నీకూ ‘ఉన్నావ్‌’ లాంటి గతే.. | Another UP minor molested threatened with Unnao like fate | Sakshi
Sakshi News home page

నీకూ ‘ఉన్నావ్‌’ లాంటి గతే..

Published Tue, Dec 10 2019 3:00 PM | Last Updated on Tue, Dec 10 2019 3:11 PM

Another UP minor molested threatened with Unnao like fate - Sakshi

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒకవైపు రాష్ట్ర ముఖ‍్యమంత్రి  ఆదిత్యనాధ్‌  మహిళలపై అఘాయితాల్యకు దాడుల కేసుల విచారణ నిమిత్తం పెద్దమొత్తంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. మరోవైపు సామూహిక అత్యాచార బాధితురాలిని (మైనర్ బాలిక) నిందితుడు సజీవ దహనం చేసిన ఘటనను ఇంకా మర్చిపోక ముందే మరో దుండగుడు రెచ్చిపోయాడు. మరో మైనర్ బాలికపై  వేధింపులకు తెగబడ్డాడు. అంతేకాదు కేసు పెడితే...ఉన్నావ్‌ ఘటన పునరావృతమవుతుందని, నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  

కాన్పూర్‌కు చెందిన బాధితురాలి ప్రకారం దీపక్ జాదౌన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీన్నిగట్టిగా ప్రతిఘటించడంతో..తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి చొరబడిన మరీ మరింత గలాటా చేశాడు. దీంతో ఆమె గట్టిగా అరచి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమి గూడారు. దాంతో  దీపక్‌ తదితరులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నౌబాస్టా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు బాధిక బాలిక కుటుంబ సభ్యులు. అప్పటికే అక్కడికి చేరుకున్న నిందితులు బాలికపై చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అతని ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిందితుడు తన కుటుంబ సభ్యుల కూడా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, తన కుటుంబం భయంతో జీవిస్తోందని  ఆరోపించింది.

అయితే ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేశారని పోలీసు సూపరింటెండెంట్ అపర్ణ గుప్తా తెలిపారు. అలాగే తనకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత బాలిక ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై విషయంపై దర్యాప్తు జరుగుతోందని,  కేసు నమోదు చేశామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement