చురాచంద్‌పూర్: మణిపూర్‌లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్‌పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్‌లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్‌లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.
కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment