సాక్షి, బళ్లారి: నెల రోజులు క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంటను భారీ అదృష్టం వరించింది. షాపులో బంగారం కొన్నందుకు లాటరీ తీయగా, ఆ దంపతులకే కేజీ బంగారం కై వసమైంది. వివరాలు.. బళ్లారి తాలూకాలోని కప్పగల్ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుమార్తె రుచిత పెళ్లిని అల్లీపురానికి చెందిన నాగార్జునతో పెళ్లి జరిపించారు. ఈ సమయంలో బళ్లారిలోని ఒక నగల షాపులో తాళిబొట్టు కొనుగోలు చేశారు.
అప్పటికే కర్ణాటక రాష్ట్ర జ్యువెలరీ ఫెడరేషన్ సంస్థ ఆఽధ్వర్యంలో ఏప్రిల్ 10 నుంచి రాష్ట్రంలో బంగారు షాపుల్లో రూ.5 వేలకు పైగా బంగారం కొనుగోలు చేసిన వారికి లాటరీ కూపన్లు పంపిణీ చేశారు. నాగరాజుకు కూడా షాపులో కూపన్ ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో 12 లక్షలకుపైగా కూపన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ తీయగా, నాగరాజుకు ఒక కేజీ బంగారం తగిలిందని ప్రకటించారు.
ఇప్పుడున్న ధరల ప్రకారం కనీసం రూ. 55 లక్షల విలువ చేస్తుంది. ఆదివారం నూతన దంపతులు నాగార్జున, రుచితలకు ఒక కేజీ బంగారాన్ని అందచేశారు. ఇందులో జ్యువెలరీ ఫెడరేషన్ ప్రముఖులు పాల్గొని జంటను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment