టీటీడీ ఉద్యోగి దర్శన దందా | TTD employee visual danda | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగి దర్శన దందా

Published Sun, Aug 11 2013 3:15 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

TTD employee visual danda

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం పేరుతో భక్తుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన టీటీడీ ఉ ద్యోగి, హోంగార్డు, కాంట్రాక్టు ఉద్యోగి, నకిలీ విలేకరిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్వదర్శ నం కోసం వచ్చే భక్తులకు దర్శనం ఆలస్యమై తే బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి వచ్చేం దుకు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో యా క్సెస్ కార్డులు అందజేస్తారు.
 
 ఫొటోమెట్రిక్ వి ధానంలో భక్తుల వేలిముద్ర, ఫొటోలు సేకరించి దర్శన సమయం కేటాయించి భక్తును బయటకు అనుమతిస్తారు. తిరిగి దర్శన సమయానికి అదే కార్డుతో క్యూలోకి అనుమతించే సౌకర్యం ఉంది. అక్కడ జూనియర్ అసిస్టెం ట్‌గా పనిచేసే వీరాస్వామి శుక్రవారం సాయంత్రం అక్రమంగా యాక్సెస్ కార్డులు పొంది వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల 15 మంది భక్తులకు విక్రయించాడు. వాటితో భక్తులు క్యూలోకి ప్రవేశించారు.
 
 ఫొటోమెట్రిక్ విధానంలో టికెట్లను తనిఖీ చేయగా భక్తుల వేలిముద్రలు, ఫొటోలు సరిపోలేదు. అక్కడి విజిలెన్స్ అధికారులు భక్తులను విచారిం చారు. వారు తాము ఆ టికెట్లను రూ.3 వేలకు కొనుగోలు చేసినట్టు చెప్పి, రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. టికెట్లు విక్రయించిన జూ నియర్ అసిస్టెంట్ వీరాస్వామిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిం చారు. జరిగిన సంఘటనపై శనివారం ఉద యం సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్‌కు నివేదిక అందజే సి శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు.
 
 క్యూలోకి అనుమతిస్తూ...
 నిబంధనలకు విరుద్ధంగా శనివారం ఉదయం ఐదుగురి భక్తుల వద్ద రూ.500 నగదు తీసుకుని రూ.300 టికెట్ల దర్శనంలోకి అనుమతిం చిన హోంగార్డు చంద్రశేఖర్(38)ను విజిలెన్‌‌స విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా టీటీడీ ఉగ్రాణంలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేసే సిద్ధయ్య(40) ఇద్దరి భక్తుల వద్ద రూ.1000 తీసుకుని దర్శనానికి అనుమతిస్తూ విజిలెన్స్ విభాగానికి పట్టుబడ్డాడు.
    
 అలాగే అమత వర్షిణి వార్తా పత్రిక విలేకరినంటూ భక్తులను క్యూలోకి అనుమతిస్తున్న తిరుపతికి చెందిన రమేష్(35)ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను డెప్యూటీఈవో చిన్నంగారి రమణ,  సీఐ విజ య్‌శేఖర్ విచారించి విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డికి అప్పగించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement