Shobhan sarkar
-
బంగారం వేటలో జోక్యం చేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలోని ఓ పురాతన కోట శిథిలాల కింద భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) బంగారం కోసం కొనసాగిస్తున్న వేట సోమవారం నాలుగోరోజూ కొనసాగింది. మరోవైపు ఈ తవ్వకాల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించింది. ఊహాజనితమైన అంశాల ఆధారంగా ఈ కేసులో తామెలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగొయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు పేర్కొంది. వెయ్యి టన్నుల బంగారం కంటే విలువైన రాష్ట్ర చారిత్రక ప్రదేశాలను వెలికితీయాలనే విజ్ఞప్తిని ఏఎస్ఐ పెడచెవిన పెట్టిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సోమవారం పాట్నాలో ధ్వజమెత్తారు. మరోవైపు ఏఎస్ఐ తవ్వకాలను నిన్నటిదాకా ఎద్దేవా చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పుడు మాట మార్చారు. బంగారం గనుల కల గన్న సాధువు శోభన్ సర్కార్ నిరాడంబరత, త్యాగాలకు తాను ప్రణమిల్లుతున్నట్లు సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పసిడి తవ్వకాలపై జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఆర్కియోలాజిస్ట్స్ చేపట్టిన తవ్వకాలపై జోక్యం చేసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి శోభన్ సర్కార్ కలను ఆధారం చేసుకుని నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అనేక విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. 19 శతాబ్దంలో పూడ్చిన వేయి టన్నుల బంగారం కోసం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టన తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. అయితే జిల్లా అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఓ సాధువు కల ఆధారంగా తవ్వకాలు చేపట్టడాన్ని విమర్శించిన నరేంద్ర మోడీ సోమవారం ఈ వ్యవహారంపై యూటర్న్ తీసుకున్నారు. శోభన్ సర్కార్ ను తాజాగా మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దోడియా ఖేరా గ్రామంలో తవ్వకాలు చేపట్టిన అధికారులు కొన్ని సందేహాలు తలెత్తడంతో ఆపివేశారు. ఈ తవ్వకాలపై దాఖలైన అభ్యర్థనపై విచారించిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. -
శోభన్ సర్కార్‌కు ప్రమాణం చేస్తున్నా: మోడీ
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నబంగారం వేట గురించి నిన్న గాక మొన్న విమర్శలు గుప్పించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తాజాగా మాట మార్చారు. కోట కింద బంగారం ఉందని చెప్పిన సాధువు శోభన్ సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ''అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజలు సంత్ శోభన్ సర్కార్ పట్ల విశ్వాసంతో ఉన్నారు. ఆయన శ్రద్ధ, త్యాగాలకు నేను ప్రమాణం చేస్తున్నాను'' అని మోడీ ట్విట్టర్లో రాశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం గురించి మరోసారి ప్రస్తావించిన మోడీ.. ఆ అంశంపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై దేశ ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు. శోభన్ సర్కార్ భక్తులు కొందరు మోడీకి లేఖ రాసి.. ఆయనపై చేసిన వ్యాఖ్యాలకు నిరసన వ్యక్తం చేయడం వల్లే మోడీ ఇలా మాట మార్చారని భావిస్తున్నారు. ప్రపంచమంతా మనల్ని చూసి నవ్వుతోందంటూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తవ్వకాల గురించి చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశాన్ని దోచుకున్న వారి చేతుల్లో ఉన్న సొమ్ము వెయ్యి టన్నుల బంగారం కంటే ఎక్కువే ఉంటుందని వ్యాఖ్యానించారు.