గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.
తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment