సరిహద్దుల్లో అమానుషం
యశవంతపుర: బెళగావిలో కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్‌పై దాడి సంఘటన దుమారం రేపుతోంది. కండక్టర్‌ను కొట్టినందుకు మైనర్‌తో పాటు నలుగురు నిందితులను బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఓ బాలిక ఫిర్యాదుచేసిందని కండక్టర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసుపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి.
వివరాలు.. బస్సు కండక్టర్ మహదేవప్ప మల్లప్ప హుక్కేరిపై శుక్రవారం సణ్ణ బాళేకుంద్రి వద్ద మరాఠీభాష మాట్లాడలేదనే కోపంతో 20 మంది యువకులు దాడి చేసినట్లు సమాచారం. యువకులను కన్నడలో మాట్లాడమని కండక్టర్ కోరడమే తప్పిదమైంది. బాధితుని ఫిర్యాదుతో కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి హిండలగా జైలుకు తరలించారు. కండక్టర్‌ను గుంపు కొట్టే వీడియోలు వ్యాప్తి చెందాయి. శనివారం కేసు మలుపు తిరిగింది. కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ బాలిక మారిహళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కండక్టర్‌పై పోక్సో కేసును నమోదు చేశారు. పోక్సో కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాల నాయకులు ఠాణా ఎదుట ధర్నా చేశారు. కండక్టర్‌కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
మహారాష్ట్రలో బస్సు అడ్డగింత
మరోవైపు శనివారం ఉదయం మరాఠా సంఘాల కార్యకర్తలు శనివారం కొల్హాపుర నుంచి బెళగావికి వెళుతున్న బస్సును అడ్డగించారు. బస్సుపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ గొడవలతో ఉద్రిక్తత చెలరేగే ప్రమాదముంది.
కండక్టర్‌పై దాడి చేసి.. పైగా పోక్సో కేసు
కన్నడలో
మాట్లాడడమే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment