Treasure hunt
-
క్యాష్ ‘హంట్’
జనాలతో సందడిగా ఉండే ప్రాంతం అది..ఒక వ్యక్తి తొందరతొందరగా వచ్చి ఫుట్‌పాత్‌పై ఉన్న చెత్తకుండీకి అంటించి ఉన్న కవర్ తీసుకొని అందులోని 500 రూపాయల నోట్ జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. మనుషులే లేని మరో నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన పాతబస్టాండ్లోకి వేగంగా వెళ్లి ఇనుప చువ్వలో దాచిన వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్లాడు మరొకతను. వ్యూస్, లైక్స్ కోసమేనా?? సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, క్రికెట్ స్టేడియం వంటి పరిసర ప్రాంతాలతోపాటు బస్టాండ్లు, పార్కులు, ఫ్లైఓవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. నగరంలో న్యూ ట్రెండ్‌గా మారింది ఈ తరహా ట్రెజర్..కాదుకాదు క్యాష్ హంటింగ్. నగరంలోనే కాదు..నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో సైతం మనీ హంటింగ్ కొనసాగించడం విశేషం. కొందరు వ్యక్తులు ఇలా డబ్బులను వివిధ ప్రాంతాల్లో పెట్టి అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు. వీటి కోసం ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికగా ప్రత్యేకంగా సైట్లు, సోషల్ పేజ్‌లు తయారు చేసుకున్నారు. ఇందులోని ఫాలోవర్స్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లో అక్కడకు చేరుకొని డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. మరికొందరు యాక్సెసరీస్ ప్యాక్ చేసి పెట్టి వారి స్టోర్ లేదా బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సోషల్ మీడియా అకౌంట్లకు పెద్దఎత్తున ఫాలోవర్స్ ఉండటం విశేషం. సోషల్‌మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్‌ను ఆకర్షించడం, వ్యూస్, లైక్స్ సంఖ్య పెంచుకోవడానికి ఈ తరహా ట్రెజర్ హంటింగ్ నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సోషల్‌మీడియాలో ఫేమ్‌తో పాటు యాడ్స్ రూపంలో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు హంట్ వీడియో పెడతారా అని ఫాలోవర్స్ చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఎవరు ముందు వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారనేది కూడా వీడియో తీసి అదే సోషల్ సైట్లలో పెడుతుంటే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. -
ఈశ్వరుని గుడిలో పురాతన బంగారు నిధి
యశవంతపుర: కాఫీతోటలో పురాతన బంగారు అభరణాలు బయట పడ్డాయి. కొడగు జిల్లా సిద్ధాపుర అమ్మతి సమీపంలో ఆనందపుర గ్రామానికి చెందిన టాటా కాఫీ సంస్థకు చెందిన తోటలో పని చేస్తున్న కార్మికులకు ఇవి చిక్కాయి. తోటలోని గుడి వద్ద కార్మికులు పని చేస్తుండగా పురాతన బంగారు ఆభరణాలు దొరికాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తోటలో అతిపురాతన ఈశ్వరుని గుడి ఉంది. మంగళవారం కార్మికులు అక్కడే పని చేస్తుండగా మట్టిలో ఈ ప్రాచీన బంగారు నిధి బయట పడ్డాయి. వెంటనే కార్మికులు సంస్థ అధికారుల దృష్టికి తెచ్చారు. అందులో పాత ఉంగరం, ఖడ్గం ఉన్నాయి. సిద్ధాపుర పోలీసులు పరిశీలించారు. విరాజపేట తహశీల్దార్ బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏ కాలం నాటివి అనేది పురావస్తు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలిపారు. -
రామప్పలో గుప్తనిధుల వేట
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా లభించి తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడుతుంటే, మరోపక్క దుండగులు రామప్ప ఉప ఆలయాల్లో గుప్తనిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో రామప్ప ప్రధాన ఆలయంతోపాటు పది ఉప ఆలయాలు ఉన్నాయి. వారం క్రితం రామప్ప ఆలయానికి పడమర దిశలో ఉన్న జామాయిల్ తోటలోని శివాలయం (ఉప ఆలయం) వద్ద గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపినట్లు సమాచారం. నెలరోజులుగా ఉప ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఒక ముఠా రాత్రివేళల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో సరస్సుకట్టపై ఉన్న ఉపఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి శివలింగాలను ధ్వంసం చేశారు. బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న శివాలయంలో నంది మెడను ధ్వంసం చేశారు. 20 రోజుల క్రితం పాలంపేట నాగబ్రహ్మక్షేత్రం వద్ద తవ్వకాలు జరపగా, ఏమీ లభించకపోవడంతో దానిని పూడ్చివేసినట్లు తెలిసింది. జామాయిల్ తోటలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్లు అక్కడ ఉన్న పూజా సామగ్రిని పట్టి తెలుస్తోంది. తవ్వకాల్లో విగ్రహంతోపాటు బంగారం లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ రక్షణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలంపేట ఉప ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, రాత్రివేళల్లో పోలీసులు భద్రతాచర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసిన ‘ట్రెజర్ హంట్’.. బావిలో పడేసిన వస్తువును..
ధారూరు: ‘ట్రెజర్ హంట్’ఓ పర్యాటకుని ప్రాణం తీసింది. బావిలో పడేసిన వస్తువును బయటకు తీయడమే ఈ ఆట ఉద్దేశం. 35 ఏళ్ల వివాహితుడు ఈ సాహసానికి ఒడిగట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. సీఐ తిరుపతిరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ మూన్లైట్ క్యాంపింగ్ గోదంగూడలో ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సికింద్రాబాద్ వాసి సీఎల్పీ సాయికుమార్(35) నలుగురు మిత్రులతో కలిసి శనివారం ఈ మూన్లైట్ క్యాంపింగ్‌కు వచ్చాడు. మిత్రులంతా కలిసి సాహసోపేతమైన గేమ్ ఆడాలనుకున్నారు. నిర్వాహకుల అనుమతి తీసుకుని.. 30 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో ‘ట్రెజర్ హంట్’ఆడాలని నిర్ణయించారు. బావిలోకి ఓ వస్తువును వదిలిపెట్టి, దాన్ని తీసుకొచ్చే టాస్క్ పెట్టారు. ఆ వస్తువును తీయడానికి సాయికుమార్ బావిలోకి దూకాడు. ఈ దృశ్యాన్ని మిత్రులు వీడియో తీస్తున్నారు. నీటిలో ఊపిరి ఆడక ఓ సారి పైకి వచ్చిన సాయికుమార్ రెండోసారి ప్రయత్నించి బయటికి రాలేదు. మిత్రులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బావిలో గాలించి సాయికుమార్‌ను బయటికి తీశారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువు వింధ్య ఫిర్యాదు మేరకు హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ నిర్వాహకుడు కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. సాయికుమార్‌కు భార్య వినీత, రెండేళ్ల కూతురు ఉంది. -
‘కార్తికేయ 2’కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్‌లో గెలిస్తే బంగారు కృష్ణుడి విగ్రహం
Nikhil Karthikeya 2 Movie Treasure Hunt Promotion: ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చి హిట్ కొట్టిన చిత్రం 'కార్తికేయ'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను విభిన్నంగా చేపట్టారు దర్శకనిర్మాతలు. ఇందుకోసం సెపరేటుగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రూ. 6 లక్షల విలువ గల శ్రీకృష్ణుడి బంగారు విగ్రహాలను ప్రైజ్ మనీగా పొందవచ్చని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా చేశారు. చదవండి: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ Soo many of u have cracked the first clue and have moved on to the next clue 🕵️♂️ The quest for the Lord Krishna Gold Idol is getting interesting 😃 You can be the lucky winner of #KarthikeyaQuest ❤️ Waiting for the one who finds the Gold Idol first#Karthikeya2 @actor_Nikhil https://t.co/WH4K16ibcy pic.twitter.com/akiO5p3DWv — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే 'కార్తికేయ 2' సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ A lot of you have found out the location from the #KarthikeyaQuest’s 1st clue, Congratulations! But the job is half done. Head out to that location to find the clue for the next location which will lead you to the Lord Krishna Gold Idol ❤️ Good Luck!#Karthikeya2 @anupamahere pic.twitter.com/FzG84v2k7e — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 U cud be right. But have u checked the second clue that is placed there at the location ? https://t.co/ekRLdGV4or — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 Hyderabad 🚨 Here's the first clue to win Lord Krishna Gold Idol in the #KarthikeyaQuest ❤️ “Vishwam Oka Poosala Danda… Nidhi nee Bhagyam lo undi ante Bhagyanagarapu Nadiboddu lo unna Janala Poosala Dandani cheruko” Get searching 🔥#Karthikeya2 @actor_Nikhil pic.twitter.com/vzP8CGdnor — People Media Factory (@peoplemediafcy) July 31, 2022 -
గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు
పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్ ఖరీం, డీకే మీరావలి, ఎస్కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్‌బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ సువర్ణ, ఎస్బీ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
చెక్కల కింద డబ్బుల పెట్టే.. రూ.లక్షల్లో..
వాషింగ్టన్ : కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు పరుల పాలు కాకుండా ఉండటం కోసం భూగర్భంలోనే.. ఇంట్లో ఎక్కడో చోట దాచి పెట్టటం అనాదిగా జరుగుతున్నదే. ఒక్కోసారి తన కుటుంబానికి చెందాలన్న ఆశతో వాటిని దాచి పెట్టినా.. కనుక్కునే అవకాశం లేకపోవటంతో.. పదులు, వందల సంవత్సరాల తర్వాత వేరే వారికి దొరకటం జరుగుతూనే ఉంది. సొంత వారికి దొరకటం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. మాసాచ్యూసెట్స్కు చెందిన ఓ ముసలాయన తను కూడబెట్టుకున్న దాదాపు 35 లక్షల రూపాయల డబ్బును ఓ పెట్టలో పెట్టి, ఇంట్లో ఎక్కడో దాచి పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత అతడు చనిపోయాడు. ఇంట్లో ఎక్కడో చోట డబ్బు దాచిపెట్టబడి ఉందని కుటుంబసభ్యులకు తెలిసింది. అయితే అది ఎక్కడన్నది తెలియలేదు. సంవత్సరాల నుంచి దాన్ని కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఇంటిని అమ్మాలనుకుంటున్న వారు అందులో నిధి ఉందని తెలిసి ఆగిపోయారు. ఇలా అయితే కుదరదని భావించి నిధుల అన్వేషణలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న ట్రెసర్ హంటర్ కేయిత్ విల్లేను రంగంలోకి దింపారు. అతడు మెటల్ డిటెక్టర్ సహాయంతో ఇళ్లంతా జల్లెడ పట్టాడు. ఇంట్లో ఓ మూల కిటికీల దగ్గర డబ్బుతో నిండిన పెట్టను వెలికి తీశాడు. అందులో దాదాపు 35 లక్షల రూపాయల డబ్బు కట్టలు వెలుగు చూశాయి. దీంతో సదరు కుటుంబం ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. -
గుప్త నిధుల కోసం తండ్రి ఘాతుకం
లక్నో : గుప్త నిధుల మోజులో పడి కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరబంకిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, బరబంకిలోని కుర్ద్ మావ్ గ్రామానికి చెందిన ఆలం అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని ఓ మాంత్రికుడు నమ్మబలికాడు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే 10 సంవత్సరాల ఆలం కూతురిపై కొన్ని పూజలు చేయాలని చెప్పాడు. మాంత్రికుడి మాటలు నమ్మిన ఆలం తన కూతుర్ని పూజలో కూర్చోబెట్టాడు. పూజలో భాగంగా చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. అడ్డు వచ్చిన భార్యను కూడా కొట్టాడు. ( మరోసారి బుక్కైన మిలింద్ సోమన్ ) తీవ్రగాయాలపాలైన కూతురు మృతి చెందటంతో ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో పూడ్చిన మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. తీవ్ర గాయాల కారణంగానే ఆలం కూతురు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ( మసీదు పెద్దకు భారీ జరిమానా: ఎందుకంటే..) -
పదేళ్ల శ్రమ.. బంగారు ముద్దలు, నాణేలు
వాషింగ్టన్: వేల కోట్ల విలువైన నిధినిక్షేపాలను ఎక్కడో దాచడం.. దాన్ని చేరుకోవడానికి రెండు గ్రూపులు పోటీ పడటం.. చివరకు హీరో దాన్ని దక్కించుకోవడం.. ఇలాంటి సినిమాలు దాదాపు అన్ని భాషల్లోను వచ్చాయి. సూపర్‌హిట్ అయ్యాయి కూడా. అయితే అచ్చంగా ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా 2 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నిధిని గుర్తించాడో వ్యక్తి. ఉత్తర అమెరికాలోని రాకీ పర్వత ప్రాంతాల్లో ఈ నిధిని కనుగొన్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి దీనిని గుర్తించాడు. వివరాలు.. న్యూ మెక్సికోకు చెందిన ఫారెస్ట్ ఫెన్ అనే పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి తనకు కిడ్నీ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఈ నిధి వేటను(ట్రెజర్‌హంట్) రూపొందించాడు. జబ్బు నయమైన తర్వాత కూడా ఫెన్ ఈ అలవాటును కొనసాగించాడు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఓ రాగి పెట్టెలో బంగారు ముద్దలు, నాణేలు, వజ్రాలు, ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన కళాకళాఖండాలు, ఇతర విలువైన వస్తువులను దాచాడు ఫెన్. తర్వాత నిధి వేటకు అవసరమైన క్లూస్‌ని ‘ది థ్రిల్ ఆఫ్ ది చేజ్’ పేరుతో ప్రచురించాడు. 24 లైన్ల నిగూఢ పద్యంలో నిధి ఉన్న తావుని వర్ణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి రాకీ పర్వతాల్లో సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో దాగి ఉన్న ఈ నిధిని కనుగొన్నట్లు ఫెన్ తెలిపాడు. సదరు వ్యక్తి నిధిని గుర్తించిన ఫోటొను తనకు పంపినట్లు ఫెన్ ‘ది శాంటా ఫే న్యూ మెక్సికన్’ వార్తాపత్రికకు తెలిపాడు. అయితే నిధిని కనుగొన్న వ్యక్తి పేరును ఫెన్ వెల్లడించలేదు. నిధి ఉన్నవస్తువు బరువు 9 కిలోలు ఉంటే దాని లోపల ఉన్న వస్తువులు మరో 10 కిలోల బరువు ఉంటాయని ఫెన్ తెలిపాడు. గత దశాబ్దంలో పదివేల మంది అన్వేషకులు ఈ నిధి జాడను కనుగొనేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. చాలామంది తమ ఉద్యోగాలను వదిలి పెట్టి.. ప్రమాదకరమైన భూభాగాల్లోకి ప్రవేశించారు. నివేదికలను అనుసరించి కనీసం ఇద్దరు మరణించారు. దాంతో ఫెన్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారనే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరు ఈ నిధి వేట ఒక బూటకమని కొట్టి పారేశారు. -
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
సాక్షి, వేల్పూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన మండలంలోని వేల్పూరులో గల రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయ పూజారి ఆమంచి రవికుమార్ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య, అచ్చంపేట ఎస్ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగం కింద ఉండే పాణపట్టాన్ని పూర్తిగా కూల్చేసి భూమిలో మూడు అడుగుల లోతులో గొయ్యి తీశారు. స్వామివారి ఎదురుగా ఉండే నందీశ్వరుని రాతి విగ్రహాన్ని దిమ్మెపై నుంచి కింద పడేసి, ఆ ప్రదేశంలో లోతైన గొయ్యి తీసి నిధుల కోసం అన్వేషించిన ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడే గుప్త నిధుల కోసం పరిశీలించిన దాఖలాలున్నాయి. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్టా సమయంలో విగ్రహాల కింద బంగారు నిధులు భూస్థాపితం చేసినట్లు వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో కూడా పలు మార్లు ఇదే దేవాలయంలో తవ్వకాలు జరగడంతో దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని ఆవరణ చుట్టా ఇనుప తీగతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. తిరిగి ఇన్నేళ్లకు అక్రమార్కుల కళ్లు ఆలయంపై పడటం, ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్.ఐ పి.పట్టాభిరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
సూర్యాపేట జిల్లాలో గుప్తనిధుల కలకలం
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్నగర్ మండలంలో గుప్త నిధులకోసం తవ్వకాలు జరుపగా 20 కిలోల బంగారు నాణేలు బయటపడ్డాయి. అమరవరం గ్రామంలోని సింగతల గురువారెడ్డి అనే వ్యక్తి తన నివాసంలో మంగళవారం రాత్రి గుప్తనిధులకోసం తవ్వకాలు చేపట్టాడు. ఇందుకోసం నాలుగు మేకులను సైతం బలిచ్చాడు. ఈ తవ్వకాల్లో అతడికి 20 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. గుప్త నిధుల తవ్వకాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా గురువారెడ్డి ఇంటిపై దాడి చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పరీక్షించగా అవి రాగి, ఇత్తడితో తయారు చేసిన నకిలీ బంగారు నాణేలని తేలింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
గుప్తనిధుల కోసం తమ్ముడి కొడుకునే...
ఖానాపూర్ : ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. గుప్త నిధుల కోసం మనుషులను బలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామంలో సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి.. రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత పదిహేను రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్‌ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని చెప్పాడు. వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి పదిహేను రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
సముద్ర గర్భంలో భారీ ఆకారం ఏంటి?
-
సముద్ర గర్భంలో ఆ రహస్యం ఏంటి
సుదూర విశ్వం.. అనంత సముద్రం అతుచిక్కని రహస్యాలకు ఆనవాళ్లు. ఈ అనంత విశ్వంలో మన సౌర కుటుంబం కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సౌర కుటుంబంలో భూ గ్రహం మీద జీవం ఉన్నట్లే మిగతా విశ్వంలో జీవం మనుగడ ఉందా అనేది నేటికి అంతుచిక్కని రహస్యమే. ఈ అనుమానాలని మరింత పెంచేలా అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ లేదా యూఎఫ్ఓలు దర్శనమిస్తుంటాయి. ఇన్నాళ్లు భూమి, ఆకాశంలో సంచరించే వీటి గురించే సరైన సమాచారం లేని సమయంలో మరో కొత్త సవాల్ ప్రపంచ ముందుకు వచ్చింది. అది కూడా సముద్ర గర్భంలో. నిధి అన్యేషణకు వెళ్లిన వారికి అద్భుతం కనిపించింది. కానీ అదేంటో స్పష్టంగా తెలియలేదు. నిర్మాణం, దాని వయసు ఏవి భూ గ్రహ వాసులకు సంబంధించినవిగా లేవు. మరేంటా భారీ ఆకారం..? అంటే ఇది కూడా గ్రహాంతర వాసులకు సంబంధించినదేనని అంటున్నారు దాన్ని చూసిన వ్యక్తులు. వివరాల ప్రకారం.. డారెల్ మిక్లోస్ డిస్కవరీ చానెల్లో ట్రెజర్ హంట్ కార్యక్రమం చేస్తుంటాడు. సముద్రం పాలైన నిధి, నిక్షేపాల ఉనికి గురించి తెలుసుకోవడం ఇతని ప్రధాన విధి. ఇప్పటికే పలు సీజన్లుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో మిక్లోస్ అపార నిధి ఉన్న రెండు, మూడు స్థావరాలను కూడా గుర్తించాడు. ఈ అన్వేషణలో మిక్లోస్ నాసా మాజీ శాస్త్రవేత్త గోర్డాన్ కూపర్ రూపొందించిన మ్యాప్‌లతో పాటు సముద్ర గర్భంలో ఉన్న పరిసారాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించే స్కానర్‌తో పాటు ఇద్దరు మనుషులు పట్టే సబ్‌మెరైన్ లాంటి వాహనాన్ని వినియోగిస్తాడు. మరో సీజన్లో భాగంగా రూపొందించబోయే కార్యక్రమం కోసం ఈ సారి కరేబియన్ సమ్రుదాన్ని ఎన్నుకున్నాడు మిక్లోస్. బహమాస్ సమీపంలో సముద్రంలో 300 అడుగుల లోపల ప్రయాణించిన తర్వాత స్కానర్ అక్కడేదో అనుమానాస్పదమైన వస్తువు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని మిక్లోస్కు అందించింది. దాంతో అదేంటో పరిశీలించడానికి మిక్లోస్ స్కానర్ సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆ ఆకారాన్ని చూసిన మిక్లోస్కు నోట మాట రాలేదు. ఎందుకంటే సముద్రం అడుగున దాదాపు 1500 అడుగుల విస్తీర్ణంలో భారీ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కనిపించింది. చూడటానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఆ వస్తువును కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిది అనుకున్నాడు మిక్లోస్. అంతేకాక దాని చుట్టూ ముందుకు పొడుచుకువచ్చిన 15 అసాధారణ ఆకారాలు కూడా ఉన్నాయని తెలిపాడు. తాను ఇంతవరకూ ఇలాంటి వింత ఆకారాన్ని చూడలేదని.. ఇది మన ప్రకృతికి సంబంధించినది, మానవులు నిర్మించినది కాదని తెలిపాడు. తర్వాత సముద్రం పైకి వచ్చి తాను చూసిన వింత గురించి మిగతా వారికి చెప్పాడు మిక్లోస్. వెంటనే ఒక శాస్త్రవేత్తల బృందం అక్కడకు చేరుకుంది. మిక్లోస్ చెప్పిన ఆ అనుమానాస్పద ఆకారాన్ని ఒక ఓడ లాగా తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఆ ఓడ దాదాపు 5 వేళ సంవత్సరాల క్రితం నాటిదని చెప్పారు. అంతేకాక మానవ నిర్మితమైంది కూడా కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇంతకు ఇది ఎక్కడిది, దీని పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలియాలంటే మరి కాస్తా సమయం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ జనాలు మాత్రం ఇది కూడా ఏలియన్స్‌కు చెందినదిగానే చెప్పుకుంటున్నారు. అయితే ఓడ రూపంలో ఉన్న ఈ ఆకారం కూడా బెర్ముడా ట్రయాంగిల్‌కు సమీపంలోనే బయటపడటం గమనార్హం. -
లంకె బిందెలు తీస్తానంటూ..లైంగిక దాడి
సత్తుపల్లిరూరల్ : ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. కొన్ని వారాల పాటు పూజలు చేసి వాటిని బయటకు తీస్తా.. అప్పుడు మీరు కోటీశ్వరులవుతారు..’ అంటూ మంత్రగాడు మాయమాటలు చెప్పి ఓ మహిళను లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన ఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి బంగ్లాబజార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు మంగళవారం వివరాలను వెల్లడించారు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే గిరిజనులైన గుళ్ల రాంబాబు దంపతులు కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఉప్పలమ్మను పెట్టుకున్నారు. ఇందుకోసం కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం నుంచి పూజారి లక్ష్మీనర్సయ్యను పిలిపించారు. పూజల అనంతరం ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. వాటిని బయటకు తీయాలంటే కొన్ని పూజలు చేయాలి’ అని నమ్మబలికి వెళ్లిపోయాడు. ప్రత్యేక పూజ పేరుతో.. మళ్లీ వారం తర్వాత వచ్చి పూజలు చేస్తానంటూ రూ.30 వేలు తీసుకున్నాడు. రాంబాబు దంపతులను ఉప్పలమ్మ గుడి వెనుకకు(కర్టెన్ కట్టిన) వెళ్లాలని, తాను గుడి ముందు పూజ చేస్తానని చెప్పాడు. కాసేపటి తర్వాత ప్రత్యేక పూజ పేరుతో రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే నీ భర్త, పిల్లలను చంపేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కాగా, మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గంపా వసంతరావు ఇంటికి పూజ చేసేందుకు లక్ష్మీనర్సయ్య వచ్చాడు. రాంబాబును కూడా అక్కడికి పిలిచి మళ్లీ పూజలు చేయాలని చెప్పాడు. దీంతో తన భార్య అంగీకరించటం లేదని, తమకు పూజలు వద్దని రాంబాబు అనడంతో.. ‘నేను వచ్చి నీ భార్యను ఒప్పిస్తా’ నంటూ మళ్లీ రాంబాబు ఇంటికి వచ్చాడు. ఇప్పటి వరకు పూజలు చేశారు.. ఇలా మూడు నెలలు చేస్తే లంకెబిందెలు వస్తాయి ఆలోచించుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు. సోమవారం రాంబాబుకు ఫోన్ చేసి ఈ రోజు వస్తున్నానని, తప్పకుండా పూజ చేయాలని చెప్పాడు. రాంబాబు ఈ విషయాన్ని గ్రామ పెద్ద దుంపా వెంకన్నకు చెప్పాడు. గ్రామస్తులంతా మంత్రగాడి రాక కోసం కాపలా కాస్తుండగా, రాత్రి 10 గంటలకు టీఎస్04 ఈఎల్8504 నంబర్ గల కారులో మరో ఇద్దరితో కలిసి వచ్చాడు. పూజ చేసేప్పుడు కుటుంబ సభ్యులెవరూ రాకూడదంటూ రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లాడు. తన తర్వాత, మరో ఐదుగురు యువకులతో గడపాలని.. వారిని కూడా తీసుకొచ్చానని బలవంతం చేయటంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అప్పటికే అక్కడే వేచి ఉన్న గ్రామస్తులంతా గది వద్దకు రావటంతో లక్ష్మీనర్సయ్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితులు, గ్రామస్తులు కలిసి అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కోటలో మళ్లీ మొదలైన గుప్తనిధుల వేట
-
మరోసారి తాంత్రిక పూజల కలకలం
-
గుప్త నిధుల ఆశ ఫలించేనా?
సాక్షి, తుగ్గలి : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన తవ్వకాలు మొదట తూర్పు దిక్కు నుంచి పడమర, దక్షిణ దిశగా చేపట్టారు. అక్కడ ఇటుకలు, జంతువుల ఎముకలు బయటపడి సొరంగం మాదిరిగా ఉన్నా నిధుల ఆనవాళ్లు బయటపడలేదు. దీంతో శనివారం ఈశాన్యం వైపు తవ్వకాలు మొదలుపెట్టారు. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కావిటీ స్కానర్ల ద్వారా కోటలో పరీక్షించారు. సొరంగ మార్గాలు, గ్యాపులు ఉన్నాయా అని పరీక్షించామని, అలాంటివేవీ కన్పించలేదని అధికారులు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, సీఐ విక్రమసింహ పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో బయటపడిన అవశేషాలను ఇప్పటికే పురావస్తు అధికారులు పరిశీలించి.. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వీడని ఆశలు కోటలో గుప్త నిధుల కోసం 11 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నా వాటి ఆనవాళ్లు బయటపడలేదు. అయినప్పటికీ ఓవైపు ప్రయివేటు ముఠా సభ్యులు, అధికారులు మాత్రం పట్టు వీడడం లేదు. ఇంకా ఎన్ని రోజులైనా తవ్వకాలు జరిపేలా ఉన్నట్లు తెలుస్తోంది. తవ్వకాలపై పలు ఆరోపణలు రావడంతో చివరకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈ నెల 21న ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపడుతున్నామని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. తవ్వకాల కోసం తేనె రమేష్, స్వామిదాసు, ఆర్కే రాజు మూడు నెలల క్రితం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మినరల్ యాక్ట్ ప్రకారం విలువైన ఖనిజాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తవ్వకాలు చేస్తున్నట్లు వివరించారు. అయితే.. అధికారులు చెబుతున్నట్లు కోటలో ఏనాడూ వాల్యుబుల్ మినరల్స్ కోసం గానీ, ఇతర నిక్షేపాల కోసం గానీ సర్వేలు నిర్వహించిన దాఖలాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాల ప్రారంభం ముందు గానీ, ఆ తరువాత గానీ వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయని అధికారులు చెప్పలేదు. రచ్చ తీవ్రతరం కావడంతో నాలుగు రోజులు క్రితం ఎందుకో ఉన్నఫలంగా వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇందులో అంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ పెద్దల సాయంతోనే తవ్వకాలు చేపట్టారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. -
పసిడి తవ్వకాలపై జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఆర్కియోలాజిస్ట్స్ చేపట్టిన తవ్వకాలపై జోక్యం చేసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి శోభన్ సర్కార్ కలను ఆధారం చేసుకుని నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అనేక విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. 19 శతాబ్దంలో పూడ్చిన వేయి టన్నుల బంగారం కోసం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టన తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. అయితే జిల్లా అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఓ సాధువు కల ఆధారంగా తవ్వకాలు చేపట్టడాన్ని విమర్శించిన నరేంద్ర మోడీ సోమవారం ఈ వ్యవహారంపై యూటర్న్ తీసుకున్నారు. శోభన్ సర్కార్ ను తాజాగా మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దోడియా ఖేరా గ్రామంలో తవ్వకాలు చేపట్టిన అధికారులు కొన్ని సందేహాలు తలెత్తడంతో ఆపివేశారు. ఈ తవ్వకాలపై దాఖలైన అభ్యర్థనపై విచారించిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.