
చిన్నారి మృతదేహం
లక్నో : గుప్త నిధుల మోజులో పడి కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరబంకిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, బరబంకిలోని కుర్ద్ మావ్ గ్రామానికి చెందిన ఆలం అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని ఓ మాంత్రికుడు నమ్మబలికాడు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే 10 సంవత్సరాల ఆలం కూతురిపై కొన్ని పూజలు చేయాలని చెప్పాడు. మాంత్రికుడి మాటలు నమ్మిన ఆలం తన కూతుర్ని పూజలో కూర్చోబెట్టాడు. పూజలో భాగంగా చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. అడ్డు వచ్చిన భార్యను కూడా కొట్టాడు. ( మరోసారి బుక్కైన మిలింద్ సోమన్ )
తీవ్రగాయాలపాలైన కూతురు మృతి చెందటంతో ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో పూడ్చిన మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. తీవ్ర గాయాల కారణంగానే ఆలం కూతురు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ( మసీదు పెద్దకు భారీ జరిమానా: ఎందుకంటే..)
Comments
Please login to add a commentAdd a comment