట్రిక్ వి ధానంలో భక్తుల వేలిముద్ర, ఫొటోలు సేకరించి దర్శన సమయం కేటాయించి భక్తును బయటకు అనుమతిస్తారు. తిరిగి దర్శన సమయానికి అదే కార్డుతో క్యూలోకి అనుమతించే సౌకర్యం ఉంది. అక్కడ జూనియర్ అసిస్టెం ట్‌గా పనిచేసే వీరాస్వామి శుక్రవారం సాయంత్రం అక్రమంగా యాక్సెస్ కార్డులు పొంది వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల 15 మంది భక్తులకు విక్రయించాడు. వాటితో భక్తులు క్యూలోకి ప్రవేశించారు. ఫొటోమెట్రిక్ విధానంలో టికెట్లను తనిఖీ చేయగా భక్తుల వేలిముద్రలు, ఫొటోలు సరిపోలేదు. అక్కడి విజిలెన్స్ అధికారులు భక్తులను విచారిం చారు. వారు తాము ఆ టికెట్లను రూ.3 వేలకు కొనుగోలు చేసినట్టు చెప్పి, రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. టికెట్లు విక్రయించిన జూ నియర్ అసిస్టెంట్ వీరాస్వామిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిం చారు. జరిగిన సంఘటనపై శనివారం ఉద యం సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్‌కు నివేదిక అందజే సి శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు. క్యూలోకి అనుమతిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా శనివారం ఉదయం ఐదుగురి భక్తుల వద్ద రూ.500 నగదు తీసుకుని రూ.300 టికెట్ల దర్శనంలోకి అనుమతిం చిన హోంగార్డు చంద్రశేఖర్(38)ను విజిలెన్స విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా టీటీడీ ఉగ్రాణంలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేసే సిద్ధయ్య(40) ఇద్దరి భక్తుల వద్ద రూ.1000 తీసుకుని దర్శనానికి అనుమతిస్తూ విజిలెన్స్ విభాగానికి పట్టుబడ్డాడు. అలాగే అమత వర్షిణి వార్తా పత్రిక విలేకరినంటూ భక్తులను క్యూలోకి అనుమతిస్తున్న తిరుపతికి చెందిన రమేష్(35)ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను డెప్యూటీఈవో చిన్నంగారి రమణ, సీఐ విజ య్శేఖర్ విచారించి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డికి అప్పగించారు. -
టీటీడీ ఉద్యోగి దర్శన దందా
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం పేరుతో భక్తుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన టీటీడీ ఉ ద్యోగి, హోంగార్డు, కాంట్రాక్టు ఉద్యోగి, నకిలీ విలేకరిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్వదర్శ నం కోసం వచ్చే భక్తులకు దర్శనం ఆలస్యమై తే బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి వచ్చేం దుకు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో యా క్సెస్ కార్డులు అందజేస్తారు. ఫొటోమెట్రిక్ వి ధానంలో భక్తుల వేలిముద్ర, ఫొటోలు సేకరించి దర్శన సమయం కేటాయించి భక్తును బయటకు అనుమతిస్తారు. తిరిగి దర్శన సమయానికి అదే కార్డుతో క్యూలోకి అనుమతించే సౌకర్యం ఉంది. అక్కడ జూనియర్ అసిస్టెం ట్‌గా పనిచేసే వీరాస్వామి శుక్రవారం సాయంత్రం అక్రమంగా యాక్సెస్ కార్డులు పొంది వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల 15 మంది భక్తులకు విక్రయించాడు. వాటితో భక్తులు క్యూలోకి ప్రవేశించారు. ఫొటోమెట్రిక్ విధానంలో టికెట్లను తనిఖీ చేయగా భక్తుల వేలిముద్రలు, ఫొటోలు సరిపోలేదు. అక్కడి విజిలెన్స్ అధికారులు భక్తులను విచారిం చారు. వారు తాము ఆ టికెట్లను రూ.3 వేలకు కొనుగోలు చేసినట్టు చెప్పి, రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. టికెట్లు విక్రయించిన జూ నియర్ అసిస్టెంట్ వీరాస్వామిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిం చారు. జరిగిన సంఘటనపై శనివారం ఉద యం సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్‌కు నివేదిక అందజే సి శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు. క్యూలోకి అనుమతిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా శనివారం ఉదయం ఐదుగురి భక్తుల వద్ద రూ.500 నగదు తీసుకుని రూ.300 టికెట్ల దర్శనంలోకి అనుమతిం చిన హోంగార్డు చంద్రశేఖర్(38)ను విజిలెన్స విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా టీటీడీ ఉగ్రాణంలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేసే సిద్ధయ్య(40) ఇద్దరి భక్తుల వద్ద రూ.1000 తీసుకుని దర్శనానికి అనుమతిస్తూ విజిలెన్స్ విభాగానికి పట్టుబడ్డాడు. అలాగే అమత వర్షిణి వార్తా పత్రిక విలేకరినంటూ భక్తులను క్యూలోకి అనుమతిస్తున్న తిరుపతికి చెందిన రమేష్(35)ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను డెప్యూటీఈవో చిన్నంగారి రమణ, సీఐ విజ య్శేఖర్ విచారించి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డికి అప్పగించారు.