మైసూరులో మంటల గోల
మైసూరు: ఓ వైపు చాముండి కొండల అడవుల్లో కార్చిచ్చు చెలరేగిన వైనం మరువకముందే కింద మైసూరు నగరంలో శనివారం ఆకాశాన్నంటే పొగ రేగడం ఆందోళన కలిగించింది. నగరంలో వస్తు ప్రదర్శన మైదానంలో చెత్తరాశులకు ఎవరో దుండగులు నిప్పు పెట్టారు. అలాగే గోల్ఫ్ క్లబ్ వద్ద ఉన్న చెత్త కుప్పలకు మంట అంటించారు. వస్తు ప్రదర్శన మైదానంలో టన్నుల కొద్దీ చెత్త ఉంది. కన్నడ నటుడు డాలి ధనంజయ పెళ్ళి మండపం సెట్‌కు కూడా మంటలు వ్యాపించి కాలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. గోల్ఫ్ క్లబ్ సమీపంలోనే గోశాల ఉంది. అదృష్టవశాత్తు అక్కడకు మంటలు వ్యాపించకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. ఇక చాముండి కొండపై శనివారం కూడా మంటలు, పొగలు కనిపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేశారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇలా అగ్ని ప్రమాదాలు పెరగడంపై నగరవాసుల్లో గుబులు ఏర్పడింది.
రెండుచోట్ల
చెత్తరాశులకు నిప్పు
మైసూరులో మంటల గోల
Comments
Please login to add a commentAdd a comment