కూసుమంచి, న్యూస్‌లైన్ : నాయకన్‌గూడెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో సిబ్బంది స్వాహా పర్వం తవ్వుతున్న కొద్ది బయట పడుతోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ. 43.13 లక్షల రూపాయలు గల్లంతైనట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. బ్యాంకులో ఈనెల 22న రూ.6.50 లక్షలు తేడా రావటంతో మేనేజర్ గుర్తించగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం రూ. 16 లక్షల వరకు స్వాహా జరిగినట్లుగా గుర్తించగా... అది శుక్రవారానికి రూ. 43.13 లక్షలకు చేరింది. విచారణ ఇంకా పూర్తికానందున ఇది పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులో వెలుగు చూస్తున్న ఘటనతో ఖాతాదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ ఖాతాల్లోని నగదు నిలువలను సరిచూసుకుంటున్నారు.
ఖాతాదారుల డిపాజిట్ల నుంచే స్వాహా...
బ్యాంకులో ఈనెల 22న తక్కువగా ఉన్నట్లు తేలిన బ్యాంకు బాలెన్స్ నగదు రూ. 6.50 లక్షలుతో కలుపుకుని ఇప్పటి వరకు రూ. 43.13 లక్షల వరకు స్వాహా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. పలువురు రులు బ్యాంకులో డబ్బును దాచుకునేందుకు రాగా బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్ వారికి తగు రశీదులు ఇచ్చినా అట్టి సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. బ్యాంకు బ్యాలెన్స్‌షీట్ తేడా రాకుండా చూసుకుంటూ వీరు స్వాహాకు పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈతంతంగం బయట పడటంతో అక్రమం తేలింది. క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్ తాము తప్పు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది.
కేసులు నమోదు....
నాయకన్‌గూడెం బ్యాంకులో నగదు స్వాహాకు బ్యాంకులో పనిచే స్తున్న క్యాషియర్ సుదీర్‌సింగ్, అసిస్టెంట్ క్యాషియర్ రవికుమార్‌లు బాధ్యులుగా పేర్కోంటూ శుక్రవారం బ్యాంకు మేనేజర్ శిరీష రిజనల్ మేనేజర్ (బిజినెస్) వెంకటేశ్వరావుతో కలిసి సీఐ నరేష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారిపై ఐపీసీ 409,420,468, 471 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, అందరికి తాము న్యాయం చేస్తామని మేనేజర్‌అన్నారు. ఖాతాదారులు సంయమనం పాటించాలని విజప్తి చేశారు.
తవ్వుతున్న కొద్దీ...బెంబేలెత్తిస్తున్న బ్యాంకు స్వాహాపర్వం
Published Sat, Oct 26 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement