
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్‌నగర్ మండలంలో గుప్త నిధులకోసం తవ్వకాలు జరుపగా 20 కిలోల బంగారు నాణేలు బయటపడ్డాయి. అమరవరం గ్రామంలోని సింగతల గురువారెడ్డి అనే వ్యక్తి తన నివాసంలో మంగళవారం రాత్రి గుప్తనిధులకోసం తవ్వకాలు చేపట్టాడు. ఇందుకోసం నాలుగు మేకులను సైతం బలిచ్చాడు. ఈ తవ్వకాల్లో అతడికి 20 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. గుప్త నిధుల తవ్వకాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా గురువారెడ్డి ఇంటిపై దాడి చేశారు.
అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పరీక్షించగా అవి రాగి, ఇత్తడితో తయారు చేసిన నకిలీ బంగారు నాణేలని తేలింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment