సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ కేసు మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు ఓ మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా, మరో యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీశాడు. సహకరించకపోతే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు.
‘గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామని బెదిరించటం...’ దానికి ఆ మహిళ ‘అన్నా.. వదిలేయండని ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్న’ దృశ్యాలు ఉన్నాయి. అయినా కామాంధులు కనికరించకపోవటంతో చివరికి ఆ మహిళ ఎలాగోలా తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలింపు చేపట్టారు.
ఉన్నావ్‌లో మరో దారుణ ఘటన
Published Fri, Jul 6 2018 12:15 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment