కారంపూడి, న్యూస్‌లైన్ :కారంపూడిలోని రేషన్ దుకాణాలపై గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కారంపూడిలో నాలుగు షాపులను తనిఖీ చేసేందుకు వెళ్లారు. వీటిలో రెండు షాపులకు తాళాలు వేసి ఉన్నాయి. షాపు నం 32లో రెండున్నర క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించామని, మరో షాపులో వ్యత్యాసం ఏమీ లేదని విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎన్.కిశోర్‌కుమార్ తెలిపారు. అనంతరం వేపకంపల్లె గ్రామంలోని రేషన్ షాపు నం. 26లో తనిఖీ చేస్తున్నారు. అక్కడ స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని, తుది నివేదికకు కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వరరావు, వీఆర్వో పసుపులేటి సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు రేషన్ షాపుల సీజ్..
మంచికల్లు (రెంటచింతల),న్యూస్‌ైలైన్: మంచికల్లు గ్రామంలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ షాపులను సీజ్‌చేసినట్లు విజిలెన్స్ సీఐ కె.వంశీధర్ బుధవారం తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆయన ఆదేశాలతో గ్రామంలోని 16, 17 నంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 16వ రేషన్ షాపులో 104 కేజీల బియ్యం, 64 కేజీల పంచదార, షాపున ంబర్ 17లో 12 క్వింటాళ్ల బియ్యం, 167 కేజీల పంచదార నిల్వ ఉండాల్సిన దాని కన్నా తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఆ షాపులపై 6-ఎ కేసులు నమోదుచేసి సీజ్ చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. సరుకును రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కటికల బాలయ్యకు స్వాధీనపరిచామన్నారు.
రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
Published Thu, Jan 9 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement