పసిడి తవ్వకాలపై జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు
పసిడి తవ్వకాలపై జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు
Published Mon, Oct 21 2013 8:35 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఆర్కియోలాజిస్ట్స్ చేపట్టిన తవ్వకాలపై జోక్యం చేసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి శోభన్ సర్కార్ కలను ఆధారం చేసుకుని నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అనేక విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. 19 శతాబ్దంలో పూడ్చిన వేయి టన్నుల బంగారం కోసం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టన తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. అయితే జిల్లా అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఓ సాధువు కల ఆధారంగా తవ్వకాలు చేపట్టడాన్ని విమర్శించిన నరేంద్ర మోడీ సోమవారం ఈ వ్యవహారంపై యూటర్న్ తీసుకున్నారు. శోభన్ సర్కార్ ను తాజాగా మోడీ ప్రశంసలతో ముంచెత్తారు.
దోడియా ఖేరా గ్రామంలో తవ్వకాలు చేపట్టిన అధికారులు కొన్ని సందేహాలు తలెత్తడంతో ఆపివేశారు. ఈ తవ్వకాలపై దాఖలైన అభ్యర్థనపై విచారించిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
Advertisement