అక్రమాల పుట్టలు.. రిసార్టులు
శ్రీకృష్ణ జాతర
బొమ్మనహళ్లి: కొడగు జిల్లాలోని నాపోక్లు పట్టణం వద్ద అయ్యంగేరి గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ శ్రీకృష్ణ చిన్నతప్ప దేవుని జాతర శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. మూల విరాట్‌కు పూజలు, విశేష అలంకారం చేశారు. తరువాత విగ్రహాలను మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. అలాగే హొద్దూరులోని శ్రీశాస్త ఈశ్వర ఆలయం వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నాటుకోళ్ల తలలు మాయం
యశవంతపుర: గుర్తు తెలియని జంతువు కోళ్ల తలను మాత్రమే తిన్న విచిత్ర ఘటన గదగ జిల్లా ముండరగి తాలూకా గంగాపుర గ్రామంలో జరిగింది. శారవ్వ అనే రైతు మహిళ అనేక ఏళ్ల నుంచి నాటు కోళ్లు, పొట్టేళ్లను సాకుతోంది. శుక్రవారం రాత్రి ఏదో జంతువు దాడి చేసింది. శనివారం ఉదయం శారవ్వ లేచిచూడగా సుమారు 30 నాటు కోళ్లు తలలు లేకుండా చనిపోయి ఉన్నాయి. ఆ జంతువు తలలను మాత్రమే భక్షించినట్లు తెలుస్తోంది. గ్రామస్థుల్లో ఈ సంఘటన అందోళన కలిగిస్తోంది. కోళ్లనే నమ్ముకొని జీవించే శారవ్వ ఆర్థికంగా నష్టపోయినట్లు విలపించింది.
వడ్డీ వేధింపులు..
వీడియో తీసి ఆత్మహత్య
తుమకూరు: రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ దురాగతాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చినా అమానుషాలు ఆగడం లేదు. మీటర్ వడ్డీదారుల వేధింపులతో విరక్తిచెంది ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరులోని బటవాడిలో జరిగింది. వివరాలు.. స్థానిక మహాలక్ష్మినగర నివాసి అంజనమూర్తి (35) ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. పలు చోట్ల వడ్డీలకు సుమారు రూ.5 లక్షల మేర అప్పులు చేశాడు. సుప్రీం ఫైనాన్స్, ఫైనాన్స్ వెంకీతో పాటు పలువురి నుంచి అప్పులు చెల్లించాలని వేధింపులు అధికమైనట్లు వాపోయారు. వారి హింసను తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో తెలిపాడు. తన కుటుంబానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యాత్సంద్ర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఏటీఎం మోసగాళ్ల అరెస్టు
శివాజీనగర: ఏటీఎంల వద్ద వృద్ధులను మోసగిస్తున్న ముగ్గురు వంచకులను నగర పులకేశినగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన నయాజ్, సుధాంశు, రజీబ్ నిందితులు. వీరు ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి మోసాలు చేయసాగారు. జనం తక్కువగా ఉన్న ఏటీఎంల వద్ద మకాం వేసి, వృద్ధులు వచ్చి నగదు విత్ డ్రా చేసేందుకు సాయం అడిగినప్పుడు వారిచే డెబిట్ కార్డు, పిన్ అడిగి తెలుసుకునేవారు. తరువాత నకిలీ కార్డును ఇచ్చేవారు. అసలైన కార్డుతో నగదు విత్‌డ్రా చేసుకునేవారు. ఈ డబ్బుతో భార్యలతో కలిసి షికార్లకు వెళ్లి విలాస జీవితం గడిపేవారని పోలీసులు తెలిపారు. ముగ్గురినీ తీవ్రంగా విచారిస్తున్నట్లు చెప్పారు.
ఆ మరణం.. పరువు హత్య?
● భర్త, మరిది ఘాతుకం!
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకా దుగ్గహళ్లి గ్రామంలో కొన్ని నెలల కిందట ఓ మహిళ అనుమానాస్పదంగా మరణించగా, పరువు హత్యగా జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాలు.. దుగ్గహళ్లి గ్రామ నివాసి సుచిత్ర (38) అనే మహిళకు 15 ఏళ్ల కిత్రం ఏచగుండ్ల గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా సుచిత్రపై భర్తకి అనుమానాలు తలెత్తాయి. పక్క కాలనీ వాసి, వేరే కులానికి చెందిన వ్యక్తితో సంబంధం ఉన్నట్లుగా సందేహించేవాడు. తన తమ్ముడు సతీష్‌తో కూడా చెప్పాడు. కాగా సతీష్.. అన్న కుటుంబాన్ని గత ఏడాది జూలై 22న దుగ్గహళ్లికి రప్పించాడు. సతీష్ కొత్తగా నిర్మిస్తున్న కోళ్లఫారంలో సుచిత్ర చనిపోయింది. ఈ విషయాన్ని అటు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని ఏచగుండ్లకు తీసుకెళ్లి హడావుడిగా అంత్యక్రియలు జరిపారు. సతీష్ ఇటీవల వదినను తానే చంపానని దర్జాగా అందరికీ చెప్పుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉన్న సుచిత్ర ఉన్నపళంగా మరణించడంపై గ్రామస్తుల్లో ముందునుంచీ అనుమానాలు ఉన్నాయి. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
బుల్లెట్‌పై పోకిరీల దూకుడు.. మహిళ దుర్మరణం
మైసూరు: పోకిరీల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది. వేగంగా ఢీకొనడంతో స్కూటర్‌పై వెళ్తున్న మహిళ మృత్యువాత పడింది. మైసూరు శ్యాదనహళ్లి నివాసి అభిలాష (39) మృతురాలు. అభిలాష ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం ఆమె స్కూటర్‌లో ఇంటికి తిరిగి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకులో దూసుకొచ్చారు. స్కూటర్‌ను ఢీకొనడంతో ఆమె పడిపోయింది. స్థానికులు వెంటనే పోకిరీలను పట్టుకుని కొడుతుండగా బుల్లెట్‌ను వదిలేసి పరారయ్యారు. ప్రజలు అంబులెన్స్‌ను పిలిపించి తీవ్రంగా గాయపడిన అభిలాషను కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె మృత్యువుతో పోరాడుతూ శనివారం చనిపోయింది. వీవీపురం ట్రాఫిక్ పోలీసులు గాలింపు జరిపి బైకిస్టులు ప్రేమ్ కుమార్, సుజిత్, మరొకరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
గుండెపోటుకు బాలుడి బలి
తుమకూరు: నేటిరోజుల్లో గుండెపోటు చిన్నారులను కూడా కబళిస్తోంది. 10వ తరగతి అబ్బాయి ఒకరు మరణించిన ఘటన జిల్లాలోని చిక్కనాయకనహళ్ళి జీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగింది. జీబీ రాహుల్ (16) అనే బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పొరుగున ఉన్న బైరాపుర నుంచి రోజూ వచ్చి వెళ్తుంటాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంట్లో చదువుకుంటూ ఉండగా ఎదలో తీవ్రంగా నొప్పి వస్తోందని చెప్పాడు. కుటుంబ సభ్యులు హులియూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండెపోటే కారణం కావచ్చని వైద్యులు తెలిపారు.
మెట్రో ప్రయాణికుల్లో క్షీణత
శివాజీనగర: బెంగళూరులో నమ్మ మెట్రో రైలు చార్జీలు పెరిగి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చార్జీలు పెరిగాక సుమారు 6.26 లక్షల మంది మెట్రో రైళ్లకు రావడం మానేశారు. మెట్రో గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 18 వరకు ప్రయాణికుల సంఖ్య రోజుకు 2.32 లక్షలకు తగ్గిపోయింది. 6.26 లక్షల మంది సొంత వాహనం, లేదా సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి చార్జీలు భగ్గుమన్నాయి. బై బై మెట్రో అంటూ ప్రయాణికులు ఆన్‌లైన్లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో మెట్రో సంస్థ కొన్ని స్టేజ్‌లలో అధికంగా ఉన్న రేట్లను కొంచెం సవరించింది. కానీ ప్రయాణికులు సంతృప్తి చెందలేదు. మరోవైపు చార్జీలకు వ్యతిరేకంగా శనివారం స్వతంత్రపార్కులో పలు ప్రజాసంఘాలు ధర్నా చేశాయి.
కోర్ ఏరియాకు మంగళం
ఓ రిసార్టును ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ, పర్యాటక, ఆహార, పర్యావరణ తదితర శాఖల నుంచి ఆమోదం పొందాలి. ప్రభుత్వానికి నిర్దేశిత ఫీజులను చెల్లించి, ప్లాన్ ప్రకారం కట్టడాలను ఏర్పాటు చేయాలి. కానీ దీనినెవరూ పట్టించుకోరు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ గుడిసెలు వేసి రిసార్టు అంటారు. హంపీ కోర్ ప్లాన్ ప్రకారం 42 కిలోమీటర్లు హంపీ చారిత్రక ప్రదేశం విస్తరించింది. అందులో రిసార్టులు, శాశ్వత కట్టడాలు ఉండరాదు. కానీ కోర్ ఏరియాలో వందలాది హోటళ్లు, విడిదిల్లులు ఉన్నాయి. ఇటు హొసపేటె వైపు, అటువైపు ఆనెగొంది, రామదుర్గ, చిక్కరాంపుర, సణాపుర, హనుమానహళ్లి, విరుపాపురగడ్డ తదితరాలలో విస్తారంగా అక్రమ రిసార్టులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హంపీ వరల్డ్ హెరిటేజ్ మేనేజ్‌మెంట్ ఏరియా (హెచ్‌డబ్ల్యూఏఎంఏ)ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం అక్రమ రిసార్టులకు అప్పుడప్పుడు హెచ్చరికలు చేస్తోంది తప్ప పూర్తి చర్యలు తీసుకోవడం లేదు.
సాక్షి, బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ శిల్పకళను, తుంగభద్ర నది సౌందర్యాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఒక్కరోజులో హంపీని చూడడం కష్టం. ఇక విదేశీయులు, టెక్కీలు, సంపన్నులు హంపీకి రావడంతో పాటు అక్కడ రిసార్టుల్లో సేదతీరుతుంటారు. చుట్టుపక్కల ఆనెగుంది, గంగావతి, శానపురం, తిమ్మాపుర, బసపురం, తదితర గ్రామాల్లో వందలాదిగా రిసార్టులు వెలిశాయి. పర్యాటకులకు వసతి, ఆహార సేవలను అందిస్తుంటాయి. అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ప్రకృతి అందాలు
హంపీ– గంగావతి, పరిసర ప్రాంతాలలో ఎతైన కొండల పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ప్రకృతి అందాలకు ఆటపట్టుగా ఉంది. కొందరు ఈ ప్రాంతాన్ని పుణ్యభూమిగా భావించి సాక్షాత్తు శివుడు విరుపాక్షేశ్వరునికి అవతరించారని భక్తులు హంపీని సందర్శిస్తుంటారు. ఆంజనేయస్వామి జన్మస్థానం అయిన అంజనాద్రి కొండ ఎదురుగా ఆనెగుందిలో వెలసి ఉంది.
యజమానుల నిర్వాకాలు
పర్యాటకం ముసుగులో హంపీ– ఆనెగుంది పరిసరాల్లో కొన్ని రిసార్టులలో నిర్వాహకుల కాసుల కోసం కక్కుర్తి పడి అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయాలు, జూదాలకు నిలయంగా మార్చారు. యువతీ యువకులు, జంటలు ఎవరైనా రిసార్టుల్లో బస చేయవచ్చు. డబ్బులు చెల్లిస్తే చాలు, అన్ని సౌకర్యాలూ సమకూరుతాయి. ఓపెన్ బెడ్లతో పాటు కుటీర తరహాలో, పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా గడ్డి, తడకలు, మట్టితో కుటీరాలు ఆకట్టుకుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనీసం వారం నుంచి నెల వరకూ మకాం వేస్తుంటారు. రిసార్టులలో మద్యం విక్రయిస్తున్నారా? గంజా విక్రయిస్తున్నారా ? ఇంకా అనేక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా అనేది అధికారులు చూడడం లేదు. కొందరు రిసార్టు యజమానులు ఆడిందే ఆటా– పాడిందే పాటగా పర్యాటకులను దోచుకుంటున్నారు.
గొడవలు, సమస్యలు
డాక్టర్ అనన్యరావు మృతి తర్వాత రిసార్టుల బాగోతం పై ఈ ప్రాంతంలో స్థానికులు తీవ్ర ఆరోపణలు చేశారు. రిసార్టులలో బసచేసేవారు గంజాయి, మత్తు పదార్థాలు సేవించి గొడవలకు దిగుతుంటారని చెప్పారు. రిసార్టుల నుంచి వచ్చే చెత్తాచెదారం, మురుగు వల్ల కాలుష్యం పెరిగి రోగాలు వస్తున్నాయి, పారిశుధ్య సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. టూరిజాన్ని ప్రోత్సహించాల్సిందే, కానీ ఆ పేరుతో తప్పుడు పనులను నిర్వహించడం సబబు కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అక్రమ రిసార్టుల పై నిషేధం విధిస్తున్నామనే చెబుతోంది కానీ కానీ ఏటేటా మరిన్ని రిసార్టులు వెలుస్తున్నాయి. ఆహ్లాదం, వినోదం పేరిట జరగరానివి సాగుతుంటాయి. ఎవరికి వెళ్లాల్సిన వాటా వారికి ప్రతి నెలా చేరిపోతోందని, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మనుషులే ఇక్కడ రిసార్టులను నడుపుతున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.
బీటెక్ విద్యార్థినిపై లైంగికదాడి!
యశవంతపుర: సిలికాన్ సిటీలో తరచూ అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉపాధి కోసం వచ్చిన యువతిపై కొందరు మూకుమ్మడి అత్యాచారం ఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. నగరంలోని మైకో లేఔట్ స్టేషన్ పరిధిలో పేరుపొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థినిపై ఆమె స్నేహితుడే లైంగికదాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువతితో సన్నిహితంగా వ్యవహరించి అత్యాచారం చేశాడని సమాచారం.
స్నేహమయిపై చేతబడి?
యశవంతపుర: మైసూరు ముడా స్థలాల గురించి సీఎం సిద్దరామయ్య కుటుంబం మీద లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదు చేసిన స్నేహమయి కృష్ణపై చేతబడి చేసినట్లు తెలిసింది. బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహమయి కృష్ణపై బెంగళూరు అశోకనగర శ్మశానంలో నిందితులు పొట్టేళ్లను బలి ఇచ్చి చేతబడి చేశారు. ఆ రక్తాన్ని స్నేహమయి కృష్ణ, గంగరాజు అనేవారి చిత్రాలకు అంటించి కాళికాంబదేవి మెడలో వేశారు. చేతబడి వీడియో దృశ్యాలు శ్రీరామ సేనె నాయకుడు ప్రసాద్ అత్తావర్ ముబైల్లో బయట పడ్డాయి.
కాపాడు తల్లీ...
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని చిణ్య గ్రామంలో ప్రసిద్ధ సోమనహళ్ళి దేవస్థానంలో అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉత్సవ విగ్రహాన్ని పూజారి తలపై పెట్టుకుని డప్పువాయిద్యాల మధ్య ముందుకు సాగారు. శనివారం ఈ జాతర వేడుకల్లో చుట్టుపక్కల 12 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని కళ్లారా చూసి తరించారు.
కుంభమేళాకు టికెట్ల పేరుతో స్కాం
బనశంకరి: మహా కుంభమేళాకు వెళ్లడానికి టికెట్ బుక్ చేస్తామని అర్చకునికి రూ.1.60 లక్షలు ముంచేశారు. నగరంలోని వయ్యాలికావల్ నివాసి, కుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్ వెళ్లడానికి ఇంటర్నెట్లో వెతికాడు. ఫేస్‌బుక్‌లో కార్తికేయన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో ప్రకటన చూసి సంప్రదించాడు. టికెట్లు బుక్ చేస్తామని నమ్మించి దశలవారీగా రూ.1.60 లక్షలను ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నారు. నగదు వెళ్లింది కానీ టికెట్ రాలేదు.
గౌరిబిదనూరు కన్నడనాట ఎక్కువ వర్షాలు కురిసేది కోస్తా తీరం, పడమటి కనుమలలో. సస్యశ్యామలమైన ఈ కనుమలలో శివమొగ్గ జిల్లాలోని ఆగొంబె అడవుల్లో విస్తారమైన వర్షం కురుస్తుంది. ఈ వర్షాన్ని ప్రభుత్వ వాతావరణ శాఖ నమోదు చేస్తుంది. కానీ ఓ మామూలు వ్యక్తి ఈ రంగంలో నైపుణ్యం సాధించారు. వర్షాల గురించి ఆయన అనధికారికంగా పీహెచ్‌డీ చేశారని చెప్పాలి. ఏ ప్రదేశంలో ఎక్కువ వర్షం కురుస్తుంది, ఏడాది పొడుగునా ప్రతి రోజూ వర్షపాతాన్ని నమోదు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా తోటి రైతులకు వర్షం ఎప్పుడొస్తుంది, వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాలను తోటి రైతులకు సమాచార మందిస్తారు .
ఎక్కడ ఉంటారు?
దక్షిణ కన్నడ జిల్లాలో సుళ్య తాలూకా బాళలి గ్రామానికి చెందిన రైతు పిజిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ ఘనత సాధించారని చెప్పాలి. ఎప్పుడు, ఎక్కడ ఎంత వర్షం కురుస్తుంది, వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది చాలా కచ్చితంగా చెప్పగలరని పేరుంది. నిరంతరం ఆ సమాచారాన్ని రైతులకు వాట్సాప్ గ్రూపుల్లో పంపుతారు.
రోజూ ఉదయమే
ప్రసాద్ గత 49 సంవత్సరాలుగా అలుపెరుగక ప్రతిరోజూ వర్షపాతాన్ని లెక్కిస్తున్నారు. సొంతంగా తయారు చేసుకున్న ఒక గాజు పరీక్ష నాళికను మిద్దైపెన ఉంచి గుర్తిస్తారు. రోజూ ఉదయం 7 గంటలకు వర్షపాతం నమోదు చేస్తారు. ఆ రోజు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు.
వానలు కరతలామలకం
వేసవిలో వర్షాన్ని తెచ్చేవి రేవతి, అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు కాగా, ముంగారులో మృగశిరా, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మాఘ నక్షత్రాల సమయంలో వానలు పడతాయని ప్రసాద్ చెబుతారు. ఇంకా ఏయే రాశులు, నక్షత్రాల సమయంలో వర్షం ఎక్కువగా కురుస్తుందో ఈయన మదింపు చేశారు. పునర్వసులో జూలై 5 నుంచి 18 వరకు, పుష్య నక్షత్రంలో జులై 19 నుంచి ఆగస్టు 1 వరకు దండిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వివరాలతో పెద్ద పుస్తకాలే రూపొందించారు. ఆ సమాచారాన్ని కోరిన రైతులకు, పరిశోధనలకు అందజేస్తుంటానని తెలిపారు.
న్యూస్‌రీల్
హంపీ పరిసరాల్లో అక్రమ విడిది కేంద్రాలు
ప్రభుత్వ అనుమతులు శూన్యం
అధికారుల పర్యవేక్షణ లోపం
పర్యాటకురాలి మృతితో
మరోసారి బట్టబయలు
వర్షాలకు ఆప్తమిత్ర
49 ఏళ్లుగా వర్షపాతం లెక్కింపు
రైతులకు ఉపయుక్త సమాచారం
దక్షిణ కన్నడవాసి ప్రసాద్ సేవ
అసాంఘిక కార్యక్రమాలు!
ఇక దేశ విదేశీ పర్యాటకులకు రిసార్టులు విలాస కేంద్రాలుగా మారిపోయాయి. అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మార్చుకోవడంతో పలు అనర్థాలు దారితీస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి హంపీ వీక్షణకు వచ్చిన యువ వైద్యురాలు అనన్యరావు సణాపుర వద్ద నది పక్కనే రిసార్టులో బసచేయడం, నదిలో ఈత కొట్టాలని ఎత్తైన బండరాయిపై నుంచి దూకి గల్లంతు కావడం తెలిసిందే. సరదా కాస్తా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దీంతో హంపీలోని రిసార్టుల బాగోతాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అనన్యరావు కేసులో స్థానిక పోలీసులు రిసార్టు నిర్వాహకుల్ని కూడా విచారించారు.
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
అక్రమాల పుట్టలు.. రిసార్టులు
Comments
Please login to add a commentAdd a comment