హుబ్లీ: ప్రజాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను కాపాడుకొని సకాలంలో సేవలు పూర్తయ్యేలా సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టంపై భయాలు వీడాలి. అయితే ప్రజా పనుల్లో పారదర్శకతను కాపాడుకోవాలని జిల్లాధికారిణి దివ్యప్రభు సూచించారు. జెడ్పీ మీటింగ్ హాల్‌లో సంబంధిత అధికారులకు ఆర్‌టీఐపై ఆవగాహన గురించి సదస్సును ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఆర్‌టీఐ ద్వారా దాఖలయ్యే దరఖాస్తులను పరిశీలించి సంబంధించిన సమాచారం ఉన్న అధికారులకు బదిలీ చేయాలన్నారు. ఒక వేళ తమ వద్దే సమాచారం ఉంటే అందజేయాలన్నారు. మొత్తం మీద ఆర్‌టీఐ దరఖాస్తుకు గడువులోగా సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం అన్నారు. ఉదాసీనత, నిర్లక్ష్యం, జాప్యం చేయడం తగదన్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని సమాచారంతో కూడిన అధికారిగా రూపొందించే ఉద్దేశంతో సమాచారం హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషన్ విశ్రాంత కమిషనర్ డాక్టర్ శేఖర్ సజ్జన, జెడ్పీ ఉప కార్యదర్శి మూగనూరమఠ, ముఖ్య యోజన అధికారి దీపక్ మడివాళ, రేఖ డొళ్లినవర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment