Safdarjung Hospital
-
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో ఇద్దరు డాక్టరకు కరోనా పాజిటివ్
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్‌కు కులం, మతం, చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్.. తాజాగా ఇద్దరు డాక్టర్లకు సోకింది. ఢిల్లీలోని సఫ్తర్‌జంగ్ హాస్పిటల్లో పనిచేస్తున్నఇద్దరు వైద్యులు కోవిడ్ భారిన పడినట్లు బుధవారం అధికారులు తెలిపారు. వారిలో ఒకరు ఇదే హాస్పిటల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తుండగా, మరొకరు బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. ఈమె కొన్నివారాల క్రితమే విదేశాలకు వెళ్లివచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఇద్దరిలోనూ కోవిడ్ లక్షణాలు ఉండటంతో పరీక్ష నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిని ఇప్పడు సఫ్తర్‌జంగ్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.కరోనా సోకిన ఈ ఇద్దరు డాక్టర్లతో సన్నిహితంగా ఉన్న మిగతా మిగతా వైద్య సిబ్బందిని కూడా పరీక్షించగా ఇప్పటివరకూ ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దేశంలో ఇప్పటివరకు 1,637 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, వారిలో 38 మంది మరణించారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. (వారి వివరాలు సేకరించండి: కేంద్రం) -
తొలి కరోనా బాధితుడి అనుభవాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్న 45 ఏళ్ల రోహిత్ దుత్త అనే కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న రోహిత్.. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చికిత్స సమయంలోని అనుభవాలను పంచుకున్నారు. యూరప్ నుంచి వచ్చిన తనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా సోకిందని తెలియగానే.. తొలుత కొంత ఆందోళన చెందినట్లు తెలిపారు. అయితే ఢిల్లీ వైద్యులు అందించిన చికిత్సపై తనకు ఎంతో నమ్మకం కలిగిందని, కరోనాను ఎదుర్కొగల శక్తీసామర్థ్యాలు మన దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ సోకినా ఎలాంటి అధైర్యాలకు, భయాలకు లోనుకాకుడదని సలహాఇచ్చారు. ( 91 మంది మృతి.. ఆగని ఎన్నికలు) సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో సదుపాయాలు ఫైవ్ స్టార్ హోటల్‌ను మించేలా ఉన్నాయని రోహిత్ దుత్త తెలిపారు. ‘గత నెల 24న యూరప్ నుంచి ఢిల్లీ చేరుకున్న తరువాత తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడ్డాను. తొలుత రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరా. అప్పటికి ఢిల్లీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే నాలో కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట్లో కొంత భయపడ్డా.. కానీ వైద్యులు ఎంతో భరోసా ఇచ్చారు. సొంత సోదరుడిలా చికిత్స అందించారు. ప్రధాని మోదీతో సహా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పరిస్థితిని రోజూ సమీక్షించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టింది. వారికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఓ మహిళ మృతిచెందగా.. ఆదివారం నాటికి పూర్తిగా కోలుకుని ఇద్దరు బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కేసులు వెలుగుచూస్తున్న సమయంలో మరో 15 రోజుల పాటు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిదని కోలుకున్న బాధితులు సలహాలు ఇస్తున్నారు. కరోనాతో ఎలాంటి భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం లేదని అంటున్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో ఆదివారం నాటికి మొత్తం 107 కేసులు నమోదైన అయ్యాయి. ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా 32 కేసులు వెలుగుచూడగా.. తరువాతి స్థానంలో కేరళ, కర్ణాటకలో ఉన్నాయి. -
ఉన్నావ్ ఎఫెక్ట్: సొంత కుమార్తెపై పెట్రోల్ పోసి..
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలబెట్టి చంపిన ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన మైనర్ కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి యత్నించిన ఘటన శనివారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామన్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా ఆమెకు నిప్పంటించడంతో.. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆమె గ్రామానికి తీసుకెళ్లారు. ఉన్నావ్‌బాధితురాలి మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి తరలించిన దాదాపు గంట తర్వాత ఈ సంఘటన జరిగింది. -
దారుణం: ఆధార్ లేదని వైద్యం నిరాకరణ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ 9 ఏళ్ల బాలికకు ఆధార్ లేదని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిరాకరించారు. చివరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జోక్యంతో సదరు బాలికకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక మీడియా కథనం మేరకు.. నోయిడాకు చెందిన ప్రియా(9) ఆనారోగ్యానికి గురికావడంతో లోక్ నాయక్ జై ప్రకాష్(ఎన్జేపీ) ఆసుపత్రి తీసుకెళ్లగా.. ఆ చిన్నారికి ఆధార్ లేదని అక్కడి వైద్యులు వైద్యం నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మనోజ్ తీవారీ ట్విటర్ వేదికగా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తూ.. కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ట్యాగ్ చేశారు. ‘ కేజ్రీవాల్జీ దేశ రాజధానిని ఎందుకు విభజిస్తున్నారు. జేపీ నడ్డాజీ.. అ అమ్మాయికి ట్రీట్మెంట్ అందకపోతే ఈ నవరాత్రుల్లో మంచి జరగదు’ అని ట్వీట్ చేశారు. దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘ ఆ బాలికను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తరలించాం. ఆమె వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారికి చిరాకాలం జీవించే శక్తినివ్వాలని ఆ జగదాంబను ప్రార్ధిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. ఆ బాలిక మూర్చ రోగంతో బాధపడుతుందని ఆసుపత్రి సూపరిడెంట్ మీడియాకు తెలిపారు. ఆమెకు పిడియాట్రిక్ న్యూరోలాజిస్ట్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. -
వీవీఐపీ సిఫారసు చికిత్సలు ఇక బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రభుత్వ ఆసుపత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వీవీఐపీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేద రోగుల చికిత్సకు ప్రాధాన్యం ఇస్తూ వీవీఐపీ సిఫారసు చేసే 'ప్రాధాన్య చికిత్స'లకు చరమగీతం పాడింది. అవసరం ప్రాతిపదికనే వైద్యులు రోగులకు సేవలు అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆదేశాలిచ్చింది. రోగులకు చికిత్స అందించే క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోరాదని, వాటికి ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు, సీనియర్ వైద్యులు, రోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి పరిపాలన విభాగం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని, ఇకమీదట ఆసుపత్రి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు. కాగా ఇటీవలి ఆసుపత్రి యాజమాన్య నిర్ణయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ఆసుపత్రి యాజమాన్య ఆదేశాలపై విచారణ చేపడతామన్నారు. ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి తాజా నిర్ణయం. అయితే ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీవీఐపీ సంస్కృతిని విడిచిపెట్టాలనే ఆకాంక్షను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల తరచు వ్యక్తం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ ఆయా ఆసుపత్రులలోని స్పెషల్ వార్డులను జనరల్ వార్డులుగా మార్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
బతుకులు ఛిద్రం వెయ్యి గుడిసెలు బుగ్గి
ఎనిమిది మందికి గాయాలు - వసంత్‌కుంజ్ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం - నిరాశ్రయులైన కాలనీ వాసులు - మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది - బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం వసంత్‌కుంజ్‌లోని మసూద్‌పూర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి మురికివాడ కాలి బూడిదయింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎల్జీ నజీబ్‌జంగ్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. సాక్షి, న్యూఢిల్లీ: క్షణాల్లో అంటుకున్న అగ్గి వందలాది మంది పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగ కున్నా నిలువ నీడ, దస్తులు, వంట సామగ్రి మాడిమసయింది. ఎనిమిది మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతం మసూద్‌పూర్ జుగ్గీజోపిడీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఉదయం 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తేరుకుని మంటలార్పేందుకు యత్నించే లోపే అవి పూర్తిగా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి. జుగ్గీజోపిడీలకు సమీపంలోనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, చెక్కలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. మంటలు వీటికి అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బస్తీవాసులంతా పరుగుతు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 35 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని నిమిషాల్లోనే దాదాపు వెయ్యి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం వేళలో ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. రాత్రి వేళల్లో మంటలు అంటుకుంటే ప్రాణ నష్టం తీవ్రస్థాయిలో ఉండేదని స్థానికులు అన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించినట్టు ఢిల్లీ అగ్నిమాపక కేంద్రం డెరైక్టర్ ఏకే శర్మ తెలిపారు. ‘మాకు సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాం. మొత్తం 35 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిం చాం. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కానీ ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి’ అని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలేంటో ఇంకా నిర్ధారణకు రాలేదని శర్మ తెలిపారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపిం చాయి. దీంతో గందరగోళం నెలకొంది. ప్రాణాలు రక్షించేందుకు గుడిసెల వాసులంతా పరుగులు తీశారు. అదే సమయంలో మంటల కారణంగా జుగ్గీల్లోని కొన్ని చిన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత పెరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యు=లు తెలిపారు. గుడిసెలన్నీదగ్ధం కావడంతో తామంతా రోడ్డు పడ్డా మంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు అర్థిస్తున్నారు. ఘటనాస్థలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సందర్శించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం : వసంత్‌కుంజ్ బస్తీతోపాటు శుక్రవారం నగరంలో మరోచోట అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో బెంగా లీ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇవి పక్కన ఉండే మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. రెండు దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం అయినట్టు దుకాణ యజ మానులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందజేసినట్టు వారు చెప్పారు. మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోనూ.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి క్యాంటీన్లోనూ శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం రెండింటికి ఈ ఘటన జరగడంతో నాలుగు అగ్నిమాపకశకటాలతో మంటలను ఆర్పేశారు. ఘటన కు గల కారణాలు తెలియలేదని ఒక అధికారి వివరించారు. -
పేదలపాలిట సంజీవని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి
న్యూఢిల్లీ: పేద, ధనిక అన్న తేడాలేమీ లేకుండా అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తూనే ఉన్నాయి. కలుషితమైన వాతావరణం, రసాయనాలతో పండించిన పంటలు మానవుడి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఆర్థికంగా ఫరవాలేదనుకున్నవారు అవసరమైన వైద్యం చేయించుకొని ప్రాణాలను కాపాడుకుంటున్నారు. పూటగడవడమే కష్టంగా ఉన్నవారు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్నా ఏవో చిన్నాచితకా రోగాలకు మాత్రమే. కిడ్నీ మార్పిడి వంటి పెద్ద సమస్యే ఎదురైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ఈ భారాన్ని మోయలేనివారు తనువు చాలించాల్సిందే. ఇలాంటి రోగులపట్ల సంజీవనిగా నిలుస్తోంది నగరంలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్. లక్షల రూపాయలు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడిని కూడా ఉచితంగా చేస్తూ, రోగి కోలుకునే వరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజే స్తోంది. ఇప్పటిదాకా ఇటువంటి సౌకర్యం ఈ ఆస్పత్రిలో ఉండేది కాదని, అక్టోబర్ 8న బీహార్‌కు చెందిన రామ్ ప్రవేశ్‌కు తొలిసారిగా కిడ్నీ మార్పిడి చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ తర్వాత తమలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రోగుల్లో కొందరిని ఎంపిక చేసి త్వరలో మరిన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తామని చెబుతున్నారు. ఈ విషయమై అవయవ మార్పిడి విభాగం ఇన్చార్జి డాక్టర్ విమల్ భండారీ మాట్లాడుతూ.. ‘బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన రామ్ ప్రవేశ్ కిడ్నీ పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే అతని సమస్య ఐదో స్టేజీలో ఉంది. ఇటువంటి సమయంలో కిడ్నీని మార్చడం మినహా మ రో మార్గంలేదు. పవేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతోపాటు ఆయన భార్య కిడ్నీని దానం చేసేం దుకు సిద్ధంగా ఉండడంతో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. అయితే అటువంటి ఆపరేషన్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో గతంలో ఎప్పుడూ చేయలేదు. దీంతో అనుభవజ్ఞుల పర్యవేక్షణలో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. యూరాలజీ, నెఫ్రాలజీ, అనస్థీషియా విభాగాలకు చెందిన ఆరుగురు డాక్టర్లు, ఎయిమ్స్, బీఎల్కే ఆస్పత్రులకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఈ నెల 8న ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాం. గతంలో కిడ్నీ మార్పిడి ప్రక్రియను దాదాపు ఆరు సంవత్సరాలపాటు చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం దక్కింది. మిగతా వారికి కూడా మూడేళ్లకుపైగానే అనుభవముంది. అయితే ఈ ఆపరేషన్ చేసేందుకు ఇద్దరు నెఫ్రాలజిస్టుల అవసరముందని గుర్తించి అనుభవజ్ఞుల సాయం తీసుకున్నామ’ని చెప్పారు. యూరాలజీ విభాగం ఇన్చార్జి డాక్టర్ అనుప్ కుమార్ మాట్లాడుతూ... ‘ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి అవసరమైన రోగులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వారిలో అత్యవసర వైద్యం అవసరమైన ఐదుగురిని గుర్తించి రానున్న రోజుల్లో వారికి ఆపరేషన్ చేస్తామ’ని చెప్పారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ మాట్లాడుతూ... ‘కేవలం ఆపరేషన్ చేసి వదిలించుకోవడం కాకుం డా రోగి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నాం. ప్రవేశ్‌కు దాదాపు నెలరోజులకు సరిపడా మందులను అందజేశాం. ఆర్థికంగా ఇది వారికి ఎంతో ఊరటను ఇచ్చే విషయమే. అయితే ఈ ఆపరేషన్‌కు అవసరమైన పూర్తి సదుపాయాలు మా ఆస్పత్రిలో లేనందున కొన్ని పరీక్షల కోసం ఎయిమ్స్, ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో సఫ్దర్జంగ్లోనే అన్ని సదుపాయాలను సమకూర్చుకుంటామ’ని చెప్పారు.