సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలానాథ్ విమర్శించారు. యూపీలోని ఉన్నావ్.. కశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలకు కారణం బీజేపీ నాయకులేనన్నారు. వరుస అత్యాచార కేసుల్లో 20మందికి పైగా బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బలత్కార్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు.
కఠువా, ఉన్నావో అత్యాచార ఘటనలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుస అత్యాచారాలు జరుగుతున్నా.. ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ రేపిస్టులకు రక్షణ కల్పించి, బాధిత కుంటుంబాలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
కాగా కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ సున్నితమైన అంశాలతో కూడా రాజకీయం చేస్తుందని ఆరోపించింది. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే పనిగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు.
మరోవైపు కథువా, ఉన్నావో బాధితులకు న్యాయం చేయాలంటూ స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ‘మౌనం సమస్యకి పరిష్కారం కాదు’ , ‘పురుషుల హింసపై నిశ్శబ్దాన్ని వీడండి,’ బెయిల్ వద్దు, ఉరే కరెక్ట్ ’ అనే ప్లకార్డులతో వేలాది మంది ఢిల్లీలో రోడ్లపైకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment