కార్మికులకు దొరికిన బంగారు వస్తువులు
యశవంతపుర: కాఫీతోటలో పురాతన బంగారు అభరణాలు బయట పడ్డాయి. కొడగు జిల్లా సిద్ధాపుర అమ్మతి సమీపంలో ఆనందపుర గ్రామానికి చెందిన టాటా కాఫీ సంస్థకు చెందిన తోటలో పని చేస్తున్న కార్మికులకు ఇవి చిక్కాయి. తోటలోని గుడి వద్ద కార్మికులు పని చేస్తుండగా పురాతన బంగారు ఆభరణాలు దొరికాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తోటలో అతిపురాతన ఈశ్వరుని గుడి ఉంది.
మంగళవారం కార్మికులు అక్కడే పని చేస్తుండగా మట్టిలో ఈ ప్రాచీన బంగారు నిధి బయట పడ్డాయి. వెంటనే కార్మికులు సంస్థ అధికారుల దృష్టికి తెచ్చారు. అందులో పాత ఉంగరం, ఖడ్గం ఉన్నాయి. సిద్ధాపుర పోలీసులు పరిశీలించారు. విరాజపేట తహశీల్దార్ బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏ కాలం నాటివి అనేది పురావస్తు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment