భార్యకు పాము కాటు.. కాటేసిన పామునూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు | After Snake Bite UP Husband Take Snke Along Wife Hospital | Sakshi
Sakshi News home page

భార్యను కాటేసిన పాము.. బాటిల్‌లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు

Published Sat, Jun 25 2022 12:38 PM | Last Updated on Sat, Jun 25 2022 12:40 PM

After Snake Bite UP Husband Take Snke Along Wife Hospital - Sakshi

లక్నో: యస్‌.. భార్యను పాము కాటేసింది. నొప్పితో ఆమె విలవిలలాడుతోంది. స్థానికులంతా చేరి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ భర్త మాత్రం భార్యను పట్టించుకోలేదు. నానా హంగామా చేసి ఆ పామును పట్టేసుకున్నాడు. పాము కాటుకి గురైన భార్యతో పాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకుపోయాడు. అది చూసి డాక్టర్లు భయపడిపోయారు.. ఆ తర్వాత ఏమైందంటే.. 

చిత్రమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ ఉన్నావ్‌  అఫ్జల్‌ నగర్‌ ఏరియాలో  జరిగింది. భార్యను పాము కాటేయడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త రమేంద్ర యాదవ్‌. అయితే.. భార్యను కాటేసిన పామును సైతం ఓ బాటిల్‌లో బంధించి.. దానికి గాలి ఆడేలా ఆ బాటిల్‌కు చిన్నచిన్న రంధ్రాలు చేసి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు.   

‘ఎందుకు తెచ్చావయ్యా!’ అని వైద్య సిబ్బంది అడిగితే.. ‘‘నీ భార్యను ఏ పాము కాటేసిందని అడిగితే.. ఏమని చెప్పేది. అందుకే.. ఆ పామునే తెచ్చా! అని సమాధానం ఇచ్చాడు రమేంద్ర. ఆ సమాధానం విని డాక్టర్లు తెగ నవ్వుకున్నారట. 

చికిత్స తర్వాత కోలుకున్న భార్యను ఇంటికి తీసుకెళ్లే క్రమంలోనే.. అడవిలో ఆ పామును వదిలేశానని రమేంద్ర మీడియాకు వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement