![Woman Pours Petrol On Daughter After Unnao Victims Death - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/7/petrol.jpg.webp?itok=k4I5bF1Z)
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలబెట్టి చంపిన ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన మైనర్ కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి యత్నించిన ఘటన శనివారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా ఆమెకు నిప్పంటించడంతో.. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆమె గ్రామానికి తీసుకెళ్లారు. ఉన్నావ్‌బాధితురాలి మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి తరలించిన దాదాపు గంట తర్వాత ఈ సంఘటన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment